Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Lenin Box Office Collection Day 3: లెనిన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... అయ్యగారి కెరీర్‌లో నంబర్ వన్ - అఖిల్ దూకుడు

    1 hour ago

    Lenin First Weekend Collection: అక్కినేని అఖిల్ కెరీర్ బెస్ట్ కలెక్షన్లు సాధిస్తూ బాక్స్ ఆఫీస్ బరిలో దూసుకు వెళుతోంది 'లెనిన్'. మూడు రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనేది చూస్తే... 

    hil Akkineni Lenin Three Days Collection: అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన 'లెనిన్' సినిమా ఆయన కెరీర్ బెస్ట్ కలెక్షన్లు సాధిస్తోంది. బాక్సాఫీస్ బరిలో దూకుడు చూపిస్తూ మొదటి మూడు రోజుల్లో భారీ వసూళ్ళు సాధించింది. ఈ సినిమా కలెక్షన్లు రోజు రోజుకూ పెరుగుతూ ఉండటం గమనార్హం. ఫస్ట్ వీకెండ్ 'లెనిన్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? ఆదివారం ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే...

    'లెనిన్' ఫస్ట్ వీకెండ్ @ 37 కోట్లు!
    Lenin Three Days India Net Collection: 'లెనిన్' కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఓపెనింగ్ వీకెండ్ అయితే డైలీ కలెక్షన్లలో గ్రోత్ కనిపించింది. ఫస్ట్ వీకెండ్ 37 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టింది. ఇండియాలో గ్రాస్ ఎంత? ఓవర్సీస్ గ్రాస్ ఎంత? అనేది చూస్తే...

    • థియేటర్లలో 'లెనిన్' విడుదలైన మూడో రోజు (ఆదివారం) ఇండియాలో రూ. 9.65 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. రెండో రోజు కలెక్షన్లు (రూ. 8.65 కోట్ల)తో పోలిస్తే 11.6 శాతం పెరిగాయి.
    • 'లెనిన్'కు మొదటి రోజు (శుక్రవారం) రూ. 7.15 కోట్ల నెట్ వచ్చింది. మూడు రోజులు ముగిసే సరికి ఇండియాలో రూ. 25.45 కోట్ల నెట్ రాబట్టింది. ఇండియా గ్రాస్ చూస్తే... రూ. 29.27 కోట్లు సాధించింది.
    • ఓవర్సీస్ మార్కెట్‌లో ఆదివారం 'లెనిన్'కు 2 కోట్ల గ్రాస్ వచ్చింది. దాంతో ఫస్ట్ వీకెండ్ ఓవర్సీస్ గ్రాస్ రూ. 7.80 కోట్లకు చేరుకుంది.
    • ప్రపంచవ్యాప్తంగా 'లెనిన్' ఓపెనింగ్‌ వీకెండ్ గ్రాస్ రూ. 37.07 కోట్లకు చేరింది.

    కర్ణాటకలోనూ 'లెనిన్'కు మంచి కలెక్షన్లు!
    రెండు తెలుగు రాష్ట్రాలు... ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'లెనిన్'కు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. కర్ణాటక నుంచి కూడా చెప్పుకోదగ్గ రీతిలో వసూళ్ళు వస్తుండటం గమనార్హం. ఆదివారం తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 9.50 కోట్ల గ్రాస్ రాగా... కర్ణాటక నుంచి రూ. 1.25 కోట్లు, తమిళనాడు నుంచి రూ. 15 లక్షలు, రెస్టాఫ్ ఇండియా నుంచి రూ. 20 లక్షల గ్రాస్ వచ్చింది. థియేటర్లలో ఆదివారం (64.19 శాతం) ఆక్యుపెన్సీ కూడా బావుంది. విశాఖ (84.8 శాతం), వరంగల్ (81 శాతం), హైదరాబాద్ (77.5 శాతం) నగరాల్లో ఎక్కువ ఆక్యుపెన్సీ కనిపించింది. హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

    అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా... ప్రమోద్ పంజు విలన్ రోల్ చేశారు. రమేష్ ఇందిరా, రాంకీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తమన్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు ప్లస్ అయ్యాయి. సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమాకు మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు.

    Click here to Read More
    Previous Article
    Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
    Next Article
    One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment