Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Ayodhya Ram Mandir Donation Theft: అయోధ్య రామాలయం విరాళాల కేసు.. చోరీ ఎలా చేశారో పోలీసులకు వివరించిన నిందితుడు

    1 hour ago

    Ayodhya Ram Mandir విరాళాల చోరీ కేసులో నిందితుడు అవినాష్ శుక్లా విచారణలో తప్పు ఒప్పుకున్నాడు. ట్రస్ట్ నిర్వాహకులతో సాన్నిహిత్యంతో, CCTVలకు చిక్కకుండా డబ్బు దాచి బయటకు తరలించినట్లు తెలిపాడు.

    అయోధ్య: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నిందితులను విచారించిన పోలీసులు వారు చెప్పించి విని షాకవుతున్నారు. ఆయోధ్య ఆలయంలోని విరాళాల లెక్కింపు (కౌంటింగ్) వ్యవస్థలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని, అక్కడ పనిచేసే ఇంటిదొంగలే చాలా సునాయాసంగా సొమ్మును బయటకు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు చోరీ చేసిన డబ్బును ఎవరికీ అనుమానం రాకుండా మొదట ఆలయ ప్రాంగణంలోని వాష్‌రూమ్‌లలో దాచిపెట్టి, ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా బయటకు తీసుకెళ్లేవారని పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు. 

    ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టు అనుమతితో నిందితుల్లో ఒకడైన అవినాష్‌ శుక్లాను మంగళవారం 2 గంటల పాటు విచారించారు. విరాళాల కౌంటింగ్‌ గదికి సంబంధించిన తాళాలను మరో నిందితుడు టిన్నూ యాదవ్‌ సంపాదించాడని, ఆ తర్వాత ఎవరూ లేని సమయం చూసి డబ్బును చోరీ చేశామని శుక్లా అంగీకరించాడు. ఆలయ ప్రాంగణంలో ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, వాటిని ఎవరు పర్యవేక్షిస్తారు అనే విషయాలపై నిందితులకు పూర్తి అవగాహన ఉండటంతో, కెమెరాలకు చిక్కకుండా ఈ దోపిడీకి పాల్పడ్డారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ నిర్వాహకులతో తమకున్న సాన్నిహిత్యం వల్ల తమను ఎవరూ అనుమానించలేదని శుక్లా చెప్పుకొచ్చాడు.
    ఆస్తుల కొనుగోలుపై దర్యాప్తు 
    ఆయోధ్య రామాలయం విరాళాల చోరీ సొమ్ముతో తాను సొంతంగా ఇల్లు, స్థలం కొనుగోలు చేసినట్లు అవినాష్ శుక్లా పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో నిందితుల ఆర్థిక లావాదేవీలతో పాటు వారి పేరిట ఉన్న ఆస్తుల వివరాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణ సమయంలో నిందితులు పలుమార్లు మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా పేరును ప్రస్తావించారు. ఆయన ఇదివరకే తన ట్రస్ట్ సభ్యత్వానికి రాజీనామా చేయడం తెలిసిందే. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఎంతకాలం పాటు ఈ చోరీ ఎలా సాగింది, వీరి వెనుక ఇంకా పెద్దలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

    అప్పటివరకూ అయోధ్యను విడిచి వెళ్లను..  చంపత్ రాయ్ 
    తాను ఈ అపవాదును మూటగట్టుకుని అయోధ్య నుండి వెళ్ళనని తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన సన్నిహితులతో చెప్పారు. కానుకల చోరీ కేసులో వ్యక్తమవుతున్న ప్రశ్నలపై తన అత్యంత సన్నిహితులతో జరిగిన సంభాషణలో చంపత్ రాయ్, "అయోధ్యలో నా సేవ పూర్తయింది, ఆలయం నిర్మితమైంది. కానీ నేను అపవాదును మోస్తూ అయోధ్య నుండి వెళ్ళను" అని అన్నారు. టించు యాదవ్ మోసం చేశాడని, అతడు ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదని అన్నారు. చంపత్ రాయ్ ప్రస్తుతం సిట్ (SIT) తుది నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాతే ఆయన తన వాదనను వినిపించవచ్చని భావిస్తున్నారు.

     తీర్థ క్షేత్ర పురంలో 80 ఏళ్ల  చంపత్ రాయ్ నివసించే గది చాలా సాధారణంగా ఉంటుంది. చంపత్ రాయ్ గదిలో మంచం పక్కన శ్రీరాముడి విగ్రహం ఒకటి ఉంది. ఆరోపణల తర్వాత.. చంపత్ రాయ్ రాముడి విగ్రహం వైపు చూపిస్తూ, "నాకెందుకు ఆందోళన, ఈ ఆరోపణలు ఆయనే వచ్చేలా చేశారు, ఆయనే వీటిని తొలగిస్తారు" అని అన్నారు.

    మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక పెద్ద ప్రకటన చేశారు. కొన్ని రోజుల కిందట ఎవరో తనకు శ్రీరామ మందిరానికి సంబంధించిన కొన్ని వివరాలను అందించారని తెలిపారు. తనకు మొదట నమ్మకం కలగలేదని, అయితే గత కొన్ని రోజులుగా ఆ సమాచారాన్ని ధృవీకరించుకుకోగా, అది నిజమేనని తేలిందని అన్నారు. ఆ సమాచారాన్ని మీ అందరితో పంచుకుంటానని తెలిపారు.

    Click here to Read More
    Previous Article
    Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
    Next Article
    Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment