Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!

    2 hours ago

    Nitin Gadkari on E20 Fuel: విదేశీ చమురుపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం E20 పెట్రోల్‌ను ప్రోత్సహిస్తోందని గడ్కరీ వివరించారు. ఏటా విదేశాల నుంచి భారీగా ముడి చమురు కొనుగోలు చేస్తుందన్నారు. 

    Nitin Gadkari on E20 Fuel: దేశంలో E20 పెట్రోల్ గురించి చాలా చర్చ జరుగుతోంది. ఈ పెట్రోల్ వాడకం వల్ల వాహన మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్‌కు కూడా పాడవుతుందని చాలా మంది సోషల్ మీడియాలో, వివిధ వేదికలపై మాట్లాడుతున్నారు. తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల మధ్య, E20 పెట్రోల్‌కు సంబంధించిన అటువంటి వాదనలను సమర్థించేందుకు ఇప్పటివరకు ఎటువంటి పక్కా ఆధారాలు లభించలేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టంగా పేర్కొన్నారు. ప్రూఫ్‌లు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని ఆయన అన్నారు.

    నితిన్ గడ్కారికి ఓపెన్ ఛాలెంజ్‌ 

    E20 పెట్రోల్ వాడకం వల్ల ఎవరిదైనా కారు ఇంజన్ దెబ్బతింటే, వారు వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని నితిన్ గడ్కరీ అన్నారు. అటువంటి సందర్భాలలో, కారు యజమాని తనతోపాటు తన డీలర్‌కు కూడా ఫిర్యాదు  చేస్తామని ఆయన చెప్పారు. E20 పెట్రోల్ ఇంజన్‌ను దెబ్బతీస్తుందని నిరూపించే ఒక్క కేసు కూడా తనకు ఇప్పటివరకు అందలేదని గడ్కరీ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ ఇంధనం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని,  డబ్బు చెల్లించి ప్రచారాలు నిర్వహిస్తున్నారని కూడా నితిన్ గడ్కరీ తెలిపారు.

    సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ శక్తి సామర్థ్యం కొద్దిగా తక్కువగా ఉంటుందని కూడా ఆయన అంగీకరించారు. అందువల్ల, కొన్ని వాహనాల మైలేజీలో స్వల్ప తగ్గుదల ఉండవచ్చు. అయితే, దీనివల్ల ఇంజిన్ దెబ్బతింటుందని దీని అర్థం కాదు. మైలేజీలో స్వల్ప తగ్గుదల, ఇంజిన్ దెబ్బతినడం అనేవి రెండు వేర్వేరు విషయాలని ఆయన అన్నారు. ప్రజలు ఈ రెండింటినీ ఒకేలా భావించకూడదు.

    నితిన్ గడ్కరీ ఏం చెప్పారు?

    విదేశీ చమురుపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం E20 పెట్రోల్‌ను ప్రోత్సహిస్తోందని గడ్కరీ వివరించారు. భారత్‌ ప్రతి సంవత్సరం విదేశాల నుంచి భారీ పరిమాణంలో ముడి చమురును కొనుగోలు చేస్తుంది, దీనికి చాలా ఖర్చవుతుంది. పెట్రోల్‌లో ఇథనాల్ పరిమాణాన్ని పెంచడం వల్ల చమురు దిగుమతులు తగ్గుతాయి.

    ఇథనాల్ వల్ల రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని గడ్కరీ అన్నారు. చెరకు, మొక్కజొన్న, ఇతర వ్యవసాయ పంటల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తారు. దీనికి పెరుగుతున్న డిమాండ్ రైతుల పంట వినియోగాన్ని పెంచుతుంది.  వారికి మెరుగైన ఆదాయం సంపాదించే అవకాశాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ఇథనాల్ కలిపిన ఇంధనం కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, అందువల్ల ఇది పర్యావరణానికి మేలైనదిగా చెబుతున్నారు. 

    ఇటీవలి రోజుల్లో E20 పెట్రోల్ చుట్టూ రాజకీయ ఆరోపణలు తీవ్రమైంది. ఇది కారు డ్రైవర్లకు హాని కలిగించవచ్చని కొంతమంది రాజకీయ నాయకులు అంటుండగా, E20 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన వాహనాలకు ఇది పూర్తిగా సురక్షితమని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ఇంధనాన్ని అమలులోకి తీసుకురావడానికి ముందు పలు స్థాయిలలో పరీక్షలు జరిపినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. 

    Click here to Read More
    Previous Article
    Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
    Next Article
    Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment