Filters

Channels
Topics
Other Filters

ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకుంటే వెలువడే వేడి.. తొడలు, పొట్ట దిగువ భాగంలోని చర్మంపై ప్రభావం చూపొచ్చు. ఎక్కువసేపు వేడి తగలడం వల్ల చర్మంపై మచ్చలు లేదా రంగు మారడం వంటి సమస్యలు రావచ్చు.

AP Mega DSC Recruitment | మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్, స్పోర్ట్స్ కోటా కేటాయింపుల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని YSRCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ (AP Mega DSC) ద్వారా ఉపాధ్యాయ నియామకాలలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఏడు దశల్లో నిర్వహించినట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అందులో తీవ్ర అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎలాంటి పరీక్షలు రాయకుండానే స్పోర్ట్స్ కోటా కింద సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) ఉద్యోగాలు కేటాయించడంపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీచర్ జాబ్స్ కోసం చూస్తున్న అభ్యర్థుల జీవితాలు అంటే మీకు నవ్వులాట అయిందా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని, స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టినట్లు చెబుతున్నా, అసలు ఈవెంట్లలో విజేతల జాబితాలో మెగా డీఎస్సీ జాబ్ కొట్టిన వారి పేర్లు ఎందుకు లేవో చెప్పాలన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. కేస్ స్టడీ 1 – విజేతల జాబితాలోనే లేని పేర్లువిశాఖపట్నంలో యోగేశ్వరరావు అనే అభ్యర్థికి, అలాగే ఆయన చెల్లికి ఎలాంటి రాత పరీక్ష లేకుండానే స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎస్జీటీ టీచర్ పోస్టులు ఇచ్చారని జగన్ పేర్కొన్నారు. 2009లో నల్గొండలో జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖో-ఖో ఛాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ వరుసగా తొలి, రెండో స్థానాలు సాధించినట్లు సర్టిఫికెట్లు సబ్మిట్ చేశారు. అయితే, తెలంగాణ ఖో-ఖో అసోసియేషన్ విడుదల చేసిన విజేతల అధికారిక జాబితాలో వీరి పేర్లు లేవని తేలిందని జగన్ స్పష్టం చేశారు.  కేస్ స్టడీ 2 – నకిలీ సర్టిఫికేట్ల నిర్లక్ష్యం మరో కేసులో బసవేశ్వరరావు అనే అభ్యర్థి గుడివాడలో జరిగిన 49వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖో-ఖో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు నకిలీ సర్టిఫికేట్ సమర్పించి ఉద్యోగం పొందారని వైఎస్ జగన్ తెలిపారు. ఈ సర్టిఫికేట్ నకిలీదని ఖో-ఖో అసోసియేషన్ స్వయంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కు నియామకాల కంటే ముందే (11-07-2025న) అధికారిక లేఖ ద్వారా తెరిపించినప్పటికీ, ఆ లేఖను పక్కన పడేసి ఉద్యోగం ఇచ్చారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. కేస్ స్టడీ 3 – జరగని క్రీడా పోటీల పేరుతో ఉద్యోగాలు   ప్రగడ కళ్యాణి అనే అభ్యర్థికి 2003లో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీల్లో పాల్గొన్నట్లు ఉన్న సర్టిఫికేట్ ఆధారంగా ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం ఇచ్చారని జగన్ తెలిపారు. అయితే నాగార్జున యూనివర్సిటీలో ఆల్ ఇండియా పోటీలు అసలు జరగలేదని, అక్కడ కేవలం సౌత్ వెస్ట్ జోన్ పోటీలు మాత్రమే జరిగాయని తేలినట్లు పేర్కొన్నారు. 7 ఫేజ్ వెరిఫికేషన్ పూర్తయినా ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్లతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందడం మెగా డిఎస్సీ స్కామ్‌ను స్పష్టం చేస్తోందని మాజీ సీఎం జగన్ విమర్శించారు.

Laptop on the Lap : ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకోవడం వల్ల అమ్మాయిల్లో సంతానోత్పత్తి సమస్యలు వస్తాయా?

Laptop on the Lap Safe for Women : వివిధ కారణాలతో కొందరు అమ్మాయిలు ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకుని పని చేస్తారు. ఇలా ఎక్కువసేపు చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి.. సంతాన సమస్యలు వస్తాయా? ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకోవడం వల్ల ఫెర్టిలిటీ దెబ్బతింటుందా?ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకుంటే వెలువడే వేడి.. తొడలు, పొట్ట దిగువ భాగంలోని చర్మంపై ప్రభావం చూపొచ్చు. ఎక్కువసేపు వేడి తగలడం వల్ల చర్మంపై మచ్చలు లేదా రంగు మారడం వంటి సమస్యలు రావచ్చు.

Dates Benefits : ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోజుకు ఎన్ని తింటే మంచిది

Dates on an Empty Stomach : సాధారణంగా రోజుకు 2, 3 ఖర్జూరాలు తీసుకోవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో వాటిని రోజూ తింటే కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. ఉదయాన్నే ఖర్జూరం తింటే కలిగే లాభాలు ఇవేఖర్జూరంలో సహజమైన చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఉదయం తింటే రోజును శక్తివంతంగా ప్రారంభించడానికి సహాయపడవచ్చు.

Potatoes and Onions : ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి ఉంచకూడదట.. పాడవకూడదంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Potatoes and Onions Stored Together : చాలామంది బంగాళాదుంపలు, ఉల్లిపాయలను కలిపి నిల్వ చేస్తారు. అయితే ఇలా ఉంచితే కలిగే నష్టాలు ఏంటో.. పాడవకుండా ఉండేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయలు, బంగాళదుంపలు కలిపి ఉంచితే కలిగే నష్టాలుఉల్లిపాయలు విడుదల చేసే తేమ, వాయువుల వల్ల పక్కనే ఉన్న బంగాళాదుంపలు త్వరగా మెత్తబడటం లేదా మొలకెత్తడం జరగొచ్చు.

Homemade Hair Oil : మెంతులు, మందారంతో హెయిర్ ఆయిల్.. జుట్టు సమస్యలు దూరం చేసుకునేందుకు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండిలా

Methi, Hibiscus and Kalonji Hair Oil : జుట్టు సంరక్షణలో భాగంగా ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు మెంతులు, మందారం, కలోంజి సీడ్స్తో ఈ ఆయిల్ ట్రై చేయండి. Homemade Hair Oil for Hair Care : జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యలు, జుట్టు సంరక్షణ విధానం వంటి ఎన్నో అంశాలు హెయిర్ ఫాల్‌పై ప్రభావం చూపుతాయి. మీరు కూడా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. హెయిర్ కేర్‌లో రొటీన్లో మెంతులు, మందారం, కొబ్బరి నూనె, కలొంజీ సీడ్స్​తో హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు.  జుట్టు సంరక్షణలో భాగంగా ఈ ఆయిల్ ఉపయోగిస్తే మీరు మంచి ఫలితాలు చూడవచ్చు. మరి ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో.. ఈ నూనె ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  కావాల్సిన పదార్థాలు కొబ్బరి నూనె - 1 కప్పు మెంతులు - 1 టేబుల్ స్పూన్ కలొంజీ - 1 టేబుల్ స్పూన్ తాజా మందార పూలు - 3 హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారీ విధానం ముందుగా మందార పూలను తీసుకుని కాడలను తొలగించాలి. అనంతరం వాటిని శుభ్రంగా నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి. మందార పూల రేకులను విడదీసి.. వాటిని తడిలేకుండా తుడిచి పక్కన పెట్టుకోండి. మెంతులు, కలొంజీని కూడా సిద్ధం చేసుకోండి. వీటిని మిక్సీలో వేసి పిండిగా కాకుండా గరుకుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటి సహజ నూనెలు బయటకు వస్తాయి.  ఇప్పుడు ఒక పాన్‌ తీసుకుని దానిలో కప్పు కొబ్బరి నూనె వేసి తక్కువ మంటపై వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత దంచిన మెంతులు, కలొంజీ వేసుకోవాలి. ఆ తర్వాత మందార రేకులను కూడా వేసి కొన్ని నిమిషాలు తక్కువ మంటపై వేడి చేయాలి. ఈ పదార్థాలు మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి. కొద్దిసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. నూనె పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలి. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రమైన జల్లెడ లేదా మస్లిన్ క్లాత్‌తో నూనెను వడకట్టాలి. అందులోని మెంతులు, కలొంజీ, మందార పూలను పూర్తిగా తొలగించాలి. తర్వాత నూనెను శుభ్రమైన, పూర్తిగా పొడిగా ఉన్న గాలి చొరబడని సీసాలోకి తీసుకోవాలి. నేరుగా సూర్యరశ్మి పడని, తేమ లేని ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి.  ఇలా తయారు చేసుకున్న నూనెలో కొద్దిగా తీసుకుని చేతివేళ్లతో తలపై సున్నితంగా మసాజ్ చేయాలి. గట్టిగా రుద్దకుండా నెమ్మదిగా మసాజ్ చేయడం మంచిది. నూనెను సుమారు 30 నిమిషాల నుంచి గంట వరకు ఉంచుకుని.. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయవచ్చు.     

Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ధోని వాటా కోరినట్లు వచ్చిన నివేదికలను యాజమాన్యం ఖండించగా, అదొక ప్లాంటెడ్ స్టోరీ అంటూ ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. Franchise Denies MS Dhoni Requested Equity Share: ఐపీఎల్ విజయవంతమైన సారథి మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంచైజీలో భారీ వాటా కోరాడంటూ వెలువడిన నివేదికలు తీవ్ర సంచలనం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ధోని తొలుత జట్టులో 25 శాతం వాటాను డిమాండ్ చేశాడని, ఆ తర్వాత దాన్ని 20 శాతానికి తగ్గించుకోగా, యాజమాన్యం 5.5 శాతం ఇచ్చేందుకు ముందుకొచ్చిందని ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై సీఎస్కే యాజమాన్యం స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేసింది. "ఎంఎస్ ధోని మా వద్ద ఎప్పుడూ వాటాల గురించి ప్రస్తావించలేదు. ఈ అంశంపై మా మధ్య ఎలాంటి చర్చలు జరగలేదు. సీఎస్కే యజమాని ఎన్ శ్రీనివాసన్‌తో కూడా ధోని దీని గురించి మాట్లాడినట్లు మా వద్ద ఎలాంటి సమాచారం లేదు" అని సీఎస్కే సీనియర్ అధికారి పేర్కొన్నారు.ల‌క్ష‌కుపైగా షేర్లు..సీఎస్కే షేర్లు ఓపెన్ మార్కెట్లో ట్రేడ్ కావు, ఇవి ప్రైవేట్ ఆఫ్-మార్కెట్ లావాదేవీల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో ధోని వద్ద లక్షకు పైగా షేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్రాంచైజీకి సంబంధించి 30 కోట్లకు పైగా షేర్లు పబ్లిక్ చేతిలో ఉండగా, అది మొత్తం షేర్ క్యాపిటల్‌లో దాదాపు 40 శాతంగా ఉందని స‌మాచారం. మాజీ బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ కుటుంబం వద్దే 55 శాతానికి పైగా నియంత్రణ వాటా ఉంది. ప్రస్తుత ఐపీఎల్ ఫ్రాంచైజీల మార్కెట్ విలువ ప్రకారం ధోని వద్ద ఉన్న షేర్ల విలువ దాదాపు 2.6 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక ధోని మొత్తం నికర ఆస్తి విలువ దాదాపు రూ. 1200 కోట్లుగా ఉంది. అదంతా అవాస్త‌వం.. ఈ ప్రచారంపై భారత మాజీ బ్యాటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వ్యాఖ్యానించాడు. ధోని వాటా అడిగాడనే ప్రచారాన్ని అవాస్తవమని, ఇదొక ప్లాంటెడ్ స్టోరీ అని తెలిపాడు. "ఆర్సీబీ విలువ ఇటీవల దాదాపు 1.8 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా అలాంటి స్థాయి ఉన్న ఫ్రాంచైజీయే. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలవడమే కాకుండా ఇండియా వెలుపల కూడా ఎన్నో జట్లను నడుపుతోంది. సీఎస్కే అనేది ఒక తిరుగులేని బ్రాండ్. దాదాపు 1.8 బిలియన్ల విలువైన ఫ్రాంచైజీలో 25 శాతం వాటా అంటే 400 మిలియన్ డాలర్లు. అంత భారీ మొత్తాన్ని ఎవరూ ఉచితంగా ఎవరికీ ఇవ్వరు. ఒక ఐపీఎల్ టీమ్‌లో ఎవరూ ఊరికే పాతిక శాతం వాటాను రాసివ్వరు" అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. సీఎస్కే విజయ ప్రస్థానంలో ధోని పాత్ర మరువలేనిది. తప్పుడు కథనాలు వెలువడినప్పటికీ ఫ్రాంచైజీతో ధోనికి ఉన్న అనుబంధం చెక్కుచెదరలేదని, రాబోయే సీజన్లలోనూ అతడు జట్టుతోనే కొనసాగుతాడని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Trophy Celebrations Viral Video: పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు

శ్రీలంకపై ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు పాకిస్తాన్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ ట్రోఫీని తిరస్కరించింది. అయిత వేడుక‌ల‌ను భిన్నంగా జ‌రుపుకుంది. Women In Blue Replicate Men Team Stance In Dubai: మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ పోరులో శ్రీలంకపై 72 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ఎనిమిదోసారి ట్రోఫీని ముద్దాడిన భారత మహిళల జట్టు ఒక సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. పురుషుల జట్టు తరహాలోనే హర్మన్‌ప్రీత్ కౌర్ సేన కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా విజేత ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ చారిత్రక విజయం నమోదైన అనంతరం, భారత జట్టు తమ నిర్ణయానికి కట్టుబడి ఉండటంతో నఖ్వీ వేదిక నుంచి వెనుదిరిగాడు. దీంతో జట్టుకు అధికారికంగా ట్రోఫీ అందకపోయినా, మైదానంలో టీమ్ ఇండియా సంబరాలకు ఏమాత్రం లోటు రాలేదు. వాటర్ బాటిల్‌తో ట్రోఫీ సెలబ్రేషన్స్.. వైరల్ వీడియోఅధికారిక ట్రోఫీ చేతికి రాకపోవడంతో టీమ్ ఇండియా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వినూత్నంగా స్పందించింది. ఒక వాటర్ బాటిల్‌ను ట్రోఫీలా గాల్లోకి ఎత్తుతూ సహచర ఆటగాళ్లతో కలిసి కెమెరాలకు పోజులిచ్చింది. బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో భారత క్రీడాకారిణులు నవ్వులు, కౌగిలింతలతో తమ చారిత్రక విజయాన్ని గ్రాండ్‌గా జరుపుకోవడం కనిపించింది. 2025 మెన్స్ ఆసియా కప్‌లో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యం తర్వాత భారత పురుషుల జట్టు ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని మహిళల జట్టు కూడా కొనసాగించింది. దేశ ప్రజల మనోభావాలకే ప్రాధాన్యం.. దేవజిత్ సైకియా క్లారిటీఈ వ్యవహారంపై బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా పిటిఐతో మాట్లాడారు. "ప్రస్తుత పరిస్థితులు, దేశంలో ఉన్న ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిణామాల మధ్య ఆ పద్ధతిలో ట్రోఫీని అందుకోవడం సరైంది కాదని భావించాం. ఈ విషయాన్ని ముందే ఏసీసీకి స్పష్టంగా సమాచారం అందించాం. ఇది పూర్తిగా మా సంస్థాగత నిర్ణయం మాత్రమే తప్ప, టోర్నమెంట్ లేదా ఆటగాళ్లు లేదా క్రీడకు వ్యతిరేకమైనది కాదు" అని ఆయ‌న‌ పేర్కొన్నారు. మైదానంలో తగ్గని జోష్.. ఎనిమిదోసారి కిరీటంరాజకీయ ఉద్రిక్తతల నడుమ మైదానంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన పూర్తి ఆధిపత్యం కనబరిచింది. ట్రోఫీ ప్రజెంటేషన్ గందరగోళం పక్కన పెడితే, రికార్డు స్థాయిలో ఎనిమిదో ఆసియా కప్ సొంతం చేసుకున్న భారత అమ్మాయిల ఆటతీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓవ‌రాల్ గా ప‌దిసార్లు టోర్నీ జ‌రిగితే, ప‌దిసార్లూ ఫైన‌ల్ కు చేరిన టీమిండియా.. ఎనిమిదిసార్లు విన్న‌ర్ గా, రెండుసార్లు ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది.   

Tim Cook Net Worth: Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్

టిమ్ కుక్ Apple CEO పదవికి రాజీనామా చేశారు, ఇకపై ఆయన కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసుకుందాం. Apple CEOగా దాదాపు 15 సంవత్సరాల పాటు కంపెనీని నడిపించిన టిమ్ కుక్ పదవీకాలం ముగిసింది. 2026 ఆగస్టు 31 CEOగా ఆయన చివరి రోజు సేవలు పూర్తయ్యాయి. అయితే, టిమ్ కుక్ Apple కంపెనీ నుంచి పూర్తిగా తప్పుకోవడం లేదు. ఆయన కంపెనీలో కొత్తగా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరిస్తారు. నేటి (సెప్టెంబర్ 1) నుంచి జాన్ టర్నస్ Apple కొత్త CEOగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ క్రమంలో మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత ఉందో తెలుసుకుందాం. టిమ్ కుక్ నికర ఆస్తి విలువ వివరాలు ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, టిమ్ కుక్ మొత్తం నికర ఆస్తి విలువ దాదాపు 3 బిలియన్ డాలర్లు అని సమాచారం. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ. 26 వేల కోట్లకు సమానమని చెప్పవచ్చు. ఆయన ఆస్తిలో ప్రధాన భాగం Apple నుంచి వచ్చిన షేర్లు, జీతం, ఇతర చెల్లింపుల ద్వారా సమకూర్చుకున్నారు.   టిమ్ కుక్ వద్ద Apple సంస్థకు చెందిన 30 లక్షలకు పైగా షేర్లు ఉన్నాయి. కంపెనీ షేర్ ధరల్లో వచ్చే హెచ్చుతగ్గులను బట్టి ఆయన మొత్తం ఆస్తి అంచనా సైతం ఎప్పటికప్పుడూ మారుతుంటుంది. అందుకే టిమ్ కుక్ నికర ఆస్తి విలువ కాలక్రమేణా పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. 15 ఏళ్ల పాటు Apple సీఈవోగా బాధ్యతలు ఆగస్టు 2011లో టిమ్ కుక్ Apple CEOగా బాధ్యతలు చేపట్టారని తెలిసిందే. యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ తర్వాత ఆయన ఈ బాధ్యతను చేపట్టారు. టిమ్ కుక్ నాయకత్వంలో Apple సంస్థ iPhoneతో పాటు యాపిల్ వాచ్ (Apple Watch), ఎయిర్ పాడ్స్, ఇతర విభిన్న సేవల్లో కంపెనీని ముందుకు తీసుకెళ్లింది. టిమి కుక్ హయాంలో Apple ప్రపంచంలోనే అత్యంత పెద్ద, విలువైన టెక్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. కంపెనీ వ్యాపారంతో పాటు సప్లై చైన్, ఇతర కీలక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంతో టిమ్ కుక్ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు. Apple కొత్త సీఈవో ఎవరు? Apple సంస్థ 2026 ఏప్రిల్‌లోనే నాయకత్వ మార్పును తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, జాన్ టర్నస్ 2026 సెప్టెంబర్ 1న Apple CEOగా బాధ్యతలు చేపడతారు. టర్నస్ ప్రస్తుతం యాపిల్ కంపెనీ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. టిమ్ కుక్ ఇకపై ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా Appleలోనే పనిచేస్తారు. ఆయన కంపెనీ బోర్డు, ఇతర బాధ్యతలతో కలిసి పనిచేస్తారు. అలాగే, తన అనుభవంతో Apple భవిష్యత్ వ్యూహాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించనున్నారు. CEOగా తన చివరి రోజున టిమ్ కుక్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ చేశారు. తన ఎక్స్ ఖాతాలో.. తన చివరి రోజు గురించి ప్రస్తావించారు. యాపిల్ CEOగా తన హోదా ఇక మారుతుందని, కానీ ఆపిల్ కమ్యూనిటీ పట్ల తన ప్రేమ ఎప్పటికీ మారదని స్పష్టం చేశారు.      తన ఈ పోస్ట్‌లో కుక్ ఇలా రాశారు, "CEOగా నా చివరి రోజున ఆపిల్ కమ్యూనిటీకి బోలెడంత ప్రేమ. రేపు నా హోదా (టైటిల్) మారుతుంది, కానీ ఆపిల్ కమ్యూనిటీ పట్ల నాకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. ఎల్లప్పుడూ నాకు ప్రేరణగా నిలిచినందుకు చాలా ధన్యవాదాలు. నా కృతజ్ఞతలు అపారమైనవి, మరియు నా జీవితంలోని తదుపరి అధ్యాయం కోసం నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను."  

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రెండో అవతారం.. నామినేషన్లలో రెచ్చిపోయిన కంటెస్ట్ంట్స్.. నామినేషన్‌లో ఉంది వీళ్లే!

Bigg Boss Season 10 Day 8: నామినేషన్లు మొదలవడం కొత్తగా గేమ్ పెట్టి నామినేషన్లు చేసుకోమని బిగ్‌బాస్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10లో 8వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో.. ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఐలవ్యూ ముఖేశ్.. బిగ్‌బాస్ దేబ్‌జానీకి కాఫీ పంపిస్తారు. కేవలం ఒకరితోనే పంచుకోమని చెప్తారు. ఇక దేబ్‌జానీ ముఖేశ్‌ వల్లే వచ్చింది అని ముఖేశ్‌కి ఐలవ్యూ చెప్తుంది. ఇంతలో త్రిగున్‌ వచ్చి తనతో కాఫీ షేర్ చేసుకోమని అడుగుతాడు. కిచెన్లో వంశీ పని చేస్తుంటే ఝాన్సీ సాయం చేయడం లేదా అని అడుగుతాడు త్రిగున్‌ దానికి వంశీ ఈ మధ్య మేడం సిన్సియర్‌గా పని చేయడం లేదు.. ముచ్చట్లకు అలవాటైపోయింది అని చెప్తాడు. ఇక రోహిత్ నాగ్‌ సార్ ఇచ్చిన ఎంగిలి కప్పులు కడిగి పనిష్మెంట్ పూర్తి చేసుకుంటాడు.    క్రష్ అని కావాలనే చెప్పింది.. వర్షిణి, సుధీర్‌ ఇద్దరూ దేబ్‌జానీ గురించి మాట్లాడుకుంటారు. ముఖేశ్ మాటలకు బెండ్ అవ్వడు అని దేబ్‌జానీ క్రష్ అని కాఫీ షేర్ చేసుకుంటా అని చెప్పిందని వర్షిణి చెప్తుంది. ఆలోచించాల్సిన విషయమే అని సుధీర్ అంటాడు. ఇక బిగ్‌బాస్ సుధీర్‌కి ఉన్న పవర్ గుర్తు చేస్తారు. అది వచ్చే వారం ఎవరినైనా డైరెక్ట్ నామినేషన్‌లో ఉండేలా చేయొచ్చు.   నామినేషన్లు షురూ.. నామినేషన్ల ప్రక్రియలో బిగ్‌బాస్ పిలిచినప్పుడల్లా ఇద్దరు కంటెస్టెంట్స్ పాత్వే నుంచి వెళ్లి తర్వత ఉన్న ఓ స్పోల్ ఎంచుకొని దానికి ఉన్న తాడు మొత్తం తీసి అప్పుడు అక్కడ ఉన్న రెండు గొడ్డళ్లు.. సిల్వర్, గోల్డ్‌లలో ఒకటి ఎంచుకోవాలి. సిల్వర్ ఎంచుకుంటే ఒకర్ని నామినేట్ చేసే అర్హత ఉంటుంది. గోల్డెన్ ఎంచుకుంటే ఇద్దరిని నామినేట్ చేయొచ్చు.. ఓడిపోయిన వాళ్లకి ఆ రౌండ్లో ఒక నామినేషన్ ఓటు పడుతుంది అని.. గొడ్డల్ని అందుకున్న వాళ్లు ఆ రౌండ్లో ఓడిపోయిన వాళ్లతో సహా ఎవరినైనా నామినేట్ చేయొచ్చని అంటారు.    సుధీర్, ఝాన్సీ.. ఝాన్సీ, సుధీర్ ఇద్దరూ గేమ్ ఆడుతారు. సుధీర్ గెలిచి గోల్డెన్ గొడ్డలి పట్టుకుంటాడు. మొదట త్రిగుణ్‌ని నామినేట్ చేస్తాడు. త్రిగుణ్ తన దగ్గర ఒక మాట మాట్లాడి రోహిత్‌ దగ్గర మరొకటి చెప్పాడు అని ఒక్కొక్కరి దగ్గర ఒక్కో మాట చెప్తున్నాడు..చైత్ర విషయంలోనూ తన ఆట చూడకుండా కత్తితో పొడిచావని చెప్పి నామినేట్ చేస్తాడు. తర్వాత రెండో నామినేషన్ షాలినికి వేస్తాడు. షాలినికి వాష్‌రూం క్లీనింగ్ ఇస్తే దాన్ని తీసుకోలేక దాన్ని నీ పవర్ వాడుకోవడం నాకు నచ్చలేదు అని అంటాడు. ఆది నా స్టాటజీ అని షాలిని అంటుంది.    కృష్ణుడు, దేబ్‌జానీ.. కృష్ణుడు, దేబ్‌జానీ ఇద్దరూ గేమ్ ఆడితే దేబ్‌జానీ గెలుస్తుంది. దేబ్‌జానీ సిల్వర్ గొడ్డలి తీసుకొని త్రిగుణ్‌కి నామినేట్ చేస్తుంది. ఏమైనా ఉంటే డైరెక్ట్‌గా చెప్పడం లేదు పక్కవాళ్ల దగ్గరకు వెళ్లి చెప్తున్నావ్.. సుధీర్ గురించి నాకు చెప్పడం నచ్చలేదు అంటుంది.    వర్షిణి, రోహిత్.. వర్షిణి రోహిత్‌లలో రోహిత్ గెలిచి గోల్డెన్ గొడ్డలి పట్టుకుంటాడు. మొదటి నామినేషన్ త్రిగుణ్‌కి వేస్తాడు. ప్రపంచం తెలిసిన నువ్వు నన్ను స్టారాయిడ్స్ బాడీ అనడం నచ్చలేదు.. అక్కడో మాట ఇక్కడో మాట నాకు గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు.. ఇక ముఖ్యమైనది నాకు అస్సలు నచ్చలేదు.. చాలా చెత్త మేటర్ అది.. నేను సృష్టిని సుధీర్ మీదకు పంపాను అని అన్నారు.. ఓ ఆడపిల్ల విషయంలో మీరు అలా అనడం లేదు నాకు అస్సలు నచ్చలేదు అని రోహిత్ అంటాడు. రోహిత్ అన్నింటికీ వాధిస్తే అనవ్నీ నాకు వద్దు.. నేను సృష్టిని సుధీర్ మీదకు పంపాను అన్నారు దానికి సమాధానం చెప్పండి అని రోహిత్ అడుగుతాడు. రోహిత్ రెండో నామినేషన్ ఝాన్సీకి వేస్తాడు. సేఫ్ గేమ్ ఆడటం మానేయ్.. అని అంటాడు. దానికి ఝాన్సీ నాకు నా స్టాటజీ ఉంది.  నువ్వే చాలా సార్లు వాళ్లు ఏం అనుకుంటున్నారో చెప్పు అని అడిగావ్ అని ఝాన్సీ అంటుంది. నేను ఎప్పుడడిగా అని రోహిత్ వాధించి నువ్వు ఈ గేమ్‌లో నాకు ఎక్కడా కనిపించడం లేదు అని అంటాడు. ఝాన్సీకి త్రిగుణ్ సపోర్ట్ చేయడంతో రోహిత్ త్రిగుణ్ గొడవ పడతారు.   నరేశ్, షాలిని.. నరేశ్, షాలినిలో నరేశ్ గెలిచి సిల్వర్ గొడ్డలి తీసుకొని షాలినిని నామినేట్ చేస్తాడు. గేమ్ సీరియస్‌గా తీసుకున్నారు..  మీరు ఓడిపోతే తీసుకోలేరు. చైత్ర గారిని మీరు హర్ట్ చేసి తనతో గొడవ పడి చివరకు తనతో క్షమాపణ చెప్పించారు.. ఎప్పుడూ బిగ్‌బాస్ పిలిచిన  వెంటనే రారు.. మీకు ఇప్పుడే వార్నింగ్ కూడా వచ్చింది అని అంటాడు. రాం ప్రసాద్ అన్న కూడా పడున్నాడు అని కుక్కలు మొరిగాయి అని మీరు చెప్పడం లేదు నాకే చెప్పారు అని షాలిని గొడవ పడుతుంది. బిగ్‌బాస్ మీకు వార్నింగ్ ఇచ్చారు తనకి ఇవ్వలేదు అని నరేశ్ అంటాడు.   షాలిని, త్రిగుణ్.. షాలిని, త్రిగుణ్‌ ఇద్దరిలో త్రిగుణ్ గెలిచి గోల్డెన్ గొడ్డలి పట్టుకుంటాడు. త్రిగుణ్ మొదటి ఓటు సుధీర్‌కి వేస్తాడు. ఏమైనా నేను ఒప్పుకుంటా కానీ వెన్నుపోటు పొడిచావ్ అంటే నేను తీసుకోలేను.. నువ్వే వచ్చి నాది సృష్టిది హైట్ సరిపోతుంది.. అంటూ తనని నువ్వే నాతో మాట్లాడావ్ నేను ఎవరికీ ఈ విషయాలు చెప్పలేదు.. తోముతున్నారు అన్న విషయంలో నేను ఎప్పుడూ తప్పుడు మీనింగ్‌తో అనలేదు.. నాకు ఐదుగురు చెల్లెళ్లు ఉన్నారు అని త్రిగుణ్ అంటాడు. ఇక చివరిగా నాతో ఫైట్ చేస్తే బాగా కనిపిస్తావ్ అని నాతో పెట్టుకున్నావ్ నాకు తెలుసు అని సుధీర్‌ని అంటాడు. సుధీర్ చాలా మాట్లాడుతాడు వాటికి త్రిగుణ్ సైలెంట్ అయిపోవడంతో మౌనం అర్థంగీకారం అని సుధీర్ అంటాడు. త్రిగుణ్ రెండో నామినేషన్ రోహిత్‌కి వేస్తాడు. నువ్వేదీ స్పోర్టివ్‌గా తీసుకోవడం లేదు.. పని చేయవు పని చేసే వాళ్లకి చేయనివ్వడం లేదు అని త్రిగుణ్ అంటాడు. రోహిత్ గ్రూప్స్ గురించి చెప్తూ మీ గ్రూప్స్ వైబ్ అవుతున్నప్పుడు మేం వైబ్ అయితే గ్రూప్స్ అన్నారు అని రోహిత్ అంటాడు.. ఈ టైంలోనే వర్షిణి, షాలిని గట్టిగా గొడవ పడతారు. వర్షిణి షాలినిని తోసేస్తుంది. ఫిజికల్‌గా అవ్వడం తప్పు అని రోహిత్, సృష్టి, షాలిని గొడవ పడతారు. ముఖేశ్, అమన్..ముఖేశ్, అమన్ హోరాహోరీగా జరుగుతుంది. అమన్ గెలిచి గోల్డ్ గొడ్డలి పట్టుకొని మొదట రాంప్రసాద్‌ని నామినేట్ చేస్తాడు. నరేశ్‌తో ఓడిపోయావ్ అని నాకు ఓటు వేయడం నచ్చలేదు అని అంటాడు. తర్వాత ఝాన్సీకి నామినేట్ చేసి మొదట నా గేమ్ బాగుంది అని చెప్పి అందరి దగ్గర నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావ్ అనడం నచ్చలేదు అని అంటాడు.  రాంప్రసాద్, వంశీ..రాంప్రసాద్, వంశీలలో వంశీ గెలిచి గోల్డెన్ గొడ్డలి అందుకుంటాడు. వంశీ మొదటి ఓటు దేబ్జానీకి ఇస్తాడు. నువ్వు ఓ పదం వాడావు నాకు అది నచ్చలేదు ఆ పదం ఇప్పుడు కూడా నాకు మాట్లాడాలి అని లేదు అని అంటాడు. ఈ పదం వాడకూడదు అని నాకు తెలీదు.. మేం జిమ్‌లో వాడుతుంటాం.. వర్షిణి ఆ పదం వాడకూడదు అని చెప్పడం వల్ల నాకు తెలిసింది అని దేబ్‌జానీ అంటుంది. ఇక వంశీ రెండో నామినేషన్ ముఖేశ్‌కి వేస్తాడు. ముఖేశ్ ఇంట్లో గడ్డం గీసుకోవడం తనకి ఇబ్బందిగా అనిపించింది అంటాడు. ఇవీ ఈ వారం నామినేషన్లు.. నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్.. నరేశ్, ముఖేశ్, త్రిగుణ్, దేబ్‌జానీ, వర్షిణి, కృష్ణుడు, సుధీర్, ఝాన్సీ,  అమన్, షాలిని, సృష్టీ.   

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: బ్లాక్‌ కీ దక్కించుకొని పవర్ పోగొట్టుకుందెవరు? ఎలిమినేషన్ జరిగిందా! రేపటి నుంచి రెండో అవతారం!

Bigg Boss Season 10 Day 7: సృష్టికి అందరూ ఓట్లు వేసి బ్లాక్‌కీ ఇవ్వడం.. తన పవర్ బాక్స్‌ని సుధీర్ దక్కించుకోవడం.. ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కాకపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. Bigg Boss Season 10 Letest Episode: బిగ్‌బాస్ సీజన్ 10లో 7వ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో.. హోస్ట్ నాగార్జున వచ్చి కం టెస్టెంట్స్‌కి ఎలాంటి సలహాలు సూచనలు చేశారు.. ఎవరి ఆట ఎలా ఉందో చెప్పారా లేదా..  ఎపిసోడ్‌లో ఎలాంటి ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయో.. బిగ్‌బాస్ హైలెట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.. తెలుగే మాట్లాడండీ.. చిరాకుగా ఉంది.. షో మొదలవగానే నాగ్‌ ఆడియన్స్‌తో మాట్లాడి ఫేవరెట్ కంటెస్ట్ంట్స్ ఎవరూ అని అడిగి తెలుసుకుంటారు. ఒకరు త్రిగుణ్ అని చెప్తే మరొకరు షాలినీ అని చెప్తారు. ఇక నాగ్ ఈ రోజు బ్లాక్ కీ ఇస్తామని చెప్తారు. తర్వాత కంటెస్టెంట్స్‌తో ఇంగ్లీష్‌లో మాట్లాడి.. అర్థమైందా మీరు ఇంగ్లీష్‌తో మాట్లాడుతుంటే చిరాకుగా ఉంది అని చెప్పి రోహిత్‌, షాలిని, సృష్టి ఎక్కువ ఇంగ్లీష్‌ మాట్లాడుతున్నారు.. తెలుగు వచ్చి కూడా ఇలా మాట్లాడటం నచ్చడం లేదు అని అంటారు. ముగ్గురు సారీ చెప్తారు. తర్వాత అమన్‌ పర్మినెంట్ కంటెస్టెంట్ అని అనౌన్స్ చేస్తారు. దగ్గర.. దూరం కంటిన్యూ.. నిన్న ఆపేసిన హృదయానికి దగ్గర ఎవరు.. దూరం ఎవరు ఆటని మొదలు పెడతారు. ముఖేశ్ తనకు ఝాన్సీ హృదయానికి దగ్గరగా  ఉందని రోహిత్ హృదయానికి దూరంగా ఉన్నాడు అని చెప్తాడు. కృష్ణుడు దగ్గర దేబ్జానీ, దూరం రోహిత్ అని చెప్తాడు. నరేశ్ హృదయానికి దగ్గర దేబ్జానీ అని హృదయానికి దూరం సృష్టి అని చెప్తే.. షాలిని హృదయానికి దగ్గర రాంప్రసాద్ దగ్గర దూరం అమన్ అని చెప్తుంది. సుధీర్ తన హృదయానికి దగ్గర ముఖేశ్, దూరం వర్షిణి అని చెప్తాడు. వంశీ హృదయానికి దగ్గర అని రోహిత్‌ని చెప్పి.. సుధీర్ దూరం అని చెప్తాడు. హౌస్‌లో చాలా మంది హృదయానికి దగ్గరగా దేబ్‌జానీని పెట్టుకుంటే రోహిత్‌ని హృదయానికి దూరంగా పెట్టుకుంటారు. నాగ్‌ రోహిత్‌తో ఇది నీకు ఓ వార్నింగ్‌ లాంటిది అర్థం చేసుకో అని చెప్తారు.     బ్లాక్‌ కీ ఎవరిది.. సృష్టి దగ్గర తీసుకున్న పవర్‌ని పవర్ రాని నలుగురు దేబ్‌జానీ, రోహిత్, అమన్, సుధీర్‌లలో ఒకరికి దక్కించుకునే అవకాశం ఉందని నలుగురికి టాక్స్ పెడతారు. ఈ టాస్క్‌లో సుధీర్ విన్ అయి పవర్ దక్కించుకుంటాడు. తర్వాత సృష్టి పర్మినెంట్ హౌస్‌మేట్ అని అనౌన్స్ చేస్తారు. సృష్టి తర్వాత నరేశ్ హౌస్ మేట్ అవుతాడు.    సినిమా డైలాగ్స్.. సినిమా డైలాగ్స్‌కి సంబంధించిన ఫన్నీ టాక్స్ పెడతారు. నరేశ్‌కి రెండు టీమ్స్ సెలక్ట్ చేయడంతో ఏ టీంలో రోహిత్, త్రిగుణ్, కృష్ణుడు, రాంప్రసాద్, షాలిని, వర్షిణి, వంశీ  ఉంటే బీ టీంలో మిగతా వాళ్లు ఉంటారు. డైలాగ్ ప్లే అయిన వెంటనే ఏ సినిమాలోని డైలాగే బోర్డు మీద ఉన్న సినిమా పేర్లతో ఆ పేరుని రౌండ్ చుట్టాలి.. తర్వాత అందరూ ఆ సినిమాలోని పాటకి డ్యాన్స్ చేస్తారు. ఈ ఆటలో కృష్ణుడు ఏ టీం విన్ అవుతుంది. విన్ అయిన టీంకి స్వీట్స్ ఇస్తారు. తర్వాత ఝాన్సీ హౌస్‌మేట్ అని చెప్తారు.    నాకు పులిహోర కలపడం లేదు.. దేబ్జానీ తనకి కాఫీ కావాలని అడిగితే అది నీకు కావాలి అంటే ఓ సీక్రెట్ చెప్పాలని నాగ్ అడుగుతారు. నేను ఆరో తరగతి ఫెయిల్ అయ్యాను మళ్లీ చదివాను అని చెప్తుంది. ఇది టాప్‌ సీక్రెట్ కాదు అని నాగ్ అంటే ఎవరికీ తెలీదు సార్ అది అమ్మానాన్నకే తెలుసు అని అంటుంది. సీక్రెట్ లేదు కానీ ఓ ఇంట్రస్టింగ్ విషయం చెప్తా అని అంటుంది. ఏంటి అని నాగ్ అడిగితే తనకి ముఖేశ్ మీద ఇంట్రస్ట్ ఉందని ఇంట్లో ముఖేశ్ నచ్చాడు.. అటు ఇటు పులిహోర కలుపుతున్నాడు కానీ నాకు పులిహోర కలపడం లేదు అని దేబ్‌జానీ క్యూట్‌గా చెప్పడంతో అందరూ చాలా నవ్వుతారు.   ఎలిమినేట్ ఎవరు..హస్‌మేట్స్ అవ్వని కృష్ణుడు, సుధీర్, వర్షిణిలలో ఎవరు హౌస్‌మేట్స్ అవుతారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ముగ్గురిని ఓ రూంకి పిలిచి ముగ్గురితో డోర్స్ ఓపెన్ చేయమని చెప్తారు. చాలా సస్పెన్స్ తర్వాత ముగ్గురు హౌస్‌మేట్స్ అని అనౌన్స్ చేస్తారు. ఆల్రెడీ ఇద్దరు ఈ వారంలో ఎలిమినేట్ అవ్వడంతో ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో ఎవరినీ ఎలిమినేట్ చేయలేదు. నాగ్ వెళ్తూ వెళ్తూ ఈ వారం మహా పరీక్ష అయింది ఇక రెండో వారం పవర్ ఆఫ్ పీపుల్ అని చెప్తారు. సోమవారం నుంచి పవర్ ఆఫ్ పీపుల్ మొదలవుతుంది. 14 మంది హౌస్‌మ్మేట్స్ కెప్టెన్స్‌ రేసులో ఉంటారు. ఇవి ఈ రోజు ఎపిసోడ్‌లోని హైలెట్స్.  

Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్

Ranabaali Jayamma : విజయ్ దేవరకొండ, రష్మిక రణబాలి షూటింగ్ పూర్తైంది. ఈ సందర్భంగా రష్మిక షూటింగ్ సెట్‌లో బెస్ట్ మూమెంట్‌ను షేర్ చేయగా ట్రెండ్ అవుతోంది. Rashmika Hugs Vijay Deverakonda In Ranabaali Final Shoot : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక పెళ్లి తర్వాత జంటగా నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా రణబాలి (Ranabaali). మూవీలో రణబాలిగాా విజయ్, ఆయన భార్య జయమ్మగా రష్మిక నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ రష్మిక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. బేబీ బంప్‌తో ఉన్న ఆమె లుక్ వైరల్ అవుతోంది. తన భర్త విజయ్ దేవరకొండను హగ్ చేసుకుని... బెస్ట్ మూమెంట్‌ను షేర్ చేశారు నేషనల్ క్రష్. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. మిస్ అవుతున్నా విజయ్, రష్మిక ఇద్దరూ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'జయమ్మ షూటింగ్ పూర్తైంది. సెట్‌లో మిమ్మల్ని మిస్ అవుతాం.' అంటూ రష్మిక షేర్ చేయగా... 'ఈ సినిమా షూటింగ్ పూర్తైందంటే నమ్మలేకపోతున్నా. రణబాలి, జయమ్మ పాత్రలను మిస్ అవుతున్నా.' అని అన్నారు. జయమ్మ పాత్ర అందరి హృదయాలను ఆకట్టుకుంటుందన్నారు. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ రష్మిక జయమ్మ పాత్రపై డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'ఈ మూవీలో ప్రతీ రోల్ ఎంతో ఎమోషనల్‌గా రాశాను. హీరోయిన్ క్యారెక్టర్‌కు జయమ్మ అని మా అమ్మ పేరు పెట్టాను. ఆ జయమ్మ నేటి తరం మహిళలకు స్ఫూర్తినిస్తుంది. ఆమె డైలాగ్స్ విషయంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నా. రష్మిక ఈ పాత్రకు ప్రాణం పోశారు. ఆమె ఎప్పటికీ జయమ్మగా అందరికీ గుర్తుండిపోతుంది. ఆమె రణబాలి అనురాగానికి ప్రతిరూపం. నిలువెత్తు ధైర్యానికి ఆయువు పట్టు.' అంటూ రాసుకొచ్చారు. ఈ మూవీలో విజయ్, రష్మికలతో పాటు ఆర్నాల్డ్ వోస్లో విలన్ రోల్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. అక్టోబర్ 16న వరల్డ్ వైడ్‌గా తెలుగుతో పాటు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Samantha : ఘనంగా సమంత సీమంతం సెలబ్రేషన్స్ - భర్త రాజ్, ఫ్యామిలీ మెంబర్స్‌తో క్యూట్ మూమెంట్స్

Samantha Ruth Prabhu : స్టార్ హీరోయిన్ సమంత వినాయక చవితి రోజు స్పెషల్ మూమెంట్ షేర్ చేశారు. తన సీమంతం వేడుక ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.  

AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు

ఏపీలో నాన్-యూనిఫాం ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 34 నుండి 44 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపు 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. AP Government Jobs 2026 | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తో పాటు ఇతర నియామక సంస్థల ద్వారా భర్తీ చేసే నాన్-యూనిఫాం ఉద్యోగాలకు సంబంధించిన గరిష్ట వయోపరిమితిని ఏడాదిపాటు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంచిన వయోపరిమితి సడలింపు 2027 సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. యూనిఫాం పోస్టులకు ఏ మార్పు లేదుఅయితే పెంచిన ఈ వయోపరిమితి సడలింపు కేవలం నాన్-యూనిఫాం పోస్టులకు మాత్రమే వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ, రవాణా శాఖలకు చెందిన యూనిఫాం పోస్టులకు ఈ పెంపు వర్తించదని అధికారులు తెలిపారు. కాగా, ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC), ఈడబ్ల్యూఎస్ (EWS) తదితర కేటగిరీల అభ్యర్థులకు ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం లభించే అదనపు వయోపరిమితి మినహాయింపులు యథావిధిగా వర్తిస్తాయని తెలిపింది.

Best Bikes Under Rs 1 Lakh: రూ. 1 లక్ష కంటే తక్కువ ధరలో బెస్ట్ బైక్స్ ఇవే.. మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి

Bikes Price Under Rs 1 Lakh : మీరు తక్కువ ధరలో, రోజువారీ వినియోగానికి బైక్ కావాలనుకుంటే TVS Star City Plus తో పాటు Bajaj Platina 110 వంటి మోడళ్లను ఓసారి చెక్ చేసుకోండి. Best Bikes In India | మీరు బైక్ కొనాలని కోరుకుంటూ, రూ. 1 లక్ష రూపాయల వరకు మీ బడ్జెట్ ఉంటే గణేశ చతుర్థీ సందర్భంగా ఈ సెగ్మెంట్‌లో అనేక ఆప్షన్లు ఉన్నాయి. రోజూ ఆఫీస్, మార్కెట్ లేదా ఇతర చిన్నచిన్న పనుల కోసం బైక్‌ను కోరుకుంటే, తక్కువ ధరతో పాటు మంచి మైలేజ్, సులభమైన మెయింటెనెన్స్, నాణ్యమైన ఇంజిన్ చాలా ముఖ్యం. అందుకోసం Honda, TVS, Bajaj తో పాటు Hero కంపెనీలకి చెందిన ఇలాంటి బైక్‌ల గురించి మీకు వివరిస్తున్నాం.   హోండా షైన్ 125 (Honda Shine 125)  మీరు కొరుకునే జాబితాలో మొదటి ఆప్షన్ Honda Shine 125 బైక్. ఇందులో 123.9cc ఇంజిన్ ఇస్తారు. బైక్ సుమారు 10.5hp పవర్, 11Nm టార్క్ ఇస్తుంది. ఈ బైక్ రోజూ ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.  బైక్ ఇంజిన్ సిటీలో రైడ్‌కు సరిపడే పవర్‌ను అందిస్తుంది. అలాగే ఆఫీస్‌కు వెళ్లడం, మార్కెట్ పనులు లేదా రోజువారీ ప్రయాణాల కోసం ఈ బైక్‌ సరిపోతుంది. బైక్‌లో డిజిటల్ డ్యాష్, ట్యూబ్‌లెస్ టైర్లు USB Type-C ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ధర సుమారు రూ. 82,250 నుంచి ప్రారంభమవుతుంది. ఆయా నగరాలు, రాష్ట్రాల్లో ధరలు భిన్నంగా ఉంటాయి. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ (TVS Star City Plus) తక్కువ బడ్జెట్‌లో కోరుకునే వారికి TVS Star City Plus కూడా ఒక మంచి ఆప్షన్. దీని ధర రూ. 72,200 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 109.7cc ఇంజిన్ లభిస్తుంది. సుమారు 8.1hp పవర్, 8.7Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ సులభమైన, చవకైన రైడ్‌ కోసం ఉపయోగిస్తారు. ఇందులో LED హెడ్‌లైట్, USB ఛార్జింగ్ పోర్ట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు లభిస్తాయి. బైక్‌లో ఎకో లైట్ కూడా ఇచ్చారు. ఇది ఇంధనం ఆదా చేసే రైడింగ్‌లో హెల్ప్ కావచ్చు. అందువల్ల తక్కువ బడ్జెట్‌లో ఇది బెస్ట్ అవుతుంది.   బజాజ్ ప్లాటినా 110 (Bajaj Platina 110) తక్కువ ధర, రోజువారీ సౌకర్యవంతమైన ప్రయాణం మీ ప్రాధాన్యం అయితే Bajaj Platina 110 కూడా ఒక మంచి ఆప్షన్ కానుంది. ఇందులో 115.45cc ఇంజిన్ ఇస్తారు. ఇది సుమారు 8.60hp పవర్, 9.81Nm టార్క్ ఇస్తుంది. దీనితో పాటు 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. బైక్ వెనుక భాగంలో స్ట్రాంగ్ స్ప్రింగ్స్ ఇచ్చారు. ఇవి గుంతల రోడ్లపై వచ్చే షాక్‌లను తట్టుకోవడంలో సహాయపడతాయి. సుమారు 69,284 రూపాయలు ధరతో బైక్ ప్రారంభమవుతుంది. తక్కువ ధర కారణంగా, బైక్‌ను రోజువారీ రాకపోకల కోసం ఉపయోగిస్తుంటారు.  బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125) 1 లక్ష రూపాయల బడ్జెట్‌లో స్పోర్టీ లుక్‌, మంచి పవర్ ఉన్న బైక్‌ను కోరుకుంటే Bajaj Pulsar 125 తీసుకోవచ్చు. ఇందులో 124.4cc ఇంజిన్ ఇస్తారు. ఇది సుమారు 11.8hp పవర్, 10.8Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది ఎక్కువ పవర్ ఇచ్చే బైక్. దీని ధర 79,048 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. దీని డిజైన్ కూడా కమ్యూటర్ బైక్‌తో పోలిస్తే మరింత స్పోర్టీగా.. బెస్ట్ టుక్ ఉంటుంది. లుక్, పనితీరు కూడా కోరుకునేవారికి ఇది ఆప్షన్ కావచ్చు. హీరో సూపర్ స్ప్లెండర్ (Hero Super Splendor XTEC)  ఈ బడ్జెట్‌లో వచ్చే ప్రధాన బైక్ Hero Super Splendor XTEC. దీని ధర సుమారు 86,128 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 124.7cc ఇంజిన్ లభిస్తుంది. ఇది సుమారు 10.7hp పవర్, 10.6Nm టార్క్ జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, Bluetooth కనెక్టివిటీ, ఫుల్ LED హెడ్‌లైట్ వంటి సౌకర్యాలు లభిస్తాయి. Bluetooth ద్వారా కాల్, SMS అలర్ట్‌ల వంటి సమాచారం చూడవచ్చు. కమ్యూటర్ బైక్‌తో పాటు మోడ్రన్ ఫీచర్లు కోరుకునే వారికి  సెట్ అవుతుంది.  లక్ష రూపాయల బడ్జెట్‌లో మీకు ఏ బైక్ మంచిది? మీరు తక్కువ ధరలో, రోజువారీ జర్నీకి బైక్ కావాలనుకుంటే Bajaj Platina 110, TVS Star City Plus వంటి మోడళ్లు బాగుంటాయి. అదే ఎక్కువ పవర్, స్పోర్టీ డిజైన్ కావాలంటే Bajaj Pulsar 125 బెస్ట్ ఆప్షన్ కావచ్చు. బ్యాలెన్స్‌డ్ కమ్యూటర్ బైక్ కోరుకునే వారు Honda Shine 125ను చూడవచ్చు. ఫీచర్లపై ఫోకస్ చేసేవారు Hero Super Splendor XTEC పై ఓ లుక్కేయండి. 

Vijay Ajith : అజిత్‌కు ప్రేమతో సీఎం విజయ్ - కోలీవుడ్ స్టార్స్ క్యూట్ మూమెంట్... గిఫ్ట్స్ ఏమిచ్చారో తెలుసా?

CM Vijay Gift : లండన్‌లో కార్ రేస్ సందర్భంగా కోలీవుడ్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ అజిత్‌ను కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. CM Vijay Gifts To Kollywood Star Ajith : కోలీవుడ్ స్టార్స్ విజయ్, అజిత్ బెస్ట్ మూమెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. తమిళనాడు సీఎం హోదాలో లండన్ పర్యటనలో ఉన్న విజయ్... అక్కడ పాపులర్ సిల్వర్ స్టోన్ రేసింగ్ సర్క్యూట్ దగ్గరకు వెళ్లారు. 'మిచెలిన్ లే మాన్స్' కార్ రేస్ సందర్భంగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అందులో పాల్గొన్నారు. రేసింగ్ సూట్‌లో ఉన్న అజిత్‌ను చూసిన విజయ్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన్ను హగ్ చేసుకుని విష్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రేసింగ్‌లో పాల్గొన్న అజిత్‌కు సపోర్ట్‌గా వెళ్లిన విజయ్ అక్కడకు వెళ్లి ఉత్సాహపరిచారు. రేస్ తర్వాత ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.