Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు

    4 hours ago

    Using Phone Right After Waking Up : నిద్ర లేవగానే ఫోన్ చూసే అలవాటు ఉందా? అయితే మీ రోజూవారీ అలసట, తలనొప్పి, ఏకాగ్రత లోపానికి కారణం ఇదే కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే..

    Staying Away From Your Phone After Waking Up : ఉదయం నిద్రలేవగానే చాలా మంది చేసే మొదటి పని ఏంటంటే.. మొబైల్ ఫోన్ తీసుకుని వాట్సాప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా, న్యూస్ లేదా ఇమెయిల్స్ చెక్ చేస్తారు. ఈ అలవాటు సాధారణంగా కనిపించినా.. ఇది రోజంతా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

    నిద్రలేవగానే ఫోన్ ఎందుకు చూడకూడదంటే..

    నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిద్రలేవగానే మన మెదడు పూర్తిగా యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లదు. ఆ సమయంలో మెదడు నెమ్మదిగా విశ్రాంతి స్థితి నుంచి మేల్కొనే ప్రక్రియలో ఉంటుంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా ఫోన్‌లో నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, సోషల్ మీడియా కంటెంట్ చూడడం వల్ల మెదడుపై ఒక్కసారిగా ఎక్కువ సమాచారం పడుతుంది. దీంతో నాడీ వ్యవస్థ ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. 

    ఉదయం లేవగానే ఫోన్ చూస్తే మెదడులో డోపమైన్ అనే రసాయనం ఒక్కసారిగా పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఫోన్‌ను పదేపదే చెక్ చేయాలనే అలవాటు పెరగడంతో పాటు, రోజంతా ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది.

    తలనొప్పి, అలసటకు ఇదే కారణమా?

    నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫోన్‌ను ఉదయం ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కొందరిలో తలనొప్పి, కళ్లపై ఒత్తిడి, మానసిక అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు. అయితే ఇవి ప్రతి ఒక్కరిలో ఒకే విధంగా ఉండవు. స్క్రీన్‌ను ఎంతసేపు చూస్తున్నారు? నిద్ర ఎంత బాగా పట్టింది.. వంటి అంశాలపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది.

    Click here to Read More
    Previous Article
    Maa Inti Bangaram Collections Day 10 : మా ఇంటి బంగారం సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ - అరుంధతి రికార్డును దాటేసిన సమంత

    Related లైఫ్‌స్టైల్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment