Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Nagarjuna: వాయిదాలు ఎందుకు? టాలీవుడ్‌లో తప్పుల్ని బయటపెట్టిన నాగార్జున

    8 hours ago

    Nagarjuna On Post Production Delays: 'లెనిన్' గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌లో టాలీవుడ్‌లో తప్పుల్ని కింగ్ నాగార్జున అక్కినేని బయట పెట్టారు. హాలీవుడ్ సినిమా 'ది ఒడిస్సీ'ని పేర్కొంటూ అలా చేయాలని చెప్పారు.

    టాలీవుడ్‌లో వాయిదాలు సహజం. రాజమౌళి 'బాహుబలి' సైతం చెప్పిన తేదీకి విడుదల కాలేదు. ఆ సినిమాకు ముందు, ఆఖరికి జూలై బ్లాక్ బస్టర్ 'లెనిన్' వరకు... వాయిదాలు పడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ పద్ధతి సరైనదని కాదని కింగ్ అక్కినేని నాగార్జున చెప్పారు. 'లెనిన్' బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌లో ఆయన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతున్నాయని, అది తప్పు అని చెప్పారు. ఈ ధోరణి సరైనదని కాదన్నారు. హాలీవుడ్ సినిమా 'ది ఒడిస్సీ' విడుదల తేదీని పేర్కొంటూ... అలా చేయాలని చెప్పారు.

    ముందు రోజు రాత్రి వరకు తప్పదా?
    ఏడాది ముందు 'ది ఒడిస్సీ' విడుదల తేదీ!
    సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత కూడా ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, సౌండ్ మిక్సింగ్, వీఎఫ్ఎక్స్ పనులు కొన్నిసార్లు మొదటి ఆట ప్రదర్శించడానికి ముందు రోజు రాత్రి వరకూ కొనసాగుతున్నాయని నాగార్జున తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ డిలే కావడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

    క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ఒడిస్సీ' (The Odyssey) విడుదల తేదీని ఏడాది ముందు ప్రకటించారని, ఎటువంటి వాయిదాలు లేకుండా చెప్పిన తేదీకి సినిమాను విడుదల చేశారని నాగార్జున గుర్తు చేశారు. హాలీవుడ్ సినిమాలను అంత పక్కాగా ప్రణాళిక ప్రకారం విడుదల చేస్తున్నప్పుడు... మన తెలుగు చిత్ర పరిశ్రమలో అలా ఎందుకు చేయలేకపోతున్నామని ఆయన ప్రశ్నించారు. తాను ఎవరినో నిందించడం లేదని, తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కించిన 'లెనిన్' విడుదలను సైతం రెండు వారాలు వాయిదా వేశామని ఆయన పేర్కొన్నారు.

    నెల రోజుల ముందు 'అన్నమయ్య' రెడీ!
    'నిన్నే పెళ్లాడతా', 'అన్నమయ్య' సినిమాలను విడుదల చేయడానికి నెల ముందే ఫైనల్ కాపీ రెడీ చేశామని, థియేటర్లలో సినిమాను ప్రదర్శించడానికి నెల ముందు తాను సినిమా చూశానని నాగార్జున తెలిపారు. ఇప్పుడు షూటింగ్ పూర్తి అయినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకుంటున్నామని... అది సరికాదని నాగార్జున స్పష్టం చేశారు. ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్ వంటి పనులు త్వరగా పూర్తి చేసి ఫైనల్ కాపీ రెడీ చేయడం వల్ల సినిమా క్వాలిటీ పెరుగుతుందని నాగార్జున పేర్కొన్నారు. రెండు వారాల ముందు ఫైనల్ కాపీ రెడీ చేసి ఇస్తే... డీఐ, వీఎఫ్ఎక్స్ పనులను మరింత బాగా చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు నాగార్జున.

    Click here to Read More
    Previous Article
    Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
    Next Article
    Rajamouli Reaction : రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment