Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    వర్షం కురిసే ముందు కప్పలు ఎందుకు అరుస్తాయి? ప్రకృతి బయో ఇండికేటర్

    3 hours ago

    Natures Bioindicator: వర్షం కురిసే ముందు కప్పలు ఎందుకు అరుస్తాయి? వాన పడుతుందని ముందుగా వాటికి ఎలా తెలుస్తాయ్? ఆధ్యాత్మిక కారణాలా? ప్రకృతి సంకేతమా? కారణం ఏంటి? 

    Spirituality: ప్రకృతి మనకు ఎన్నో రహస్యాలు చెబుతుంటుంది. వాటిలో ఒకటి వర్షాలు-కప్పల మధ్య ఉన్న అనుసంధానం. కప్పలు అరవగానే.. కాసేపట్లో వర్షం కురుస్తుందని సంకేతంగా భావిస్తారు. అయితే ఇది కేవలం అంధవిశ్వాసం మాత్రమే కాదు..ప్రకృతికి సంంబంధించిన సూక్ష్మమైన హృదయ స్పందన. 

    కప్పల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అవి నీటి ద్వారా శ్వాసించే జీవులు. సాధారణంగా వర్షం వచ్చేముందు వాతావరణంలో తేమ పెరుగుతుంది, గాలి పీడనం తగ్గుతుంది. ఈ మార్పులను కప్పలు తమ చర్మం ద్వారా సులభంగా గుర్తించి, సంతానోత్పత్తి కోసం అరవడం ప్రారంభిస్తాయి. వాన నీటిలో గుడ్లు పెట్టి..తమ వంశాన్ని కాపాడుకోవడానికి ఇది సహజ ప్రక్రియ. కప్పలు అరుపు వర్షానికి సూచన కాదు కానీ వర్షానికి ముందస్తు సూచన. ఇది ప్రకృతి సమతుల్యతను సూచిస్తుంది. ఓ జీవి తన అవసరాలకు అనుగుణంగా ప్రకృతి సంకేతాలను అర్థం చేసుకుంటుంది.

    ప్రకృతి సంబంధం

    వర్షం కప్పల జీవిత చక్రానికి కీలకం. వేసవిలో నిద్రాణ స్థితి నుంచి బయటపడి వర్షాకాలంలో అవి సక్రియం అవుతాయి. కప్పలు , పురుగులు కీటకాలను తిని పంటలను రక్షిస్తాయి. నేలను ఫలవంతం చేసే వర్షానికి కప్పలు సహాయకులు. ఇది ప్రకృతికి సంబంధించిన అద్భుతమైన ఇంటర్ కనెక్టెడ్‌నెస్. ఒకటి లేకపోతే మరొకటి అసంపూర్ణం. 

    ఆధ్యాత్మిక కారణాలు

    హిందూ సంస్కృతిలో కప్పలు కేవలం జీవులు మాత్రమే కాదు..వేదాల్లో ఫర్జన్యుడు (వాన దేవుడు) కప్పలను ప్రాణవంతం చేసి వాటి అరుపులను వేదగానంతో పోల్చారు. కప్పలకు వివాహం జరిపించడం ద్వారా వానలు కురుస్తాయని చెప్పడం ఇందులో భాగమే. కొన్ని ప్రాంతాల్లో కప్పను తడిగుడ్డకు చుట్టి దాన్ని కర్రకు కట్టి.. రోజంతా ఇంటింటికీ తిరుగుతూ..ఆ కప్పపై నీళ్లు పోస్తూ.. సాయంత్రానికి తిరిగి ఆ కప్పను చెరువులో విడిచిపెడతారు. రోజంతా ఇంటింటికి తిరిగినప్పుడు వచ్చిన బియ్యం,కూరగాయలతో వంట చేసి అంతా కలసి భోజనం చేస్తారు. ఇలా చేస్తే సకాలంలో వానలు కురుస్తాయని సంకేతం. సహజ శక్తులను గౌరవించడం,ప్రార్థన ద్వారా వరుణుడి అనుగ్రహం కోరడం చేస్తారు. నీటి నుంచి భూమికి మారడం మనం హిందూ సంస్కృతిలో కప్పలు కేవలం జీవులు కాదు. వేదాల్లో పర్జన్యుడు (వర్ష దేవుడు) కప్పలను ప్రాణవంతం చేసి, వాటి అరుపును బ్రాహ్మణుల వేదగానంతో పోల్చాడు. కప్పల వివాహం (భేకులి బియా) ఆచారం ఇంద్రుడిని సంతోషపెట్టి వర్షం కోరడానికి జరుగుతుంది. పరివర్తన, పునరుద్ధరణ, ఆధ్యాత్మిక మేల్కొలుపు సంకేతం కప్ప.. నీటి నుంచి భూమికి మారే క్రమం.. ఆత్మ ప్రయాణాన్ని గుర్తుచేస్తుంది.  

    ప్రకృతి, జీవుడు, దేవుడు అన్నీ దైవిక తంత్రంలో భాగం. వర్షం కురిసినప్పుడు కప్పల అరుపులు వినండి..అందులో ప్రకృతి మహిమ, సైన్స్ అద్భుతం, ఆత్మగానం వినిపిస్తాయ్. 

    Click here to Read More
    Previous Article
    Ram Charan: డాన్సర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రామ్ చరణ్ భారీ విరాళం... ఎంత అమౌంట్ ఇచ్చారంటే?
    Next Article
    IND Predicted XI Vs Eng in 1st ODI: ఇంగ్లాండ్ తో పోరుకు రోకో గ్రాండ్ రీఎంట్రీ.. శుభారంభానికి గిల్ సూపర్ స్కెచ్, ఫస్ట్ వన్డేకు ఇండియా ప్రెడిక్టెడ్ ఎలెవన్ ఇదే!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment