Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Kidney Cancer : నగరవాసుల్లో పెరుగుతోన్న కిడ్నీ క్యాన్సర్ కేసులు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తోన్న ఆంకాలజిస్ట్

    2 hours ago

    Risk Factors for Kidney Cancer : పల్లెల్లో పోలిస్తే నగరాల్లో కిడ్నీ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని.. వాటికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు. అవేంటో చూసేద్దాం.

    Warning Sign of Kidney Cancer : ఇండియాలో కిడ్నీ క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్తున్నారు నిపుణులు. ముఖ్యంగా మధ్య వయస్కులకు.. అంటే 40 నుంచి పైబడినవారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. పల్లెలతో పోల్చుకుంటే నగరాల్లో ఎక్కువమంది దీనిబారిన పడుతున్నట్లు పలు అధ్యయనాలు చెప్తున్నాయి. దీనికి రెండు ప్రధానకారణాలు ఉన్నాయని చెప్తున్నారు. అవేంటో.. అసలు కిడ్నీ క్యాన్సర్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

    కిడ్నీ క్యాన్సర్ గురించి విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్​లో కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ పలు విషయాలు తెలిపారు. కిడ్నీ క్యాన్సర్ రావడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలిపారు. వాటిలో ఒకటి సిగరెట్, రెండు ఊబకాయం. ఈ రెండు కారణాలు పట్టణాల్లోని వ్యక్తులను బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయని.. ఇవి కిడ్నీ క్యాన్సర్​కు దారితీస్తున్నాయని వెల్లడించారు. 

    కిడ్నీ క్యాన్సర్

    కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. కిడ్నీ కణాల్లో తేడాలు ఏర్పడి.. కణితులుగా ఏర్పడితే దానినే కిడ్నీ క్యాన్సర్ అంటారు. 

    కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు

    కిడ్నీ క్యాన్సర్ ఉంటే.. యూరిన్​లో రక్తం కనిపించడం, బరువు తగ్గిపోవడం, ఒక వైపు నొప్పి రావడం, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండా కూడా కిడ్నీ క్యాన్సర్ ఎటాక్ అవ్వచ్చని చెప్తున్నారు నిపుణులు.

    స్మోకింగ్ వల్ల కిడ్నీ క్యాన్సర్ ఎందుకొస్తుందంటే..

    "స్మోకింగ్ చేసినప్పుడు పీల్చుకునే హానికరమైన కెమికల్స్​ని కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. మన ఒంట్లోకి చేరే ప్రతి కెమికల్​ని కూడా కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. స్మోక్​లో క్యాన్సర్​కు కారణమయ్యే దాదాపు 70 రకమైన కెమికల్స్ ఉంటాయి. ఇవి కిడ్నీలో ఫిల్టర్ అవ్వడం వల్ల అక్కడ పేరుకుని.. కిడ్నీ కణాల విభజన ప్రక్రియను దెబ్బతీస్తాయి. ఇవే క్యాన్సర్ కణాలుగా మారి.. కిడ్నీ క్యాన్సర్​కు దారితీస్తాయి." - డాక్టర్ శ్రవణ్ కుమార్.

    ఊబకాయం ప్రభావం.. 

    బరువు ఎక్కువ ఉన్నవారిలో హార్మోనల్ ప్రాబ్లమ్, ఇన్​ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కిడ్నీల్లో కణాలపై ప్రభావం పడి అది క్యాన్సర్​కు దారితీస్తుంది డాక్టర్ శ్రవణ్ తెలిపారు. ఈ రెండు కారణాల వల్ల కిడ్నీ క్యాన్సర్ ప్రమాదం సాధారణంగా కంటే ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. 

    తీసుకోవాల్సిన జాగ్రత్తలు

     

    కిడ్నీ క్యాన్సర్ ప్రమాదాన్ని దూరం చేసుకోవడానికి స్మోకింగ్ మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే రెగ్యులర్​గా వ్యాయామం చేయాలని చెప్తున్నారు. బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ.. పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే షుగర్, కూల్ డ్రింక్ మానేయాలని.. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు.  బీపీ, షుగర్ కూడా అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.  

    Click here to Read More
    Previous Article
    Mission Vatsalya: నెలకు రూ.4 వేలు ఇచ్చే ప్రభుత్వ పథకం.. 'మిషన్ వాత్సల్య' స్కీమ్ దరఖాస్తు విధానం ఇలా!
    Next Article
    హైదరాబాద్‌లో మారుతి సుజుకి బలెనో ఆన్-రోడ్ ధర ఎంత?

    Related లైఫ్‌స్టైల్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment