Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?

    2 hours ago

    Bigg Boss Thanuja Puttaswamy: 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9తో పాపులరైన కన్నడ అమ్మాయి, సీనియర్ నటి తనూజ పుట్టస్వామి. తనపై వస్తున్న ట్రోల్స్ విషయంలో గట్టిగా ఇచ్చిపడేసింది.

    'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో సీజన్ 9 ద్వారా పాపులరైన కన్నడ నటి, సీరియల్ ఆర్టిస్ట్ తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy). ఇటీవల కాలంలో తన మీద సోషల్ మీడియాలో ఎక్కువైన విమర్శలు, ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించారు. 'బిగ్ బాస్ 9'లో తనూజ రన్నరప్‌గా నిలిచి సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు టీవీ షోలు, కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా తనూజ క్యారెక్టర్‌ను బ్యాడ్ చేసేలా కామెంట్లు వస్తున్నాయి. వాటిపై ఆవిడ మౌనం వీడారు. ట్రోలర్లకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

    మేమంతా బాగున్నాం... కానీ మీరే!
    తనూజాకు వ్యతిరేకంగా 'ముద్ద మందారం' (MM) టీమ్ సభ్యులు చాలా కుట్రలు పన్నారని... కళ్యాణ్ పడాల వచ్చిన తర్వాత పవన్ సాయిని ఆమె పూర్తిగా దూరం పెట్టారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. వాటిపై స్పందిస్తూ... ''బిగ్ బాస్ షో ముగిసి ఏడు నెలలు దాటినప్పటికీ ఇంకా దాని గురించే మాట్లాడుకోవడం విడ్డూరంగా ఉంది. షోలో పోటీ, గొడవలు ఉండవచ్చు, కానీ బయటకు వచ్చాక మేమంతా బాగున్నాం. ఒకరి సంతోషాలను, బాధలను మరొకరం పంచుకుంటున్నాం. మాకు లేని బాధ మీకెందుకు?" అని తనూజ సూటిగా ప్రశ్నించారు.
    కళ్యాణ్ పడాలకు ఒకానొక సమయంలో సమస్య ఎదురైతే... ఆ విషయంలో తనూజ పుట్టసామి సహాయం చేశారు. ఆ విషయం గురించి కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. ''ఆ సమయంలో కళ్యాణ్ కు సహాయం చేయడానికి నేను పవన్ సాయి (PS)కే ఫోన్ చేశా. పవన్ సాయి కూడా ఎంతో చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించడంలో చాలా సాయం చేశారు'' అని తనూజ తెలిపారు. తన కుటుంబానికి కళ్యాణ్ పడాల బాగా తెలుసు అని, తమ మధ్య మంచి బాండింగ్ ఉందని స్పష్టం చేశారామె. పవన్ సాయి, హరితమ్మ వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారని... వాళ్ళను అనవసరంగా వివాదాల్లోకి లాగవద్దని తనూజ రిక్వెస్ట్ చేశారు.
    నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళకు పనీ పాట లేదని... ఖాళీగా ఉంటే ఆశ్రమానికి వెళ్లి మెడిటేషన్ చేసుకోవాలని తనూజ ఎద్దేవా చేశారు. అభిమానులకు ఓ విన్నపం చేశారు. ''సోషల్ మీడియాలో నా మీద వచ్చే నెగిటివ్ పోస్ట్‌లను నాకు పంపించవద్దు. అవి చూసి నేను డిస్టర్బ్ అవుతాను'' అని అభిమానులకు తనూజ చెప్పారు. ప్రతి ఒక్కరినీ గౌరవించాలని, వ్యక్తులపై ద్వేషాన్ని పెంచకుండా ప్రశాంతంగా జీవించాలని చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత సంబంధాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ట్రోలర్లపై తనూజ ఫైర్ అయ్యారు.

     

    Click here to Read More
    Previous Article
    Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్!
    Next Article
    Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment