Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    This Week Theatrical Releases : శ్రీనివాస మంగాపురం To హాలీవుడ్ అవెయిటెడ్ విజువల్ వండర్ - ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే మూవీస్

    2 hours ago

    This Week Movies : ఘట్టమనేని వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురంతో పాటు హారర్ థ్రిల్లర్ ఈ వారం థియేటర్లలోకి రానున్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...

    This Week Theatrical Releases Complete List : గత వారం జన నాయగన్, చెన్నై లవ్ స్టోరీ వంటి మూవీస్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా... మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ వారం కూడా యంగ్ హీరోస్ మూవీస్ థియేటర్లలోకి రానున్నాయి. జులై 27 నుంచి ఆగస్ట్ 1 వరకూ థియేటర్లలో రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...

    శ్రీనివాస మంగాపురం : ఘట్టమనేని వారసుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ శ్రీనివాస మంగాపురం. RX100, మంగళవారం మూవీస్ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహించగా... రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్‌గా నటించారు. మోహన్ బాబు, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. లెజెండరీ నిర్మాత అశ్వనీదత్ సమర్పణలో జెమినీ కిరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జులై 30న వరల్డ్ వైడ్ మూవీ రిలీజ్ కానుంది.

    418 : స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతోన్న అవెయిటెడ్ హారర్ థ్రిల్లర్ 418. ఈ మూవీకి కీర్తన్ గౌడ దర్శకత్వం వహిస్తుండగా... సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ ప్రధాన పాత్రల్లో నటించారు. జులై 31న వరల్డ్ వైడ్ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    న్యూటన్స్ థర్డ్ లా : సుమంత్, జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ న్యూటన్స్ థర్డ్ లా (Newtons Third Law). రాజేశ్ కర్ణ దర్శకత్వం వహిస్తుండగా... ఈటీవీ విన్ సహకారంతో కె హరీశ్ నిర్మిస్తున్నారు. సింజిత్ ఎర్రమిల్లి మ్యూజిక్ అందిస్తుండగా... జులై 31న సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.

    మా రాముడు అందరివాడు : శ్రీరామ్, స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మా రాముడు అందరివాడు. యద్దనపూడి మైఖేల్ దర్శకత్వం వహించగా... సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జులై 30న (గురువారం) సినిమా థియేటర్లలోకి రానుంది.

    స్పైడర్ మ్యాన్ - బ్రాండ్ న్యూ డే : మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి టామ్ హాలండ్ నటిస్తోన్న నాల్గో సోలో మూవీ 'స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే'. డెస్టిన్ డేనియల్ క్రెటిన్ దర్శకత్వం వహిస్తుండగా... జెండయా, సాడీ సింక్, జాకబ్ బటలోన్, మార్క్ రఫాలో తదితరులు కీలకపాత్రలు పోషించారు. వరల్డ్ వైడ్ జులై 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

     
    STORIES YOU MAY LIKE
    Click here to Read More
    Previous Article
    Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
    Next Article
    NTR Dragon Update : ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో బాలీవుడ్ స్టార్? - యాక్షన్ సీక్వెన్స్‌పై క్రేజీ అప్డేట్ ఏంటంటే?

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment