Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌

    5 hours ago

    Panchadarla Land Issue: పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ నివేదిక ఆధారంగా అనకాపల్లి మైనింగ్ ఏడీ మజ్జి శ్రీనివాస్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    Panchadarla Land Issue: అనకాపల్లిలోని పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌ సంచలనంగా మారింది. రాజకీయ దుమారం రేపిన ఈ వివాదంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో అధికారులపై చర్యలు తీసుకుంది. ఇప్పటికే దీన్ని నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటించాలని పవన్ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు.

    అనకాపల్లి జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక నిలయమైన పంచదార్ల కొండపై సాగుతున్న అక్రమ గ్రావెల్, మట్టి తవ్వకాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పర్యావరణ పరిరక్షణ, పురాతన ఆలయ సంరక్షణ విషయంలో రాజీపడేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. విచారణ నివేదికల ఆధారంగా అనకాపల్లి మైనింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మజ్జి శ్రీనివాస్‌ను విధుల నుంచి తక్షణమే తొలగిస్తూ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన స్థానంలో అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ పురుషోత్తమ్‌కు ఏడీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

    పంచదార్ల కొండపై అక్రమ క్వారీయింగ్‌, పరిమితికి మించిన గ్రావెల్ తవ్వాకలపై జిల్లా యంత్రాంగం, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సమగ్ర విచారణ చేపట్టాయి. ఈ తనిఖీ నివేదికల్లో మైనింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం అక్రమాలకు సహకరించిన ఆధారాలు స్పష్టంగా బయటపడ్డాయి. లభించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా మైనింగ్ శాఖలోని బాధ్యతారాహిత్యంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. మజ్జి శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అక్రమ తవ్వకాలను అరికట్టడంలో విఫలమైనందకు ఈ చర్యలు తీసుకున్నారు. ఏడీగా కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే పురుషోత్తమ్‌ జిల్లాలోని అన్ని క్వారీల అనుమతులు, నిర్వహణపై సమగ్ర సమీక్ష జరిపి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

    గతంలోనే డిప్యూటీ సీఎం ఆగ్రహం 

    పంచదార్ల వివాదం వెలుగులోకి రాగానే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌, ఏపీపీసీబీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, మైనింగ్ లీజు పొందిన సంస్థ చేసిన ఉల్లంఘనలపై నివేదిక కోరారు. ఈ సందర్భంగా పవన్ స్పందిస్తూ, పర్యావరణ నిబంధనలను ధిక్కరించి తవ్వకాలు జరిపిన సదరు మైనింగ్ సంస్థ లైసెన్స్‌ తక్షణమే రద్దు చేయాలని ఆదేశించారు. ప్రకృతికి, కొండ స్వభావానికి నష్టం కలిగించినందుకు చట్టప్రకారం జభారీ జరిమానా విధించాలని స్పష్టం చేశారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా తవ్వకాల  వల్ల జరిగిన పర్యావరణ నష్టాన్ని పునరుద్ధరించే పూర్తి వ్యయాన్ని మైనింగ్ సంస్థ నుంచే వసూలు చేయాలని ఆదేశించారు.

    Click here to Read More
    Previous Article
    PM Modi Video: "భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
    Next Article
    Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment