Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Allu Arjun Raaka : అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

    4 hours ago

    Naila Grrewal : అల్లు అర్జున్ రాకాలో మరో హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే దీపికా పదుకోన్‌తో పాటు మలయాళీ బ్యూటీ ఫిక్స్ కాగా... పంజాబీ బ్యూటీ కూడా ఫిక్స్ అయ్యారు.

    Bollywood Actress Naila Grrewal Jions Allu Arjun Raaka Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతోన్న పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ రాకా. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ఫస్ట్ లుక్ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్ గురించి ఏ చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ ఫిక్స్ అయ్యింది.

    ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్స్ నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. కేవలం దీపికా పదుకోన్‌ను మాత్రమే టీం అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. రీసెంట్‌గా మలయాళ బ్యూటీ ఫెమినా జార్జ్ తాను ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు మరో బ్యూటీ కూడా తాను 'రాకా'లో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఆమెనే పంజాబీ బ్యూటీ నైలా గ్రెవాల్ (Naila Grrewal). దాదాపు 11 ఏళ్ల తర్వాత నైలా 'రాకా'తో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

    2015లో వచ్చిన 'తమాషా' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ... బరేలీ కి బర్ఫీ, తప్పడ్, ఇష్క్ విష్క్ రీబౌండ్ వంటి చిత్రాల్లో  నటించారు. ఫైనల్‌గా కోర్ట్ రూం డ్రామా సిరీస్ 'మామ్లా లీగల్ హై'లో నటించారు. ఇప్పుడు రాకాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు నైలా.

    'నా కెరీర్‌లో వెరీ స్పెషల్'

    అల్లు అర్జున్ రాకాలో భాగం కావడం తన కెరీర్‌లో వెరీ స్పెషల్ అని అన్నారు నైలా గ్రెవాల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'నేను రాకాలో నటిస్తున్నా. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో పని చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. ఇప్పుడు ఆ ఛాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. బాలీవుడ్‌లో మాత్రమే పని చేసిన నన్ను ఇలాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా. రాకాలో భాగం కావడం నా కెరీర్‌లో మైలురాయి.' అని చెప్పారు.

    ఈ మూవీలో బన్నీతో పాటు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే, నేషనల్ క్రష్ రష్మిక ఇందులో నెగిటివ్ రోల్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అలాగే, మృణాల్ ఠాకూర్ కూడా కీలకపాత్ర పోషించనున్నారనే టాక్ వినిపించింది. అయితే, వీటిని టీం కన్ఫర్మ్ చేయలేదు. ఫస్ట్ లుక్‌తోనే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. చీకటి నుంచి వెలుగులు నింపే వారియర్‌గా బన్నీ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

    ఈ ఏడాది చివరి కల్లా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించాలని అట్లీ భావిస్తున్నారట. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు టీం ప్లాన్ చేస్తోంది.

    Click here to Read More
    Previous Article
    Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
    Next Article
    Mahesh Babu : సౌత్ కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి ఎంగేజ్మెంట్ - ఫోటోలు షేర్ చేసిన నమ్రత

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment