Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!

    4 hours ago

    Mudragada Padmanabham:ముద్రగడ అంత్యక్రియల్లో వివాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె క్రాంతి రాకను కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఆమెను వెళ్లిపోవాలని చెప్పడంతో కిర్లంపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

    Mudragada Padmanabham Funeral: మాజీమంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చర్చించారు. అనంతరం ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు జారీ అయ్యారు. ఈ మేరకు ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ముద్రగడ పార్దివదేహం  అక్కడే ఉంది. ఆయన్ని చూసేందుకు భారీగా వైసీపీ నేతలు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. అయితే కుమార్తె క్రాంతి శీల రావడంతో వివాదం నెలకొంది. ఆమె రాకను ముద్రగడ అనుచరులతోపాటు కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పోలీసులు ఆమెను ప్రత్తిపాడు వద్దే ఆపేయడం ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

    2024లో మొదలైన వివాదం 

    వైసీపీలో ముద్రగడ చేసిన తర్వాత కూటమికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయన కుమార్తె క్రాంతి జనసేనలో చేరారు. అప్పటి నుంచి తండ్రీ కుమార్తె మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈమే పవన్‌తో ట్రావెల్ అవ్వడమే కాకుండా తన తండ్రి, సోదరుడి నుంచి కూడా ప్రాణహాని ఉందని ప్రకటనలు చేశారు. ఆస్తుల విషయంలో వివాదాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తనను వేధిస్తున్నారని చెప్పి పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. దీంతో వీళ్లిద్ధరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. 

    రాజకీయాల కోసం తండ్రీ కూతుళ్ల మధ్య విభేదాలు సృష్టించారని ముద్రగడ ఆరోపించారు. అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్లో పలుచన చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో పావుగా మారిన తన కుమార్తెపై తీవ్ర విమర్శలు చేశారు. తనకు కుమార్తె లేదని ప్రకటించారు. అందుకే తాను చనిపోయిన తర్వాత కూడా చివరి చూపునకు కుమార్తె రావడానికి లేదని తేల్చి చెప్పేశారు. దాన్ని గుర్తుపెట్టుకున్న ముద్రగడ భార్య, ఇతర కుటుంబ సభ్యులు క్రాంతిని కిర్లంపూడి రానివ్వలేదు. 

    క్రాంతిని మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. అన్ని అడ్డంకులను దాటుకొని ఆమె తన తండ్రి స్వగ్రామం కిర్లంపూడి చేరుకున్నారు. అయితే ఆమెను చూసిన తల్లి గట్టిగట్టిగా అరిచారు. ఆమెను ఎవరు రానిచ్చారని ప్రశ్నించారు. ఆమె వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. అటువైపు నుంచి క్రాంతి నాన్నా, నాన్నా అంటూ ఏడుస్తూ ఉన్నారు. అయినా సరే తండ్రి డెడ్‌బాడీ వద్దకు రావడానికి లేదని కుటుంబ సభ్యులు తేల్చేశారు. ఆమెది దొంగ ఏడుపని ఆరోపించారు. 

    కుటుంబ సభ్యులతోపాటు ముద్రగడ అనుచరులు కూడా క్రాంతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముద్రగడకు అనుకూలంగా స్లోగన్స్ అందుకున్నారు. ఇలా పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది. చివరకు తన తండ్రిని దూరం నుంచి మాత్రం చూడగలిగారు కుమార్తె క్రాంతి. కనీసం డెడ్‌బాడీ ఉంచిన బాక్స్‌ను కూడా టచ్‌ చేయనివ్వలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని గ్రహించిన పోలీసులు ఆమెను అక్కడి నుంచి పంపేశారు. తండ్రి కడసారి చూపునకు నోచుకోలేదని కన్నీళ్లతో క్రాంతి అక్కడి నుంచి వెనుదిరిగారు.  

    మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. 

    Click here to Read More
    Previous Article
    US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
    Next Article
    Allu Arjun Raaka : అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment