Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Maa Inti Bangaram Collections Day 10 : మా ఇంటి బంగారం సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ - అరుంధతి రికార్డును దాటేసిన సమంత

    4 hours ago

    Maa Inti Bangaram Box Office Collection Day 10 : పది రోజులైనా సమంత మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద అదే జోష్‌ కంటిన్యూ చేస్తోంది. 10 రోజుల్లో అనుష్క అరుంధతి మూవీ రికార్డును అధిగమించింది.

    Samantha's Maa Inti Bangaram Box Office Day 10 Collections : సమంత మా ఇంటి బంగారం పది రోజులైనా బాక్సాఫీస్ వద్ద అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. సెకండ్ వీకెండ్ ఆదివారం మంచి నెంబర్స్ నమోదు చేసింది. స్టార్ హీరోయిన్ అనుష్క అరుంధతి మూవీ వరల్డ్ వైడ్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ రికార్డును అధిగమించింది. 

    10 రోజుల కలెక్షన్స్

    ఈ మూవీ పది రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.78.71 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఒక్క ఆదివారమే ఇండియావ్యాప్తంగా రూ.5.30 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఆదివారం ఒక్క రోజే ఇండియావ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ రూ.6.14 కోట్లు నమోదు చేశాయి. మొత్తం పది రోజుల్లో రూ.48.25 కోట్ల నెట్ కలెక్షన్స్... రూ.55.86 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అటు... ఓవర్సీస్‌లోనూ అదే జోష్ కంటిన్యూ చేసింది. ఆదివారం ఒక్క రోజే ఓవర్సీస్‌లో రూ.కోటి వసూళ్లు కాగా... టోటల్ గ్రాస్ కలెక్షన్స్ రూ.22.85 కోట్లకు చేరుకున్నాయి.

    తెలుగు వెర్షన్... సూపర్ ఆక్యుపెన్సీ 

    తెలుగు వెర్షన్ మొత్తం మీద 46.94 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. తమిళ వెర్షన్ మొత్తం మీద 40.21 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఇండియావ్యాప్తంగా నెట్ వసూళ్లలో ఆదివారం ఒక్క రోజే తెలుగు రాష్ట్రాల్లో రూ.4.50 కోట్లు, కర్ణాటక రూ.1.10 కోట్లు. తమిళనాడు రూ.41 లక్షలు, మిగిలిన ప్రాంతాల్లో రూ.12 లక్షల వసూళ్లు సాధించాయి.

     

    సుమారు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన మూవీ ఇప్పటివరకూ దాదాపు నాలుగు రెట్ల వసూళ్లు సాధించింది. సమంత కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేయడం సహా హిట్ మూవీగా నిలిచింది.

    కలెక్షన్స్ వివరాలు ఇలా...

    • 10 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ - రూ.78.71 కోట్లు
    • ఇండియావ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ - రూ.55.86 కోట్లు
    • ఇండియావ్యాప్తంగా నెట్ కలెక్షన్స్ - రూ.48.25 కోట్లు
    • ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్స్ - రూ.22.85 కోట్లు
    • ఆదివారం ఇండియా గ్రాస్ కలెక్షన్స్ - రూ.6.14 కోట్లు
    • ఆదివారం ఇండియా నెట్ కలెక్షన్స్ - రూ.5.30 కోట్లు

    దాదాపు మూడేళ్ల తర్వాత సమంత లీడ్ రోల్‌లో మా ఇంటి బంగారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటనకు, యాక్షన్ సీక్వెన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీకి సమంత ఫ్రెండ్, ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించగా... సమంత భర్త రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, మంజుషా, సీనియర్ నటి గౌతమి, శ్రీముఖి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు. సమంత సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు.

    Click here to Read More
    Previous Article
    Ambati Arjun: బుల్లితెర, బిగ్ బాస్ టు వెండి తెర.. మిస్టర్ పర్ఫెక్ట్ అంబటి అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు
    Next Article
    Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment