Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    NEET JEE Weightage Changes: NEET, JEE అడ్మిషన్లలో బోర్డు మార్కులకు 50% వెయిటేజీ? విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పనిలో కేంద్రం!

    2 hours ago

    NEET JEE Weightage Changes: దేశవ్యాప్తంగా NEET, JEEలో ఎలాగైనా సీటు సంపాదించాలని విద్యార్థులు రాత్రి పగలు శ్రమిస్తున్నారు. దీంతో వారిపై ఒత్తిడి పెరుగుతోంది. దీన్ని తగ్గించే పనిలో కేంద్రం ఉంది. 

    NEET JEE Weightage Changes: విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపు ఇంటర్‌మీడియట్. దీని తర్వాత రాసే ప్రతీ పరీక్ష కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతోంది. అన్నింటి కంటే NEET, JEEపై ఉన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఎక్కడైనా పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత విజయం సాధించలేకపోయామని కొందరు విద్యార్థులు విషాదకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కానీ జేఈఈ, నీట్‌ విషయంలో మాత్రం పరీక్ష భయంతోనే విద్యార్థులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతటి ఒత్తిడి ఉన్న ఈ పరిక్షల్లో కీలక సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ జాతీయ స్థాయి పరీక్ష కేవలం ప్రవేశ పరీక్ష మార్కులు ఆధారంగానే విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నారు. అందుకే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని విద్యార్థులపై ఆరో తరగతి నుంచే ఒత్తిడి పెడుతున్నారు. అందుకే సంస్కరణలు చేపట్టాలని కేంద్రం చూస్తోంది. ప్రవేశ పరీక్ష మార్కులతోపాటు బోర్డు పరీక్షల్లో వచ్చే మార్కులను కూడా పరిగణలోకి తీసుకోవాలని చూస్తోంది. ఇలా చేయడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గి చదువుల శైలిలో మార్పులు వస్తాయని ఆశిస్తోంది  

    పరిగణలోకి బోర్డు పరీక్ష ఫలితాలు 

    ప్రస్తుతం జేఈఈ, నీట్‌లో విద్యార్థులు సాధించిన మార్కులు ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నారు. అందులో ఈ మార్కులు, రిజర్వేషన్లు ఆధారంగా వారికి అత్యున్నత విద్యా సంస్థల్లో చదువుకునే వీలు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు బోర్డు పరీక్షలను కేవలం అర్హతగా చూస్తున్నారు. అంటే బోర్డు పరీక్షల్లో పాస్ అయితే చాలు వాళ్లు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు రాసుకోవచ్చు. దీన్ని మార్చాలని కేంద్రం చూస్తోందని తెలుస్తోంది. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం విద్యార్థుల మెరిట్ జాబితా సిద్ధం చేసినప్పుడు బోర్డు పరీక్షల మార్కులను కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిదని భావిస్తోంది. ఇది 50 శాతం వరకు ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తోంది.  

    ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్టు ఈ సంస్కరణ అమలులోకి వస్తే విద్యార్థులు, కాలేజీలు బోర్డు చదువులపై కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వాటిని పాస్ కోసం మాత్రం చూస్తూ వచ్చారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై ఎక్కువ ఫోకస్ చేశారు. అంతే కాదు పోటీ పరీక్ష తీవ్రతను కూడా తగ్గించే పనిలో ఉంది. ప్రస్తుతం విద్యార్థులు చదువుతున్న సబ్జెక్ట్‌కు అనుగుణంగానే సిలబస్ మారిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా కోచింగ్ సెంటర్స్‌ దందా కూడా తగ్గుతుందని ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు ఏడాదిలో ఒకసారి మాత్రమే ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించే వారు, ఇప్పుడు దీన్ని మల్టిపుల్ టైమ్స్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే ఆప్షన్ కూడా ప్రభుత్వం వద్ద ఉంది. కంప్యూట్ ఆధారిత ఆన‌ డిమాండ్ పరీక్షలు నిర్వహించాలని సిఫార్సులు అందుకున్నారు.

    మార్పులకు కారణాలు 

    కీలకమైన సంస్కరణకు చాలా కారణాలు ఉన్నాయి. పరీక్ష పత్రాల లీకేజీ ప్రధాన సమస్యగా మారింది. పరీక్షలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా లీకేజీలు అరికట్టడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. దీంతోపాటు పరీక్ష విధానంలో కూడా చాలా మార్పులు ఉన్నాయి. మూల్యాంకనంపై అనేక అనుమానాలు ఉంటున్నాయి. పైస్థాయిలోనే కాకుండా క్షేత్ర స్థాయిలో కూడా సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. కొంతమంది కేవలం ఈ జాతీయ స్థాయి పరీక్షల కోసమే సన్నద్ధమవుతున్నారు. కీలకమైన బోర్డు సిలబస్‌ను పట్టించుకోవడం లేదు. ప్రత్యేక కోచింగ్ సెంటర్స్‌కు వెళ్లి కాలేజీకులకు, స్కూల్స్‌కు వెళ్లకుండా ప్రిపేర్ అవుతున్నారు. దీని వల్ల వారిలో సబ్జెక్ట్ రాకుండా పోతోంది. అలాంటి విద్యార్థులు సీటు రాకపోతే ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు విద్యార్థులు సీరియస్‌గా అన్నింటిని కవర్ చేస్తూ చదువుతున్నారు. అలాంటి విద్యార్థుల జీవితం ఒక రోజు పరీక్షతో నిర్ణయం కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఆ రోజు విద్యార్థి రాలేకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, ఇంకా ఏదైనా జరిగినా మరో ఏడాది వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. విలువైన కాలం వృథా పోతోంది. ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు చేపట్టాలని చూస్తోంది. 

    సంస్కరణలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే....

    ఈ రెండు జాతీయ స్థాయి పరీక్షా విధానంలో ఉన్న లోపాలు గమనించిన ప్రభుత్వం గత ఏడాది 9 మంది సభ్యులతో కూడిన ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. లోపాలు లేకుండా విద్యార్థులపై ఒత్తిడి పడకుండా, పారదర్శకత పెంచేందుకు లోతైన అధ్యయనం చేయాలని టాస్క్ ఈ కమిటీకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కమిటీ తన స్టడీని కంప్లీట్ చేసింది. త్వరలోనే కేంద్రానికి నివేదిక ఇవ్వబోతోంది. ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత వారు చేసిన సిఫార్సులు అమలు విషయంపై క్లారిటీ వస్తుంది. వాటి తీవ్రతను బట్టి వచ్చే విద్యాసంవత్సరం నుంచా లేదా దశల వారీగా అమలు చేస్తారా అనేది తేల్చనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మాత్రం కొన్ని అమలు అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది. 

    Click here to Read More
    Previous Article
    BAT-BMS Controversy: BAT-BMSతో సహా 7 యాప్‌లను తొలగించాలని గూగుల్‌, ఆపిల్‌కు ప్రభుత్వం నోటీసులు! ఎందుకు ఎలా వివాదం మొదలైంది?
    Next Article
    Agra Bathroom Murder Case: ఆగ్రాలో భర్తను చంపి బాత్‌రూమ్‌లోనే పూడ్చిపెట్టిన భార్య! 45 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం!

    Related ఎడ్యుకేషన్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment