Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!

    3 hours ago

    What Is Stair Test For Heart Blockage:మెట్లు ఎక్కేటప్పుడు చాలా మంది ఆయాస పడుతుంటారు. ఇది సాధారణమైన విషయంగా భావిస్తారు. కానీ ఇది ప్రమాదకరమైన వ్యాధులకు కారణం కావచ్చు. వెంటనే వైద్యుణ్ని సంప్రదిస్తే మేలు.

    How Do You Know When Breathlessness Is Serious: మనం రోజువారీ పనులు చేస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే ఇబ్బందులు చిన్నవిగా చూడొద్దు. మెట్లు ఎక్కేటప్పుడు కొందరు విపరీతంగా అలసిపోతుంటారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఒకట్రెండు ఫ్లోర్‌లు ఎక్కితే చాలు ఊపిరి ఆడదు. గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఇది సాధారణమని కొందరు అనుకుంటారు. కాస్త లావు అయ్యాననో, ఈ మధ్య ఎక్కువ దూరం నడవడం లేదు అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందనే సరిపెట్టుకుంటారు. కానీ ఇది ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతాలు కావచ్చని గ్రహించరు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

    ప్రతి అలసటను సాధారణమైనదిగా భావించడం తప్పని వైద్య నిపుణులు చెబుతున్నారు. పదే పదే ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే మాత్రం కచ్చితంగా ఏదో పెద్ద సమస్య ఉన్నట్టు గ్రహించాలని సూచిస్తున్నారు. అందుకే వెంటనే వైద్యుణ్ని సంప్రదించి అసలు కారణాలను గుర్తించాలని సజెస్ట్ చేస్తున్నారు. లేకుంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. 

    మెట్లు ఎక్కేటప్పుడు వచ్చే ఆయాసానికి కారణమేంటీ?

    ఏదైనా పని చేసినప్పుడు, మెట్లు ఎక్కినప్పుడు మాత్రమే గట్టిగా ఊపిరి తీసుకుంటాం. అంటే ఆ సమయంలో మనకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుందని అర్థం. నార్మల్‌గా ఊపిరి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ నార్మల్‌గా అవసరం అవుతుంది. కానీ ఏదైనా పని చేస్తేనే ఆక్సిజన్ ఎక్కువ అవసరం. అలాంటి సమయంలో శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందించడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆయాసం వస్తుంది.

    గుండె జబ్బుల ముప్పు 

    మీరు మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువ ఆయాస పడుతున్నారంటే కచ్చితంగా గుండెలో ఏదైనా సమస్యకు కారణం కావచ్చు. మీకు కావాల్సిన ఆక్సిజన్ అందివ్వడంలో గుండెలోని పార్ట్స్‌ ఇబ్బంది పడుతుంటే ఆయాసం ఎక్కువ అవుతుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. శ్వాస తీసుకోలేరు. దీని కారణంగా ఎక్కువ ఒత్తిడికి గురై  గుండె పని చేయడం ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆయాసం వస్తుంటే సమస్యను తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించాలి. 

    ఆస్తమా కావాచ్చు

    గుండె సమస్యే కాదు, ఊపిరితిత్తుల పనితీరులో లోపం కూడా ఆయాసానికి కారణం కావచ్చు. ఆస్తమా, సీవోపీడీ ఉన్న రోగులకు ఈ ఆయాసం సమస్య ఉంటుంది. రోగుల్లో వాయు నాళాలు ఉబ్బి గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఇది కూడా ఆయాసానికి కారణం కావచ్చు. 

    రక్తహీనత 
    రక్తంలో ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు శరీర భాగాలకు ఆక్సిజన్‌ను మోసుకెళ్లే సామర్థ్యం రక్తంలో తగ్గిపోతుంది. అందుకే చిన్న పని చేసినా అలసిపోతుంటారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. 

    అధిక బరువు 

    శరీర బరువు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మెట్లు ఎక్కడానికి ఇబ్బందిగానే ఉంటుంది. భూమి ఆకర్షణ శక్తిని కాదని పైకి వెళ్లడానికి సమస్యగానే ఉంటుంది. దీని వల్ల గుండెతోపాటు శరీరంలోని అన్ని అవయవాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. రోజూ కనీసం ఎక్స్‌ర్‌సైజ్‌ చేయని వారిలో కూడా ఈ సమస్య చూడవచ్చు. 

    సాధారణ అలసట కాదని ఎలాగుర్తించాలి?

    మెట్లు ఎక్కినప్పుడు ప్రతి ఒక్కరికీ కొంత అలసట సహజమే. అయితే ఏది ప్రమాదకరమో గుర్తించడం చాలా అవసరం. లేకుంటే చిన్న అలసటకే ఆందోళన చెందాల్సి ఉంటుంది. సాధారణ అలసట 2, 3అంతస్తులు వేగంగా ఎక్కినప్పుడు వస్తుంది. అలా కాకుండా పది మెట్లు ఎక్కగానే అలసిపోవడం ప్రమాదానికి సంకేతం కావచ్చు. 

    బాగా అలసిపోయినప్పుడు ఒకట్రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే సాధారణ స్థితికి రావచ్చు. ప్రమాదంలో ఉన్న వారికి మాత్రం చాలా సమయం విశ్రాంతి అవసరం అవుతుంది. అంతే కాకుండా వీరికి చాతిలో పట్టేసినట్టు ఉంటుంది. తలతిరగడం, చెమటలు పట్టడం జరుగుతుంది. వీటిలో ఏది ఉన్నా సరే వైద్యుణ్ని సంప్రదించడం మంచిది. 

    మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రాకుండా ఏం చేయాలి? 

    ఆయాసం వస్తుందని వైద్యుణ్ని సంప్రదించిన తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని తేలిన తర్వాత మీరు క్రమం తప్పకుండా అరగంట ఎక్స్‌ర్‌సైజ్ చేయండి. నడవడం, సైక్లింగ్, ఈత, కార్డియో వ్యాయామాలు చేయడం మంచిది. దీని వల్ల సాధారణ అలసట కూడా రాదు. యోగా, ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. ఐరన్ ఉండాలి అంటే ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్‌, పండ్లు బాగా తినాలి. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. 

    Click here to Read More
    Previous Article
    Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో డిన్నర్ భేటీ!
    Next Article
    US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!

    Related లైఫ్‌స్టైల్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment