Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Tamil Nadu Election Results 2026: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో కొలత్తూరులో స్టాలిన్‌కు షాక్! డీఎంకే కోటను బ్రేక్ చేసిన విజయ్‌ టీవీకే!

    1 week ago

    తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పెను సంచలనం నమోదు అవుతోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన కంచుకోట కొలత్తూరులో వెనుకంజలో ఉన్నారు. నటుడు విజయ్ పార్టీ తమిళనాట ప్రభంజనం సృష్టిస్తోంది. 

    Tamil Nadu Election Results 2026: తమిళనాడు రాజకీయాల్లో నవశకం ఆరంభమైంది. దశాబ్దాల కాలంగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించారు విజయ్. థళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాల దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలో వెనుకంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

    కొలత్తూరులో జైంట్‌ కిల్లర్‌- స్టాలిన్‌  వెనుకంజ 

     

    తమిళనాడు రాజకీయాల్లో అత్యంత సురక్షితమైన సీటుగా భావించే కొలత్తూరు నియోజకవర్గంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రస్తుతం తన సమీప ప్రత్యర్థి, టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు చేతిలో వెనుకంజలో ఉన్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం 1200 ఓట్లకుపైగా తేడాతో వీఎస్‌ బాబు ముందంజలో ఉన్నారు. స్టాలిన్ రెండోస్థానంలో కొనసాతున్నారు. 

    కొలత్తూరు నియోజకవర్గం 2011 నుంచి స్టాలిన్‌కు కంచుకోటగా ఉంది. 2021 ఎన్నికల్లో ఆయన ఇక్కడ 70వేలకుపై ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈసారి టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు జైంట్ కిల్లర్‌గా మారారు. ఇక్కడ ఏఐఏడీఎంకే అభ్యర్థి ఆర్ సంతానకృష్ణన్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. 

    విజయ్ టీవీకే ప్రభంజనం

    నటుడు విజయ్ స్థాపించిన తిమిళగ వెట్రి కళగం తన తొలి ఎన్నికల్లో అద్భుతమైన ప్రతిభ చూపారు. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాలకుగాను, టీవీకే ప్రస్తుతం 85 స్థానాల్లో ముందంజలో ఉంది. విజయ్ స్వయంగా పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు, తిరుచ్చి(ఈస్ట్), పెరంబూర్‌ రెండింటిలోనూ ఆయన స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారు. 

    ఈ ట్రెండ్స్‌ గనుక కొనసాగితే, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇది అతి పెద్ద మలుపుగా భావించవచ్చు. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి పెద్ద పార్టీలను కాదని ఓటర్లు మార్పు కోరుకుంటున్నట్టు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. 

    ప్రస్తుతం కౌంటింగ్ సరళిని గమనిస్తే అధికార డీఎంకే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ కేవలం 52 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సైతం తన నియోజకవర్గమైన చెపాక్-తిరువల్లికేణిలో వెనుకంజలో ఉన్నారు. అక్కడ ఏఐడీఎంకే అభ్యర్థి ఆది రాజారాం ఆధిక్యంలో ఉన్నారు. 

    మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో రెండో స్థానంలో 73 స్థానాలతో ఏఐడీఎంకే ఉంది. వారి మిత్ర పక్షం పీఎంకే ఆరు స్థానాల్లో లీడ్‌ సాధించింది. డీఎంకేతో పోలిస్తే ఏఐడీఎంకే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. అయినా టీవీకే మాత్రం రెండు పార్టీలను బెంబేలెత్తిస్తోంది. 

    తమిళనాడు ఓటర్లు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఆలోచించడం ఈ మార్పునకు ప్రధాన కారణం. విజయ్ తన పార్టీని డీఎంకే, అన్నా డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ప్రకటించి ప్రజల్లోకి బలంగా వెళ్లారు. యువత, మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున టీవీకే వైపు మొగ్గు చూపడం వల్ల ఈ ఫలితాలు వస్తున్నట్టు తెలుస్తోంది. డీఎంకే పాలనపై వ్యతిరేకత, కొత్త నాయకత్వం కోసం ప్రజల  నిరీక్షణ విజయ్‌కు ప్లస్‌ పాయింట్‌గా మారింది. 

     

    23 ఏప్రిల్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండోసారి అధికారం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా, విజయ్ రాజకీయ రంగ ప్రవేశం సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. గతంలో కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత తమిళనాడు రాజకీయ శూన్యతను ఎదుర్కొంది. ఆ శూన్యతను భర్తీ చేసే నాయకుడిగా విజయ్ ఎదిగారు. 

    Click here to Read More
    Previous Article
    Reduce Sun Tan : చేతులపై ట్యాన్ తగ్గించే హోమ్ రెమెడీస్.. హ్యాండ్స్ నల్లగా మారితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
    Next Article
    TVK Vijay Education Qualification: కాలేజీ డ్రాపౌట్ నుంచి పొలిటికల్ కింగ్‌గా దళపతి విజయ్ ప్రస్థానం ఇదే.. ఇంతకీ ఏం చదివారంటే

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment