Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Shreyanka Patil Ruled Out: టీమిండియాకు బిగ్ షాక్.. టోర్నీ నుంచి స్టార్ స్పిన్నర్ అవుట్, ఆర్‌సీబీ ప్లేయర్ కి ఊహించని లక్కీ ఛాన్స్!

    2 days ago

    ఇండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ యాంకిల్ ఇంజరీ కారణంగా వరల్డ్ కప్ నుంచి తప్పుకోగా, అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రేమ రావత్‌కు లక్కీ ఛాన్స్ దక్కింది.

    Shreyanka Patil Ankle Injury Ends World Cup Journey: ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 లో దూసుకుపోతున్న ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. టీమ్ మెయిన్ ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నమెంట్ మొత్తానికి దూరం అయింది. నెదర్లాండ్స్‌తో బుధవారం జరిగిన గ్రూప్ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయాంక రైట్ యాంకిల్ (కుడి మడమ) ట్విస్ట్ అవ్వడంతో గాయ‌ప‌డింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 6వ ఓవర్ ఫస్ట్ బాల్ వేసిన వెంటనే మిడ్-ఆన్ వైపు బాల్ ను చేజ్ చేసే క్రమంలో శ్రేయాంక కిందపడిపోయింది. తీవ్రమైన నొప్పితో విలవిలలాడిన ఆమెను స్ట్రెచ్చర్‌పై గ్రౌండ్ బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. శ్రేయాంక ప్లేస్ లో ఉత్తరాఖండ్‌కు చెందిన అన్‌క్యాప్డ్ లెగ్ స్పిన్నర్ ప్రేమ రావత్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు.

    ఐసీసీ టెక్నికల్ కమిటీ గ్రీన్ సిగ్నల్.. ప్రేమ రావత్ ఎంట్రీ..
    "ఐసీసీ ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ ఈవెంట్ టెక్నికల్ కమిటీ ఇండియా స్క్వాడ్‌లో శ్రేయాంక పాటిల్ రీప్లేస్‌మెంట్‌గా ప్రేమ రావత్‌ను అప్రూవ్ చేసింది" అని ఐసీసీ ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేసింది. 24 ఏళ్ల ఈ లెగ్ బ్రేక్ బౌలర్ రీసెంట్ గా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL), ఉమెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీల్లో తన పర్ఫార్మెన్స్ తో సెలెక్టర్లను ఇంప్రెస్ చేసింది. ఏషియా కప్ లో ఇండియా ఏ తరఫున ఆడిన ప్రేమ కేవలం 9.62 యావరేజ్‌తో 8 వికెట్లు పడగొట్టింది. డొమెస్టిక్ సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో ఉత్తరాఖండ్ టీమ్ విక్టరీ సాధించడంలో కీ రోల్ ప్లే చేసింది. ఆర్‌సీబీ టీమ్ తరఫున డబ్ల్యూపీఎల్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఎక్స్‌పీరియన్స్ కూడా ప్రేమకు ఉంది.

     శ్రేయాంక ఎమోషనల్ జర్నీ
    శ్రేయాంక పాటిల్ కెరీర్ లో గాయాలు పెద్ద శాపంగా మారాయి. ఆల్రెడీ ఇంజరీ నుంచి కోలుకొని ఈ ఏడాది ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి కంబ్యాక్ ఇచ్చిన శ్రేయాంక, పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్ లో 3 ఓవర్లలో 17 రన్స్ ఇచ్చి మంచి కాంట్రిబ్యూషన్ అందించింది. ఈ ఏడాది ఆర్‌సీబీ తరఫున డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచిన శ్రేయాంక, తన రిపీటెడ్ ఇంజరీస్ వల్ల కలిగే మెంటల్ ప్రెజర్ గురించి గతంలో ఓపెన్ అయింది. వరుస గాయాల వల్ల ఒకానొక టైమ్‌లో క్రికెట్ వదిలేయాలనే ఆలోచనలు కూడా వచ్చాయని, కానీ ఫ్యామిలీ, సపోర్ట్ సిస్టమ్ ఇచ్చిన మోటివేషన్ వల్లే మళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టానని ఎమోషనల్ గా చెప్పింది. అంతలోనే మళ్లీ వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి రావడం ఆమెకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.

    అజేయంగా ఇండియా.. నెక్స్ట్ సౌతాఫ్రికాతో బిగ్ ఫైట్

    ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఇండియా ఉమెన్స్ టీమ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి గ్రూప్‌లో అజేయంగా కొనసాగుతోంది. శ్రేయాంక లాంటి మెయిన్ స్పిన్నర్ దూరం అవ్వడం టీమ్ కాంబినేషన్‌ను కాస్త దెబ్బతీసే విషయమే అయినా, లీడ్స్ లో నెదర్లాండ్స్ పై సాధించిన బిగ్ విక్టరీ టీమ్ లో మంచి జోష్ నింపింది. ఇండియా తన తదుపరి గ్రూప్ మ్యాచ్ లో జూన్ 21 ఆదివారం మాంచెస్టర్ వేదికగా బలమైన సౌతాఫ్రికా టీమ్‌ను ఫేస్ చేయనుంది. ఈ టఫ్ మ్యాచ్ లో గెలిచి సెమీఫైనల్ బెర్త్‌ను మరింత ఖరారు చేసుకోవాలని హర్మన్‌ప్రీత్ కౌర్ ఆర్మీ ప్లాన్ చేస్తోంది.

     

    Click here to Read More
    Previous Article
    YSRCP Assembly Strategy: డీఎస్సీతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలోనే వార్ - వైఎస్ జగన్ డిసైడయ్యారా?
    Next Article
    Peddi Collections Day 16: మూడో వారంలో కిందకు పడినా స్టడీగా... రామ్ చరణ్ 'పెద్ది' కలెక్షన్లు... 16వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment