Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Kajal Aggarwal Vs Kiara Advani: బోల్డ్ బికినీ సీన్లు... కాజల్ వర్సెస్ కియారా... చందమామ ఆన్సర్ వైరల్

    4 hours ago

    Kajal Aggarwal On Bold Scenes: బోల్డ్ బికినీ సీన్స్ గురించి కాజల్ అగర్వాల్ ఇచ్చిన ఆన్సర్ వైరల్ అవుతోంది. యశ్ 'టాక్సిక్'లో కియారా అద్వానీ సీన్స్ మీద ట్రోల్స్ వస్తున్న సమయంలో డిస్కషన్ మొదలైంది.

    పెళ్ళి తర్వాత హీరోయిన్లు బికినీలలో కనిపించడం, హీరోలతో లిప్ లాక్స్ & బోల్డ్ సీన్స్ చేయడం కరెక్టేనా? అని ప్రశ్నిస్తే... ఒక్కొక్కరి నుంచి ఒక్కో విధమైన ఆన్సర్ వస్తుంది. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అయితే... ఇటీవల 'టాక్సిక్' ప్రోమో, 'తబాహీ' పాటలో యశ్‌తో కియారా అద్వానీ (Kiara Advani) చేసిన రొమాంటిక్ సన్నివేశాలపై ట్రోల్స్, విమర్శలు వచ్చాయి. పెళ్ళైన హీరో రొమాంటిక్ సీన్స్ చేయడంలో లేని తప్పు, హీరోయిన్ చేయడంలో వచ్చిందా? అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలో బోల్డ్, బికినీ సీన్స్ గురించి కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో ఇచ్చిన ఆన్సర్ వైరల్ అవుతోంది.

    బికినీ సీన్స్... భారీ సినిమాలు వదిలేశా!
    కెరీర్ స్టార్టింగ్ నుంచి వెండితెరపై రొమాంటిక్ సీన్స్, బికినీ బోల్డ్ సీన్స్ చేయడానికి తాను వ్యతిరేకమని కాజల్ అగర్వాల్ స్పష్టం చేశారు. తాను అసౌకర్యంగా ఫీలయ్యే దుస్తులు ధరించడానికి ఎప్పుడూ సిద్ధపడలేదని ఆమె పేర్కొన్నారు. అది తన వ్యక్తిగత నిర్ణయం అని చెప్పారు.

    బికినీ, బోల్డ్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని గతంలో కొన్ని భారీ సినిమాలను కూడా వదులుకున్నట్లు కాజల్ అగర్వాల్ వెల్లడించారు. సినిమాల (డబ్బుల) కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేనని, తనకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, వాటిని తాను ప్రాధాన్యత ఇస్తానని తెలుగు తెర చందమామ వివరించారు. తెరపై అటువంటి సీన్స్ అవసరం లేదని కాజల్ అభిప్రాయపడ్డారు.

    మా అబ్బాయ్ నా సినిమాలు చూసి గర్వపడాలి!
    తల్లి అయ్యాక తన ఆలోచనా విధానంలో మరింత మార్పు వచ్చిందని కాజల్ అగర్వాల్ తెలిపారు. తన కుమారుడు నీల్ కిచ్లూ పెరిగి పెద్దయ్యాక తన సినిమాలు చూసి గర్వపడాలని, తన కుమారుడు ఎక్కడా ఇబ్బంది పడకూడదని ఆమె తెలిపారు. ఫలానా సినిమాలో ఫలానా క్యారెక్టర్ చేసినందుకు తన కుమారుడికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రాకూడదని, అందుకే కథ - క్యారెక్టర్లు - సినిమాల ఎంపిక మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కాజల్ చెప్పారు.
    కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన 'ది ఇండియా స్టోరీ (The India Story Release Date) జూలై 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 'తబాహీ' పాటలో కియారా అద్వానీ సీన్స్ మీద విమర్శలు వస్తున్న తరుణంలో... తన సినిమాలు చూసి పిల్లలు గర్వపడాలని కాజల్ చెప్పిన ఆన్సర్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న NBK111లో కథానాయికగా నటిస్తున్నారు కాజల్.

    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
    Next Article
    Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment