Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

    19 hours ago

    Objection My Lord Series OTT Platform : సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో రాబోతోన్న కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్' స్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.

    Srikanth's Objection My Lord Web Series OTT Release Date Locked : యంగ్ హీరోస్ దగ్గర నుంచీ సీనియర్ హీరోస్ వరకూ చాలామంది ఓటీటీలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్‌గా హీరో సందీప్ కిషన్ సూపర్ సుబ్బు సిరీస్‌తో అలరించారు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య 'ధూత' సిరీస్‌తో సూపర్ రెస్పాన్స్ అందుకోగా ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా రెడీ అవుతోంది. తాజాగా సీనియర్ హీరో శ్రీకాంత్ సరికొత్త కోర్టు రూమ్ డ్రామా సిరీస్‌తో రాబోతున్నారు.

    ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

    శ్రీకాంత్ లాయర్‌గా ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'అబ్జెక్షన్ మై లార్డ్' (Objection My Lord). ప్రముఖ ఓటీటీ ZEE5లో జులై 31 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ హైప్ క్రియేట్ చేస్తోంది. 'ప్రతీ అభ్యంతరమూ వ్యవస్థను సవాల్ చేస్తుంది. ప్రతీ గొంతుకూ వినబడే అర్హత ఉంది.' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కోర్టు బోనులో ఓ వ్యక్తి చుట్టూ మంటలు అంటుకుంటున్నట్లుగా ఉన్న పోస్టర్ స్టోరీపై మరింత ఆసక్తిని పెంచేసింది.

     

    ఈ సిరీస్‌లో శ్రీకాంత్‌తో పాటు అనన్య శర్మ, ముఖేష్ రిషి, మధుబాల, ప్రకాశ్ రాజ్, షఫీ, సుమన్, సిజ్జు మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. పరశురామ్ అనే లాయర్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు ముఖేష్ జి దర్శకత్వం వహించగా... డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించారు. 

    Click here to Read More
    Previous Article
    Jani Master : జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ - మెగాస్టార్, బాలయ్య ఎంట్రీతో కాంట్రవర్సీకి చెక్
    Next Article
    Naga Chaitanya Sobhita Dhulipala : చై.. నా శారీ ఎలా ఉంది? - శోభిత క్వశ్చన్‌కు చై క్యూట్ రియాక్షన్... లెనిన్ సక్సెస్‌పై వెరీ హ్యాపీ

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment