Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

    2 hours ago

    Buying Vegetables In Rainy Season : వర్షాకాలంలో కూరగాయలు కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అవి త్వరగా కుళ్లిపోతాయి. మరి వెజిటెబుల్స్ కొనేప్పుడు ఏ టిప్స్ ఫాలో అవ్వాలి. 

    Spot Fresh Vegetables During the Monsoon : వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూరగాయలు బూజు, బ్యాక్టీరియా, కీటకాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో అవి త్వరగా పాడైపోతాయి. అలాగే కొన్ని కూరగాయలు బయట చూడటానికి చాలా బాగున్నట్లు కనిపించినా.. లోపల మాత్రం కుళ్లిపోయి ఉంటాయి. అందుకే వర్షాకాలంలో కూరగాయలు కొనేప్పుడు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. 

    కూరగాయలు కొనేటప్పుడు ఏవి తాజాగా ఉన్నాయో.. ఏవి పాడవుతున్నాయో తెలుసుకునేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. వర్షాకాలంలో ముందుగా కుళ్లిపోయే కూరగాయలు ఏంటో.. వాటిని కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం. 

    వంకాయలు..

    వర్షాకాలంలో వంకాయలకు పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, కొనుగోలు చేసేటప్పుడు.. వాటికి రంధ్రాలు లేదా పగుళ్లు ఉన్నాయేమో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా ఉంటే.. వాటిని కొనవద్దు. వాటిలో పురుగులు అధికంగా ఉండవచ్చు.

    సొరకాయ

    సొరకాయలు కొనేటప్పుడు.. వాటి బరువును గమనించండి. అధిక బరువున్న సొరకాయలలో గింజలు ముదిరిపోయి ఉంటాయి. దీనివల్ల వాటి రుచి తగ్గిపోతుంది. తక్కువ బరువున్న సొరకాయలు తాజాగా ఉంటాయి. వాటి గింజలు మృదువుగా ఉండి.. రుచిగా ఉంటాయి.

    ఉల్లిపాయలు

    ఉల్లిపాయ కాడను నొక్కితే.. సులభంగా లోపలికి వెళితే లేదా మెత్తగా అనిపిస్తే.. ఆ ఉల్లిపాయ పాడైపోయి కుళ్లిపోతోందని అర్థం. ఉల్లిపాయలను ఒకేసారి ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి.. కొనే ముందు వాటిని తప్పకుండా పరిశీలించి తీసుకోవాలి.

    బెండకాయ

    బెండకాయ కొనే ముందు.. దాని కొనను మెల్లగా విరిచి చూడండి. అది సులభంగా విరిగితే తాజాగా ఉన్నట్లు. తాజా బెండకాయ పచ్చగా, కరకరలాడుతూ ఉంటుంది. ఒకవేళ దాని కొన సులభంగా విరగకుండా కేవలం వంగితే, అది పాడైపోయినట్లు, అలాంటిది కొనకూడదు.

    ఆకుకూరలు

    పాలకూర, మెంతి వంటి ఆకు కూరలు వర్షాకాలంలో తేమను నిలుపుకుంటాయి. దీనివల్ల అవి బ్యాక్టీరియా, క్రిములు వృద్ధి చెందడానికి అనువుగా మారతాయి. వాటిని శుభ్రపరచడం కూడా కష్టమే అవుతుంది. మీరు వాటిని తినాలనుకుంటే.. ఉపయోగించే ముందు వాటిని శుభ్రంగా కడిగి.. కొన్ని నిమిషాల పాటు వేడి నీటిలో ఉడకబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది.

    మష్రూమ్స్..
    పుట్టగొడుగులు తేమతో కూడిన వాతావరణంలో బాగా పెరుగుతాయి. అయితే వర్షాకాలంలో శిలీంధ్రాల సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. కొన్ని రకాల పుట్టగొడుగులు విషపూరితమైనవి కావచ్చు. కాబట్టి ఈ సీజన్​లో పుట్టగొడుగులను కొనుగోలు చేసేటప్పుడు, తినేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
    వర్షాకాలంలో కూరగాయలకు సులభంగా బూజు, బ్యాక్టీరియా, కీటకాలు పట్టవచ్చు. పాడైన లేదా పురుగులు పట్టిన కూరగాయలను తినడం వల్ల జీర్ణ సమస్యలు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరగవచ్చు. అందుకే వర్షాకాలంలో ఎల్లప్పుడూ తాజా కూరగాయలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే వాటిని ఉపయోగించే ముందు పూర్తిగా శుభ్రం చేసి ఉడికించి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. 

     

    Click here to Read More
    Previous Article
    Express Hari: మధ్య తరగతి కుర్రాడి కష్టానికి ఫలితం... నా చిరునామా... సొంత ఇంట్లో అడుగుపెట్టిన హరి

    Related లైఫ్‌స్టైల్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment