Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Rains in Andhra Pradesh and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్

    1 hour ago

    Andhra Pradesh Rains | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురువనుననాయని వాతావారణ శాఖ అంచనా వేసింది.

    Telangana Rains News | అమరావతి: వాయవ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావం కారణంగా వాతావరణంలో మార్పులు వస్తాయని, రెండు నుంచి మూడు రోజుల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
    నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం నెలకొంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పోలవరం, కోనసీమతో పాటు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
    బలమైన ఈదురు గాలులు 
    వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు, ప్రయాణికులు జాగ్రత్త వహించాలని సూచించింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో 5 రోజులపాటు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు సూచించారు. విశాఖ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీర ప్రాంతంలో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు.

    తెలంగాణలో శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు.. 
    తెలంగాణలో శుక్రవారం, శనివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్,  కుమురం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లో రెండు రోజులపాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే వీలుందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నేటి నుంచి మూడు రోజులపాటు సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.

    బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి, కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం రవీంద్రనగర్‌లో 11 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో 10 సెం.మీ, కౌటాలలో 10 సెం.మీ, వాంకిడిలో 6.2 సెం.మీ వర్షం పడింది. ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం చాప్రాలలో 6.4 సెం.మీ వర్షపాతం నమోదయింది.

    Click here to Read More
    Previous Article
    Telangana Food Safety Raids: సోదాల జోరు సరే.. హోటళ్లు దారికి వచ్చే పక్కా యాక్షన్ ప్లాన్ ఏది?
    Next Article
    Rao Bahadur Twitter Review - రావు బహదూర్ ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ ఖాతాలో మరో హిట్? సినిమాకు వెళ్ళే ముందు చదవాల్సిన టాప్ 10 ట్వీట్లు

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment