Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Risks of Vaping : వేపింగ్ చేయడం సురక్షితమేనా? ఈ-సిగరెట్ వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు ఇవే

    2 weeks ago

    Dangers of Vaping : వేపింగ్ చేయడం ఈ మధ్య ఓ ట్రెండ్​గా మారింది. అయితే ఈ-సిగరెట్ కాల్చడం వల్ల శరీరానికి తీవ్ర నష్టాల కలుగుతాయని చెప్తున్నారు నిపుణులు. 

    Hidden Dangers of Vaping : నేడు యువతలో వేపింగ్ ఒక ట్రెండ్‌గా మారింది. తాజాగా ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో రియాన్ పరాగ్ కూడా వేపింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. చాలామంది ఈ వేపింగ్ తక్కువ హాని చేస్తుందని.. చూసేందుకు కూల్​గా కనిపిస్తుందని భావిస్తారు. కానీ ఇది శరీరానికి తీవ్రమైన హాని చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    వేపింగ్ అంటే ఏమిటి?

     

    ఈ-సిగరెట్టు అనేది బ్యాటరీతో నడిచే పరికరం. దీనిలో లిక్విడ్ (ఈ-జూస్)ను ఆవిరి రూపంలో పీలుస్తారు. ఈ లిక్విడ్‌లో నికోటిన్, ప్రొపిలీన్ గ్లైకాల్, వెజిటబుల్ గ్లిసరిన్, రకరకాల సువాసన కలిగిన కెమికల్స్ ఉంటాయి. ఈ వేపింగ్ చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

    ఊపిరితిత్తులకు తీవ్రమైన నష్టం

    వేపింగ్ వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా నష్టపోతాయి. EVALI (E-cigarette or Vaping Product Use-Associated Lung Injury) అనే తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి వాపింగ్ వల్ల వస్తుంది. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి కలుగుతాయి. లంగ్స్​ లోపల సూక్ష్మ రసాయన కణాలు చేరి శాశ్వత నష్టం కలిగిస్తాయి. దీర్ఘకాలంలో క్రానిక్ బ్రాంకైటిస్, ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది. 

    గుండె సమస్యలు

    ఈ-సిగరెట్లోని నికోటిన్ గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. రక్తపోటు పెంచుతుంది. రక్తనాళాలు దెబ్బతిని గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. యువతలో గుండె సమస్యలు పెరగడానికి ఇది కూడా ఓ రీజన్ అని పరిశోధనలు చెబుతున్నాయి. 

    మెదడుపై సైడ్ ఎఫెక్ట్స్

    నికోటిన్ మెదడు అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. గుర్తుపట్టే శక్తిని తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చిరాకు, అస్థిరత, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. 

    నోరు, గొంతుకు నష్టం

    వేపింగ్ చేయడం వల్ల నోటి చిగుళ్లు దెబ్బతింటాయి. గొంతు పొడిబారుతుంది. గొంతు నొప్పి వస్తుంది. నోటి క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పళ్లు పసుపు పచ్చగా మారతాయి. 

    వ్యసనం 

    ఈ-సిగరెట్టులో నికోటిన్ సాధారణ సిగరెట్టుతో సమానంగా లేదా కొన్నిసార్లు అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మొదలుపెడితే మానడం చాలా కష్టం. మానాలని అనిపించినా అంత తొందరగా మానలేరు. 

    చర్మానికి నష్టం

    వేపింగ్ వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. చర్మం పొడిబారి ముందే ముడతలు వస్తాయి. మెరుపు తగ్గి.. వృద్ధాప్య ఛాయలు పెరుగుతాయి. 

    రోగనిరోధక శక్తి

    వేపింగ్ వల్ల శరీరంలోని వైట్ బ్లడ్ సెల్స్ దెబ్బతింటాయి. జలుబు, ఫ్లూ కూడా తరచుగా వస్తాయి. ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది.

    ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి.. భారత ప్రభుత్వం 2019లోనే ఈ-సిగరెట్టు తయారీ.. అమ్మడం.. కొనగోలును పూర్తిగా నిషేధించింది. ఇంత కఠినమైన నిషేధం ఉందంటేనే దీని ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనిని మానేయాలంటే నికోటిన్ రిప్లేస్‌మెంట్ థెరపీ లేదా కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. 

     

     

    గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

    Click here to Read More
    Previous Article
    ECHS Visakhapatnam Recruitment 2026 – 5 Contractual Employees Posts
    Next Article
    Grow Coriander in Water : 15 రోజుల్లోనే కొత్తిమీరను పెంచవచ్చు తెలుసా? మట్టి లేకున్నా.. నీటిలోనే పెంచేయండిలా

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment