Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్!

    2 hours ago

    Jana Nayakudu Box Office Collection Day 2: బాక్సాఫీస్ బరిలో 'జన నాయకుడు' ఎదురీదుతోంది. రెండో రోజు సినిమా కలెక్షన్స్ భారీగా తగ్గాయి. మొదటి రోజుతో కంపేర్ చేస్తే డ్రాప్ కనిపించింది.

    Thalapathy Vijay Jana Nayakudu Two Days Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి, అభిమానుల దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'జన నాయకన్'. బాక్సాఫీస్ బరిలో మొదటి రోజు అద్భుతమైన వసూళ్ళు సొంతం చేసుకుంది. రెండో రోజు వసూళ్ళ వేటలో ఎదురీదింది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా రెండు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? రెండో రోజు కలెక్షన్స్ ఎంత? అనేది చూస్తే...

    'జన నాయకుడు' రెండు రోజుల కలెక్షన్లు!
    'జన నాయకన్'ను తెలుగులో 'జన నాయకుడు'గా విడుదల చేశారు. హిందీలో 'జన నేత' పేరుతో విడుదలైంది. బాక్స్ ఆఫీస్ బరిలో ఈ సినిమా రెండో రోజు ఢమాల్ అన్నది. కలెక్షన్స్ రాబట్టడంలో, జనాలను థియేటర్లకు రప్పించడంలో ఫెయిల్ అయ్యింది. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే...

    • 'జన నాయకుడు'కు రెండో రోజు ఇండియాలో రూ. 21.15 కోట్ల నెట్ వచ్చింది. ఫస్ట్ డే నెట్ కలెక్షన్లు (రూ. 42.70 కోట్లు)తో కంపేర్ చేస్తే... 50.50 శాతం తగ్గాయి.
    • రెండు రోజుల్లో ఇండియాలో 'జన నాయకుడు' నెట్ కలెక్షన్లు రూ. 63.85 కోట్లు. గ్రాస్ విషయానికి వస్తే... రూ. 75 కోట్లు.
    • ఓవర్సీస్ మార్కెట్ కలెక్షన్స్ చూస్తే... రెండు రోజు రూ. 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో రెండు రోజుల 'జన నాయకుడు' ఓవర్సీస్ గ్రాస్ రూ. 37.50 కోట్లకు చేరింది.
    • ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో 'జన నాయకుడు' రూ. 112.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

    తెలుగులో కలెక్షన్స్ ఎలా ఉన్నాయ్?
    'జన నాయకుడు'కు రెండో రోజు తమిళ వెర్షన్ నుంచి అత్యధికంగా రూ. 17.95 కోట్లు వచ్చాయి. హిందీ వెర్షన్ కేవలం రూ. 1.85 కోట్లు కలెక్ట్ చేయగా... తెలుగు వెర్షన్ రూ. 1.35 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. మొదటి రోజు తెలుగులో రూ. 2.75 కోట్ల నెట్ వచ్చింది. రెండో రోజు తెలుగులోనూ వసూళ్ళు భారీగా తగ్గాయి.

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాల్లో రెండో రోజు 'జన నాయకుడు'కు రూ. 2 కోట్ల గ్రాస్ వచ్చింది. హైదరాబాద్‌లో 22.5, విశాఖలో 29.5, గుంటూరులో ఎవరూ ఊహించని విధంగా 47.5 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తమిళంలో ఈవెనింగ్, సెకండ్ షోలకు 60.31 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఫ్లాప్ టాక్ వచ్చినా సరే... తమిళంలో మంచి కలెక్షన్స్ నమోదు చేస్తోంది.

    Click here to Read More
    Previous Article
    Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ డే కలెక్షన్లు... కిరణ్ అబ్బవరం సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
    Next Article
    Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment