Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!

    2 hours ago

    Tirupati Crime News:తిరుపతిలో డబల్ మర్డర్ కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ఒకరు మునిరత్నం రెడ్డి,  మరొకరు మణికంఠగా గుర్తించారు. పెళ్లి విషయంలో జరిగిన వివాదం కారణంగానే ఈ హత్యలు జరిగినట్టు అనుమానిస్తున్నారు. 

    Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాల సమీపంలో జరిగిన జంట హత్యలు సంచలనంగా మారాయి. కాసేపట్లో జరగాల్సిన పెళ్లి బంధువులు సిద్ధమవుతున్న టైంలో ఇద్దరి మర్డర్ అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేసింది. ఈ దుర్ఘటనలో స్పాట్‌లోనే ఒక వ్యక్తి మృతి చెందగా, ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరో వ్యక్తి చనిపోయాడు. అయితే పెళ్లి విషయంలో నెలకొన్న వివాదం కారణంగానే ఈ హత్యలు జరిగినట్టు సమాచారం.   

    జంట హత్యల్లో చనిపోయినవారిలో ఒకరు జీవకోనకు చెందిన మునిరత్నం రెడ్డి. ఇతను స్పాట్‌లోనే మృతి చెందాడు. మరొకరు సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన మణికంఠ. ఇతను కొనఊపిరితో ఉన్నాడని రుయా ఆసుపత్రికి తరలించే క్రమం లో మృతి చెందాడు. పద్మావతి కళ్యాణ మండపాల రోడ్లు రక్తసిక్తమయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఈస్ట్ డిఎస్పి భక్తవత్సలం సిఐ శ్రీనివాసులు, వెస్ట్ సిఐ రామకృష్ణ సిబ్బందితో చేరుకొని విచారణ చేపట్టారు. 

    నిందితుల ఆచూకీ కోసం సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు బైక్ వచ్చి విచక్షణ లేకుండా కత్తులతో దాడి చేసి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి తీసిన వీడియో వైరల్ అవుతుంది. జంట హత్యల్లో నిందితులు ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. 

    తిరుమల్లో పనిచేసే సంపూర్ణమ్మ ఆమె కుమార్తెను సునీల్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపింది. కొద్ది నెలల నుంచి వీళ్లద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి వివాహానికి అల్లుడు సునీల్ వస్తున్నట్లు సంపూర్ణమ్మ తెలిసింది. తన కుమార్తెకు దగ్గరుండి పెళ్లి చేసిన మునిరత్నం, మణికంఠకు సమాచారం ఇచ్చిన సంపూర్ణమ్మ.

    విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన మునిరత్నం, మణికంఠ పెళ్లి మండపంలో సునీల్‌తో మాట్లాడారు. భార్యను వదిలేసి తిరుగుతుండటంపై వాగ్వాదం జరిగింది. ఇంతలో అక్కడకు సునీల్‌కు అండగా ఆయన తరఫు బంధువులు వచ్చారు. వివాదం తీవ్రం కావడంతో విచక్షణ కోల్పోయిన సునీల్  తన బంధువులతో కలిసి మునిరత్నం, మణికంఠపై కత్తులతో దాడి చేశాడు. 

    సునీల్ దాడిలో తీవ్రంగా గాయపడిన మునిరత్నం స్పాట్‌లోనే చనిపోగా, ఆసుపత్రికి వెళ్తూ మణికంఠ మృతి చెందాడు. ఘటన జరిగిన తర్వాత అక్కడి నుంచి సునీల్, అతని బంధువులు పారిపోయారు. విషయం తెలుసుకొని అక్కడకు వచ్చిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి వెంటనే బ్లాక్ చేశారు. వారంతా తిరుపతి దాటకుండానే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. 

    Click here to Read More
    Previous Article
    Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment