Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Ram Charan: డాన్సర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రామ్ చరణ్ భారీ విరాళం... ఎంత అమౌంట్ ఇచ్చారంటే?

    3 hours ago

    Jani Master On Ram Charan: తెలుగు సినిమా టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) సభ్యుల హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రామ్ చరణ్ భారీ విరాళం ఇచ్చారని జానీ మాస్టర్ తెలిపారు.

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. తెలుగు సినిమా టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) సభ్యుల హెల్త్ ఇన్సూరెన్స్ కోసం డబ్బులు అవసరం అని తెలిసి భారీ ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఆ విషయాన్ని జానీ మాస్టర్, సుమలత దంపతులు వెల్లడించారు. 

    'టీఎఫ్‌టీడీడీఏ'కి 40 లక్షలు ఇచ్చిన రామ్ చరణ్!
    'టీఎఫ్‌టీడీడీఏ' ఎన్నికలకు ముందు సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తానని జానీ మాస్టర్ హామీ ఇచ్చారు. అయితే... ఆ తర్వాత చేయించలేదని విమర్శలు వచ్చాయి. వాటిపై ఆయన స్పందించారు.

    ''జానీ మాస్టర్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు... కానీ ఏం చేయడం లేదని చాలా మాటలు అన్నారు. నేను ఇటీవల కాలంలో చేసిన పెద్ద సినిమా 'పెద్ది' మాత్రమే. ఇతరత్రా పాటలు ఏమీ చేయలేదు. అందువల్ల, నాకు పెద్దగా డబ్బులు రాలేదు. 'పెద్ది' సినిమాకు కొరియోగ్రఫీ చేసినందుకు నాకు 18 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ వచ్చింది. ఆ డబ్బులను అసోసియేషన్ సభ్యుల హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఇచ్చాను. మన డ్యాన్సర్ల కష్టాలు, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి రామ్ చరణ్ సార్ తెలుసుకుని మాకు 40 లక్షల రూపాయలు ఇచ్చారు. సభ్యులు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలంటే 58 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. రామ్ చరణ్ గారు 40 లక్షలు ఇచ్చిన తర్వాత మిగతా 18 లక్షల గురించి ఇతర మాస్టర్లను అడిగా. అయితే ఎవ్వరూ ముందుకు రాలేదు. అలాగని నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు. నాకు వచ్చిన 'పెద్ది' టీం పేమెంట్‌ను ఇచ్చాను. అందులో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు'' అని జానీ మాస్టర్ తెలిపారు.

    డాన్సర్స్ అసోసియేషన్ గొడవలకు చిరు చెక్!
    జానీ మాస్టర్ ప్రెస్ మీట్ నిర్వహించి రామ్ చరణ్ విరాళం గురించి వెల్లడించడానికి ముందు 'టీఎఫ్‌టీడీడీఏ'లో గొడవలు జరిగాయి. సుమారు పది మంది సభ్యులను సస్పెండ్ చేయడం, రహస్యంగా ఎన్నికలు నిర్వహించాలని అనుకోవడం వంటి అంశాలు టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య వివాదానికి దారి తీశాయి. ఆ గొడవకు మెగాస్టార్ చిరంజీవి చెక్ పెట్టారు. మాస్టర్స్ ఇద్దరినీ తన దగ్గరకు పిలిపించుకుని సమస్యను పరిష్కరించారు.

    Click here to Read More
    Previous Article
    Shruti Haasan: శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?
    Next Article
    వర్షం కురిసే ముందు కప్పలు ఎందుకు అరుస్తాయి? ప్రకృతి బయో ఇండికేటర్

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment