Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Green Tea : ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే

    1 day ago

    Green Tea Daily Intake : గ్రీన్ టీ ఆరోగ్యానికి ఉపయోగకరమైన పానీయమే అయినా.. దీన్ని తాగేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఏ సమయంలో తాగకూడదో.. ఎప్పుడు మంచిదో చూసేద్దాం. 

    Green Tea And Health : ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న చాలామంది గ్రీన్ టీ తీసుకుంటారు. కొందరిలో ఇది రోజువారీ అలవాటుగా మారిపోయింది. రుచి చేదుగా ఉన్నా.. బరువు తగ్గడం నుంచి గుండె ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని కచ్చితంగా డైట్లో చేర్చుకునేవారు కొందరు. మరి ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా? లేక కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలా? నిపుణులు చెప్తోన్న సూచనలు ఇవే.

    గ్రీన్ టీ

    గ్రీన్ టీ అనేది Camellia sinensis అనే మొక్క ఆకుల నుంచి తయారవుతుంది. సాధారణ టీతో పోలిస్తే దీనిని తక్కువగా ప్రాసెస్ చేస్తారు. అందువల్ల ఇందులో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మరి దీనిని ప్రతిరోజూ తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూసేద్దాం. 

    ఫ్రీ రాడికల్స్ నష్టం 

    గ్రీన్ టీలో ఉండే క్యాటెకిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో కణాల నష్టం తగ్గి మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    గుండె ఆరోగ్యానికి మేలు

    కొన్ని అధ్యయనాల ప్రకారం గ్రీన్ టీ క్రమం తప్పకుండా తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

    బరువు నియంత్రణ

    గ్రీన్ టీలోని కొన్ని సమ్మేళనాలు మెటబాలిజాన్ని కొంత మేర పెంచి కొవ్వు కరిగే ప్రక్రియకు సహాయపడవచ్చు. అయితే కేవలం గ్రీన్ టీతోనే బరువు తగ్గరు. 

    మెదడు పనితీరుకై

    గ్రీన్ టీలో కెఫిన్‌తో పాటు ఎల్-థియానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఏకాగ్రత, అప్రమత్తత, మానసిక ప్రశాంతతను పెంచడంలో సహాయపడవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం తాగవచ్చు.

    రోగనిరోధక శక్తి

    గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు శరీర రక్షణ వ్యవస్థను బలపరచడంలో కొంతవరకు ఉపయోగపడతాయి. ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటుంది. సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. 

    గ్రీన్ టీ తాగేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

    రోజుకు 2–3 కప్పులు సురక్షితంగా భావిస్తారు. అయితే అధికంగా తాగితే కెఫిన్ ప్రభావం వల్ల నిద్రలేమి, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు రావచ్చు. కొంతమందిలో ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే ఎసిడిటీ, వికారం లేదా కడుపు అసౌకర్యం కలగవచ్చు. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగితే ఆహారంలో ఉండే ఐరన్ శరీరానికి పూర్తిగా అందకుండా చేసే అవకాశం ఉంది. అందుకే భోజనం తర్వాత కనీసం గంట గ్యాప్ ఇవ్వడం మంచిది. రక్తాన్ని పలుచన చేసే మందులు లేదా కొన్ని ఇతర ఔషధాలు తీసుకునేవారు గ్రీన్ టీని ఎక్కువగా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

    గ్రీన్ టీ తాగడానికి సరైన సమయం 

    ఉదయం అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం సమయంలో తాగడం మంచిది. రాత్రి నిద్రకు దగ్గరగా తాగితే కెఫిన్ కారణంగా నిద్రకు ఆటంకం కలగవచ్చు. సమతుల్య ఆహారం, వ్యాయామంతో పాటు రోజుకు 2–3 కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితాలు చూస్తారు. 

    Click here to Read More
    Previous Article
    జులై 3వ వారంలో తల్లికి వందనం నిధుల విడుదల…
    Next Article
    Telangana Congress Incharge Controversy: మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?

    Related లైఫ్‌స్టైల్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment