Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Rajamouli Reaction : రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ

    7 hours ago

    PV Sindhu Reaction : దర్శక ధీరుడు రాజమౌళి విషెష్‌కు స్టార్ షట్లర్ పీవీ సింధు ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు తాను సిద్ధమని సింధు రిప్లై ఇచ్చారు.

    PV Sindhu Ready Act In Movies Tweet To Rajamouli : స్టార్ షట్లర్ పీవీ సింధు సినిమాల్లోకి రానున్నారా?... లేదా జస్ట్ ఫన్ చేశారా?. దర్శక ధీరుడు రాజమౌళి ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన ఆమె తన మనసులో మాట బయటపెట్టారు. ప్రస్తుతం ఈ సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే...

    జపాన్ ఓపెన్ టైటిల్ విజేతగా సింధు చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్‌గా రికార్డు సృష్టించారు. దీనిపై రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సింధును అభినందిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. దీనిపై ఆమె సైతం రియాక్ట్ అయ్యారు.

    వాట్ ఏ ఛాంపియన్స్ కమ్ బ్యాక్' 

    'జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించావు. వాట్ ఏ ఛాంపియన్స్ కమ్ బ్యాక్. దేశం నిన్ను చూసి గర్విస్తోంది. కంగ్రాట్యులేషన్స్' అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. దీనికి సింధు రిప్లై ఇచ్చారు. 'థాంక్యూ సో మచ్ రాజమౌళి సర్. మీ వారణాసి కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నా. ఒకవేళ మీరు తెరకెక్కించే ఏ సినిమాలో అయినా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే... మీ కొత్త హీరోయిన్‌గా మారడానికి నేను ఎంతో సంతోషిస్తాను.' అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశారు. 

    ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా... ఆమె త్వరలోనే సినిమాల్లోకి రానుందా? అందుకే తన మనసులో మాట ఇలా బయటపెట్టారా? అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. కాగా, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పటికే నితిన్ రాబిన్ హుడ్‌ సినిమాలో చిన్న రోల్ చేశారు. చాలా వరకూ తెలుగు పాటలకు తనదైన రీతిలో డ్యాన్సులు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. గతంలో వార్నర్ కూడా రాజమౌళికి ఇలాంటి రిక్వెస్టే పంపారు. దీనికి రిప్లై ఇచ్చిన రాజమౌళి... 'బాహుబలి' కిరీటాన్ని కూడా పంపారు.
    ఇక, యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న వారణాసి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా... అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో షూటింగ్ కంప్లీట్ కానుందని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో మహేశ్ బాబు రుద్రుడు, రాముడిగా నటిస్తున్నారు. మందాకిని పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, విలన్ రణకుంభగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న పాన్ ఇండియా స్థాయిలో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Click here to Read More
    Previous Article
    Nagarjuna: వాయిదాలు ఎందుకు? టాలీవుడ్‌లో తప్పుల్ని బయటపెట్టిన నాగార్జున
    Next Article
    Preethi Sharma: టాటూలంటే పిచ్చి.. టిక్‌టాక్ టు సీరియల్స్.. ‘పడమటి సంధ్యారాగం’ ప్రీతి శర్మ రియల్ లైఫ్ విషయాలు

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment