Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Shruti Haasan: శృతి హాసన్ ఫ్యామిలీ ఎక్కడ... చెన్నై గృహ ప్రవేశంలో ఎవరూ లేరేందుకు?

    3 hours ago

    Shruti Haasan's New Home in Chennai: చెన్నైలో శృతి హాసన్ కొత్త ఇల్లు కొన్నారు. గృహప్రవేశం చేశారు. అయితే... ఆ పూజలో కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు.

    శృతి హాసన్ (Shruti Haasan) మల్టీ ట్యాలెంటెడ్. కథానాయిక మాత్రమే కాదు... ఆమెలో గాయని, సంగీత దర్శకురాలు కూడా ఉన్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా చిత్రసీమలో అడుగు పెట్టినప్పటికీ... తన నటనతో, ప్రతిభతో సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి చాటు బిడ్డను కాదని చాటి చెప్పారు. ఇప్పుడు తండ్రిని పక్కన పెట్టారా? అని సందేహం కలుగుతోంది. కుటుంబానికి శృతి హాసన్ దూరం అయ్యారా? లేదంటే కుటుంబాన్ని దూరం పెట్టారా? అని చెన్నై వర్గాల్లో చర్చ మొదలైంది. అందుకు కారణం... శృతి హాసన్ కొత్త ఇల్లు. ఆ వివరాల్లోకి వెళితే...

    చెన్నైలో శృతి కొత్త ఇల్లు... గృహ ప్రవేశంలో వారెక్కడ?
    శృతి హాసన్ కొన్నాళ్ళుగా ముంబైలో ఉంటున్నారు. తమిళ్, తెలుగు సినిమాలు చేసినప్పుడు షూటింగ్స్ కోసం చెన్నై, హైదరాబాద్ సిటీల మధ్య చక్కర్లు కొట్టడం ఆమెకు అలవాటు. హైదరాబాద్ సిటీలో ఆమెకు సొంత ఇల్లు ఉంది. చెన్నైలోనూ ఇల్లు ఉన్నట్టు తెలిసింది. తండ్రి కమల్ ఉండేది కూడా చెన్నైలోనే. అయితే తన సొంతూరు చెన్నైలో తనకంటూ ఓ సొంత ఇల్లు కొనుక్కున్నారు శ్రుతి హాసన్. 
    చెన్నైలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ (అపార్ట్మెంట్)లో శృతి హాసన్ ఓ ఫ్లాట్ కొన్నట్టు కోలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆ ఫ్లాట్ గృహప్రవేశం తాజాగా జరిగింది. భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా గృహప్రవేశ పూజ, కార్యక్రమాలు  నిర్వహించారు. విచిత్రం ఏమిటంటే... శృతి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ పూజలో కనిపించలేదు.

    చెన్నైలో కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలను శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె తండ్రి, లెజెండరీ హీరో, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ గానీ, ఆమె చెల్లెలు అక్షర హాసన్ గానీ, ఇతర కుటుంబ సభ్యులు గానీ కనిపించలేదు. శృతి స్నేహితులు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ముంబైలో ఇంటి గృహప్రవేశానికి వాళ్ళు హాజరు కాకపోతే సమస్య ఉండేది కాదు. సొంతూరు చెన్నైలో పూజకు కుటుంబ సభ్యులు గైర్హాజరు కావడం చర్చనీయాశం అయ్యింది. అదీ సంగతి. 
    Shruti Haasan Upcoming Movies: శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే... ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'లో స్పెషల్ సాంగ్ 'హల్లల్లల్లో...'లో సందడి చేశారు. కథానాయికగా చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో 'ట్రైన్', దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార'లో నటిస్తున్నారు. మరో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్లు సమాచారం.

    Click here to Read More
    Previous Article
    Donald Trump On Hormuz: మళ్లీ ఇరాన్ దిగ్బంధం.. హర్మూజ్ బాధ్యత మాదే, 20 శాతం టోల్ విధింపు: డొనాల్డ్ ట్రంప్
    Next Article
    Ram Charan: డాన్సర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రామ్ చరణ్ భారీ విరాళం... ఎంత అమౌంట్ ఇచ్చారంటే?

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment