Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    West Bengal CM Suvendu Sdhikari: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలు! కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి!

    1 week ago

    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్స్‌ ప్రకారం బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు సమీపంలో ఉంది. దీంతో ముఖ్యమంత్రి ఎవరనే చర్చ మొదలైంది.

    West Bengal CM Suvendu Sdhikari: పశ్చిమ బెంగాల్‌ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఈ స్టోరీ రాసే సరికి ఉన్న ట్రెండ్ చూస్తే బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మ్యాజిక్ ఫిగర్ సాధించే సీట్లలో ఆధిక్యంలో ఉంది. రాష్ట్ర అధికార కేంద్రమైన నబన్న వైపు కాషాయ దళం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గంలో ఆయాసంతో పరుగులు పెడుతున్నారు. స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేస్తారనే చర్చ మొదలైంది. మమతతో విభేదించి బీజేపీలో చేరినప్పటి నుంచి విజయం వరకు బీజేపీని నడిపించిన సువేదు అధికారి తర్వతా సీఎం కుర్చిలో కూర్చుంటారనే చర్చ సాగుతోంది. 

    భవానీపూర్‌లో హోరాహోరీ 

    ప్రస్తుతం ట్రెండ్స్‌ ప్రకారం భవానీపూర్‌లో మమతా బెనర్జీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన తర్వాత ఆమె వెనుకబడ్డారు. అక్కడి ఫలితం రౌండ్ రౌండ్‌కి మారుతోంది. గతంలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ వేదికా మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి, ఇప్పుడు మరోసారి ఆమెను ఓడించేంత పని చేస్తున్నారు. ఏ రౌండ్‌లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అక్కడ నెలకొంది. మమత బెనర్జీ కంచు కోటలోనే సువేందు సవాల్ చేయడం టీఎంసీ శ్రేణులు కంగుతిన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం, తాను భవానీపూర్‌లో 20వేల మెజార్టీ సాధిస్తానని, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ 180కిపైగా సీట్లు సాధిస్తుందని సువేందు చెప్పుకొచ్చారు. భవానీపూర్‌లో ఆ పరిస్థితి లేకపోయినా ఓవరాల్ సీట్ల విషయంలో మాత్రం ఆయన లెక్క తప్పలేదని తెలుస్తోంది. 

    ఎవరూ సువేందు అధికారి

    మమతకు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వ్యక్తి సువేందు అధికారి. ప్రస్తుతం ఆమెను ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా మారారు. ఆయన రాజకీయ ప్రస్థానం గమనిస్తే... 2009లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2016-2020 పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంలో రవాణా, పర్యావరణ శాఖ మంత్రిగా పని చేశారు. 2020-2021 జూట్ కార్పొరేన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2021 తృమూల్ కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతాబెనర్జీని ఓడించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన త్వరలోనే సీఎం కుర్చీలో కూర్చోనున్నారు. 
    సువేందు అధికారి ఒక అభ్యర్థఇగానే కాకుండా, బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ ప్రచార పగ్గాలను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆయన చూపిన ప్రతిభ పార్టీలో ఆయన స్థానాన్ని, సీఎం కుర్చీ వేపు ఆయన ప్రయాణాన్ని మరింత దగ్గర చేసింది. 

    పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. మమతా బెనర్జీ శైలిలోనే వీధుల్లో పోరాడుతూ, ప్రజల్లోకి వెళ్లడం ద్వారా సువేందు అధికారి బీజేపీకి కొత్త ఊపిరి పోశారు. బెంగాల్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బీజేపీకి వచ్చిన ఆధిక్యం చూస్తుంటే, ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. 

    ఒక వేళ ఇదే ట్రెండ్ కొనసాగి బీజేపీ విజయం సాధిస్తే, అది మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానానికి పెద్ద విఘాతంగా మారుతుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి అని చాలా మంది భావిస్తున్నప్పటికీ బీజేపీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితుల్లో సువేందు పేరు ముందంజలో ఉందన్నారు.   

    Click here to Read More
    Previous Article
    Heatwave Alert : వడగాలుల హెచ్చరిక.. ప్రాణాపాయం పెంచేస్తోన్న ఎండలు, Heat Stroke రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి
    Next Article
    Trisha Krishnan Birthday : త్రిష కృష్ణన్ 43వ బర్త్​ డే స్పెషల్.. ఆమె స్కిన్ కేర్, బ్యూటీ సీక్రెట్స్ ఇవే

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment