Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Peddi Collections Day 16: మూడో వారంలో కిందకు పడినా స్టడీగా... రామ్ చరణ్ 'పెద్ది' కలెక్షన్లు... 16వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    2 days ago

    Peddi Box Office Collection Day 16: రామ్ చరణ్ 'పెద్ది' మూడో వారంలో అడుగు పెట్టింది. రెండు వారాల తర్వాత సినిమా కిందకు పడినా... బాక్సాఫీస్ బరిలో స్టడీగా నిలబడింది.

    Peddi Movie 16 Days Worldwide Collection: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. మూడో వారంలో అడుగుపెట్టింది. బాక్సాఫీస్ బరిలో రెండు వారాల తర్వాత సినిమా కలెక్షన్లు కొంచెం కిందకు పడ్డాయి. అయినా స్టడీగా నిలబడింది సినిమా. థియేటర్లలో విడుదలైన 16వ రోజు, మూడో శుక్రవారం సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే...

    'పెద్ది' 16వ రోజు కలెక్షన్లు... శుక్రవారం @ 1.75 కోట్లు!
    Peddi 16th Day Collection India Net: సమంత 'మా ఇంటి బంగారం'తో పాటు వడ్డే నవీన్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు', 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడు చిదంబరం తీసిన 'బాలన్ ది బాయ్', విజయ్ ఆంటోనీ 'వంద దేవుళ్ళు' సహా హర్షిత్ రెడ్డి 'దీవానా' సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ బరిలో 'మా ఇంటి బంగారం' ఎఫెక్ట్ ఉంది. అయినా 'పెద్ది'ని చూడటానికి థియేటర్లకు జనాలు వచ్చారు.

    • ఇండియాలో శుక్రవారం 'పెద్ది' సినిమాకు 1.75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి. 15వ రోజు కలెక్షన్లు (2.00 కోట్లు)తో పోలిస్తే కేవలం 12.5 శాతం తగ్గాయి. శుక్రవారం కొత్త సినిమాలు ఉన్నా... అంత రావడం గ్రేట్.
    • ఇండియాలో ఇప్పటి వరకు (16 రోజుల్లో) 'పెద్ది' సినిమా నెట్ కలెక్షన్లు రూ. 229.75 కోట్లు. గ్రాస్ కలెక్షన్స్ విషయానికి వస్తే... 272.05 కోట్లు.
    • ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమాను చూసేందుకు వస్తున్న ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోంది. 16వ రోజు కేవలం 5 లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో 'పెద్ది' 16 రోజుల ఓవర్సీస్ గ్రాస్ రూ. 52.60 కోట్లకు చేరుకుంది.
    • ప్రపంచవ్యాప్తంగా 16 రోజుల్లో 'పెద్ది' టోటల్ గ్రాస్ కలెక్షన్లు రూ. 324.65 కోట్లు.

    'పెద్ది'కి 16వ రోజు ఏ భాషలో ఎంత వచ్చింది?
    'పెద్ది' సినిమా కలెక్షన్లను భాషల వారీగా చూస్తే... 16వ రోజున తెలుగు వెర్షన్ రూ. 1.60 కోట్లు, హిందీ వెర్షన్ 10 లక్షలు, కన్నడ వెర్షన్ నాలుగు లక్షలు, తమిళ వెర్షన్  కేవలం లక్ష రూపాయల నెట్ మాత్రమే వచ్చింది.

    సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో 'పెద్ది' రూపొందిందని దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలవాలంటే 500 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. మరి అన్ని కోట్లు వస్తాయో? లేదో? వెయిట్ అండ్ సి. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్, ఇంకా ప్రధాన పాత్రల్లో జగపతి బాబు, శివ రాజ్‌ కుమార్  నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.

    Click here to Read More
    Previous Article
    Shreyanka Patil Ruled Out: టీమిండియాకు బిగ్ షాక్.. టోర్నీ నుంచి స్టార్ స్పిన్నర్ అవుట్, ఆర్‌సీబీ ప్లేయర్ కి ఊహించని లక్కీ ఛాన్స్!
    Next Article
    తల్లికి వందనం కొత్త వెరిఫికేషన్ గైడ్‌లైన్స్ విడుదల | Thalliki Vandanam Field Verification Module

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment