Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    NTR Dragon Update : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?

    2 hours ago

    Dragon Updates : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

    NTR Prashanth Neel Dragon Project Shooting Update : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతోన్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్. యూవత్ సినీ ప్రపంచం ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

    ఈ మూవీలో ఓ కీలకపాత్ర కోసం బాలీవుడ్ స్టార్ మనోజ్ భాజ్‌పేయిని చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. సినిమాకే ఈ రోల్ కీలకం అని తెలుస్తుండగా... ఆయన ఓకే చెబితే నెక్స్స్ షెడ్యూల్‌లోనే ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే భారీ యాక్షన్ పార్ట్స్ కంప్లీట్ కాగా ఈ నెలలో శ్రీలంకలో కీలక సీన్స్ చిత్రీకరించారు. ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

    యురోపియన్ తరహా సెట్‌లో ఓ కీలక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌తో పాటు ఇతర నటులపై హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారట. ఫస్ట్ గ్లింప్స్‌తోనే మూవీలో యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవల్ అని అర్థమవుతోంది. ఎన్టీఆర్‌ను ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలని అనుకుంటున్నారో అలానే చూపించేలా నీల్ ప్లాన్ చేశారు. లుక్స్, స్టైల్, ఫస్ట్ గ్లింప్స్ అన్నీ భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. 

    పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతోన్న డ్రాగన్‌లో ఎన్టీఆర్ ల్యూగర్ (Luger) పాత్రలో నటిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్‌పై ఇదివరకు ఎప్పుడూ చూడని ఓ సరికొత్త ప్రపంచాన్నే ఇందులో చూపించనున్నట్లు గ్లింప్స్ కన్ఫర్మ్ చేసింది. కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లో బ్లడ్ బాత్ ఎన్టీఆర్ మాస్ విశ్వరూపాన్నే చూపించారు. ఓపియమ్ అనే డ్రగ్ కోసం సాగే వార్, అండర్ వరల్డ్ మాఫియా సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్‌గా ఈ స్టోరీ సాగనున్నట్లు తెలుస్తోంది.

    ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే, అనిల్ కపూర్, బిజు మీనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా... ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలపై కల్యాణ్ రామ్, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 11న సినిమా వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

    Click here to Read More
    Previous Article
    This Week Theatrical Releases : శ్రీనివాస మంగాపురం To హాలీవుడ్ అవెయిటెడ్ విజువల్ వండర్ - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్
    Next Article
    Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment