Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

    2 hours ago

    AP TET 2026 Hall Tickets Download: ఆంధ్రప్రదేశ్‌ టెట్ హాల్‌టికెట్స్‌ను విద్యాశాఖ https://tet2dsc.apcfss.in వెబ్‌సైట్‌లో పెట్టారు. అభ్యర్థులు తమ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

    AP TET 2026 Hall Tickets Download: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న టెట్‌ 2026కు సంబంధించిన హాల్‌టికెట్స్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. గత నెలలో నోటిఫికేషన్ విడుదలైంది. నెలరోజుల పాటు అప్లికేషన్స్‌ను ఆహ్వానించారు. ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి హాల్‌టికెట్స్‌ను ఇవాల్టి నుంచి జారీ చేస్తున్నారు. అభ్యర్థులు తమ ఐడీ, పాస్‌వర్డ్‌ను యూజ్ చేసి హాల్‌టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

    ఏపీ టెట్‌ 2026 కోసం మొత్తం 2, 13, 520 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మొత్తంగా 2, 37, 165 దరఖాస్తులు వచ్చినట్టు కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ నెల 15 నుంచి మాక్‌టెస్టులు కూడా వెబ్‌సైట్‌లో ఉంచారు. ఇప్పుడు హాల్‌టికెట్స్ కూడా అర్థరాత్రి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు.  

    ఆగస్టు 5వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, బరంపురం లాంటి ప్రాంతాల్లో కూడా సెంటర్‌లు ఇచ్చారు. రోజూ రెండు పూటల రెండు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. 

    ఏపి టెట్‌ హాల్‌టికెట్లు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

    ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో ఏపీ టెట్ 2026 హాల్‌టికెట్స్‌ ఉంచారు. వీటిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్‌ ఫాలో అవ్వాలి 

    • ముందుగా అధికారిక http://cse.ap.gov.in⁠, http://tet2dsc.apcfss.in⁠ వెబ్‌సైట్ల ఒకదాంట్లో లాగిన్ అవ్వాలి. 
    • అందులో క్యాండిడేట్‌ లాగిన్ అనే విభాగంపై క్లిక్ చేయాలి 
    • వెంటనే యూజర్‌ నేమ్‌ అడుగుతుంది. 
    • యూజర్‌ నేమ్‌ అడిన ప్రాంతంలో గతంలో అప్లై చేసినప్పుడు వచ్చిన ఐడీ ఎంటర్ చేయాలి. 
    • యూజర్‌ నేమ్‌ టీడీతో ప్రారంభమవుతుంది. 
    • తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఇచ్చిన పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. 
    • అనంతరం అక్కడే ఇచ్చిన ఆరు అంకెల క్యాప్చా కోడ్‌ను కూడా పక్కనే ఇచ్చిన బాక్స్‌లో ఎంటర్ చేయాలి. 
    • లాగిన్ అనే బటన్‌పై ప్రెస్‌ చేయాలి. 
    • వెంటనే మీ ప్రొఫైల్‌కు వెళ్తుంది. 
    • ప్రొఫైల్‌లో ఎడమ చేతివైపు  Services అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. 
    • అందులో హాల్‌టికెట్స్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. 
    • వెంటనే పక్కనే హాల్‌టికెట్‌ బాక్స్ కనిపిస్తుంది. 
    • హాల్‌టికెట్స్ బాక్స్‌లో డౌన్‌లోడ్ సింబల్‌తో టెక్స్ట్‌ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. 
    • అలా క్లిక్ చేస్తే మీ హాల్‌టికెట్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. 
    • హాల్‌టికెట్ పక్కనే డౌన్‌లోడ్‌, ప్రింట్‌, సేవ్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
    • మీరు డౌన్‌లోడ్ చేసుకొన్న తర్వాత ప్రింట్ చేసుకుంటే మీ హాల్‌టికెట్ మీ చేతిలోకి వస్తుంది. 
    Click here to Read More
    Previous Article
    HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
    Next Article
    Modi video: "స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి

    Related జాబ్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment