Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం

    7 hours ago

    Top stories Today | జులై 2న ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, స్పోర్ట్స్ న్యూస్ అప్డేట్ పేజీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

    Telangana High Court: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 

    Telangana High Court: ఓ కేసులో హైడ్రా జోక్యం చేసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్న. నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని కమిషనర్ రంగనాథ్‌ను ఆదేశించింది. నేరుగా హాజరుకాకపోతే చర్యలకు సిఫార్సు చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది.  

    సీజేపీ కార్యకర్తలపై టియర్ గ్యాస్ ప్రయోగం.. పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత

    కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు చేపట్టిన 'ఛలో పార్లమెంట్' ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ ప్రధాన గేటు వద్దకు చేరుకున్న ఆందోళనకారులు అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి టియర్ గ్యాస్ ప్రయోగించి కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటనతో ప్రస్తుతం సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

    ముంబైలో సర్జరీ తరువాత ఏపీకి తిరిగొచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

    భుజానికి సర్జరీ అనంతరం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఈ ఘన స్వాగతాన్ని అందుకున్న అనంతరం పవన్ కల్యాణ్ నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు.

    లైంగిక వేధింపుల ఆరోపణలు.. ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యాయత్నం

    తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆయన ఎస్సార్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు ఆయనపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ, అవమానాలను తట్టుకుని ఐదో ప్రయత్నంలో 360వ ర్యాంకుతో ఐపీఎస్ సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఉదయ్ కృష్ణారెడ్డి, శిక్షణ ముగిసే సమయానికి ఇలాంటి తీవ్ర ఆరోపణలతో పతనం కావడం సంచలనంగా మారింది.

    దీక్ష విరమించేందుకు సోనమ్ వాంగ్ చుక్ 3 కండీషన్లు

    న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థ వైఫల్యాలు, నీట్ పేపర్ లీక్‌పై 20 రోజులుగా దీక్ష చేస్తున్న సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్ మూడు షరతులతో దీక్ష విరమిస్తానన్నారు. ప్రభుత్వం బాధ్యత వహించడం, రాజకీయ నాయకులు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తడం, నేతలు ఆసుపత్రికి వచ్చి హామీ ఇవ్వడం ఆయన డిమాండ్లు. తనను అక్రమంగా నిర్బంధించారని ఆయన ఆరోపించారు. కాగా, ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలన్న భార్య విజ్ఞప్తిని దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బలవంతంగానైనా ఆసుపత్రికి తీసుకెళ్లే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.

    మ్యాచ్ ముగిసిన తరువాత అర్జెంటీనా ప్లేయర్‌కు రెడ్ కార్డ్

    వరుసగా రెండోసారి గెలవాలన్న అర్జెంటీనా ఆశలను స్పెయిన్ అడ్డుకుంది. ఫైనల్లో 1-0తో అర్జెంటీనాను ఓడించి స్పెయిన్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్‌దే పూర్తి ఆధిపత్యం కాగా, అర్జెంటీనా కనీసం గోల్ ప్రయత్నాలు చేయలేకపోయింది. ఓటమి బాధతో మెస్సి మైదానంలోనే ఉండిపోగా, అర్జెంటీనా ప్లేయర్ పరెడెస్ ప్రత్యర్థి ఆటగాళ్లు గావి, ఎరిక్ గార్సియాలపై గొడవకు దిగి, కొట్టబోవడంతో రెడ్‌కార్డ్ లభించింది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    Click here to Read More
    Previous Article
    Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
    Next Article
    CM Vijay WhatsApp Bribe Buster: సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment