Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Pawan Kalyan : మంగళగిరిలోనే ఉన్న మంత్రివర్గ సమావేశానికి హాజరుకాని పవన్ కల్యాణ్‌- కూటమిలో ఏం జరుగుతోంది?

    2 hours ago

    Pawan Kalyan:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వరుసగా మంత్రివర్గ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. దీంతో కూటమిలో ఏదో జరుగుతోందని ప్రచారం మొదలైంది.

    Pawan Kalyan:అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ మరోసారి డుమ్మా కొట్టారు. ఇంత వరకు వేర్వేరు కారణాలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం మంగళగిరిలోనే ఉన్నప్పటికీ ఆయన భేటీకి హాజరుకాకపోవడంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలా మంత్రివర్గ సమావేశాలకు పవన్ గైర్హాజరు కాకపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇలాంటివి జరిగాయి. అయితే అప్పట్లో ఇటు ప్రభుత్వం అటు జనసేన ఏవోవో కారణాలు చెబుతూ వచ్చింది. 

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏం జరుగుతోందన్న చర్చ తీవ్రంగా సాగుతోంది. బహిరంగ సభల్లో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలంటూ ప్రసంగాలు చేస్తున్న నాయకులు నాలుగు గోడల మధ్య మాత్రం ఒకరంటే ఒకరికి పడటం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ప్రారంభోత్సవాల్లో తన ఫొటో కనిపించకుండా చేస్తున్నారంటూ పవన్ నవ్వూ చెబుతున్న ఓ వీడియో బాగా వైరల్ అయింది. ఆ మధ్య ప్రశ్న రావణ్ కేసు విషయంలో కూడా పవన్ అలిగారని కూడా ప్రచారం జరిగింది. మొదటి నుంచి ఇలాంటి ప్రచారాలు చాలానే వచ్చాయి. కానీ వాటని కొట్టిపారేస్తూ మేమంతా ఒకటిగానే ఉన్నామంటూ నేతలు బహిరంగ సభల్లో చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం తేడాగానే ఉన్నాయి. 

    ప్రతి వారం ఏదో విషయంపై మంత్రివర్గ సమావేశం జరుగుతూనే ఉంది. అయితే వ్యక్తిగత పనులు, శాఖాపరమైన టూర్‌లలో ఉన్న వారు మాత్రం తాము మంత్రివర్గ సమావేశానికి హాజరుకాలేకపోతున్నామనే సమాచారం ముఖ్యమంత్రికి అందజేస్తారు. గతంలో జరిగి సమావేశాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకాలేని పరిస్థితి ఏర్పడింది. తన తల్లి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఒకసారి, తర్వాత ముక్కు సర్జరీ జరిగినప్పుడు, భుజానికి సర్జరీ జరిగినప్పుడు, తర్వాత వైద్యులు రెస్ట్ తీసుకోమన్నారని మరోసారి ఇలా పలు దఫాలుగా మంత్రిమండలి సమావేశానికి రాలేదు. మరికొన్ని సందర్భాల్లో వచ్చినా మధ్యలోనే వెళ్లిన ఘటనలు కూడా ఉన్నాయి. 

    సర్జరీ జరిగిన తర్వాత తన చేతికి కట్టుతోనే ఈ మధ్య కాలంలో పార్టీ, తన శాఖాపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన టీమ్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. మొన్న భోగాపురం ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు. ఇన్ని సందర్భాల్లో కట్టుతోనే పాల్గొన్న పవన్ కల్యాణ్‌ ఇవాళ మంత్రివర్గ సమావేశానికి రాకపోవడంతో ఏదో తేడాగా ఉంది సీనూ అంటున్నారు ప్రత్యర్థులు.

    ఒకట్రెండు సందర్బాల్లో చంద్రబాబు టీంలోని ఒకరిద్దరి మంత్రులతో పవన్ కల్యాణ్ విభేదించారని ప్రచారంలో ఉంది. మొదట్లోనే హోంశాఖ పని తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె తన శాఖపై పట్టు సాధించలేదని సుతిమెత్తగా విమర్శలు చేశారు. అప్పట్లో ఆ కామెంట్స్‌ బాగా వైరల్ అయ్యాయి. సమయం వచ్చినప్పుడల్లా హోంశాఖ తన చేతిలో ఉంటే వైసీపీ వాళ్ల ఆటలు ఇలా సాగనిచ్చేవాడిని కాదంటూ ఆరోపణలు చేశారు. అమరావతి భూసేకరణ విషయంలో మంత్రి నారాయణతో కూడా విభేదించారని టాక్ వచ్చింది. దీనిపై అధికారిక సమాచారం లేకపోయినా, దీనిపై చర్చించిన మంత్రిమండలి భేటీ నుంచే మధ్యలో నడుం నొప్పి ని చెప్పి వెళ్లిపోయారని అంటారు. దీనిపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. రావణ్ విషయంలో కూడా టీడీపీ నేతలు సహకరిస్తున్నారని, బెయిల్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారని పవన్ నమ్ముతున్నారు. పవన్ ఒత్తిడి కారణంగానే కఠినమైన సెక్షన్లు పెట్టినట్టు ప్రచారంలో సాగుతోంది. ఒకానొక దశలో తన సెక్యూరిటీని కూడా తిరిగి పంపించేందుకు పవన్ రెడీ అయ్యారని ఇదే విషయం డీజీపీకి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ఆ విషయంలో అన్ని కేసులు పెట్టాల్సి వచ్చిందని కూడా అంటున్నారు. ఇలా పలు కారణాలతో పవన్, చంద్రబాబు మధ్య విభేదాలు ఉన్నాయని చర్చించుకుంటున్నారు.  

    ఇవాళ జరుగుతున్న సమావేశంలో కూడా అమరావతిలో ఏర్పాటు చేయబోయే విమానాశ్రయం భూముల వ్యవహారంపై చర్చించనున్నారని ప్రచారం జరిగింది. అందుకే పవన్ కల్యాణ్‌ డుమ్మా కొట్టాడని అంటున్నారు. మంత్రివర్గ సమావేశంలో చర్చల్లో పాల్గొన్న తర్వాత తీసుకున్న నిర్ణయాలపై మినిట్స్ రాస్తారు. వాటిపై అందరు మంత్రులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇష్టం లేనివి ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ కామెంట్స్ రాయాల్సి ఉంటుంది. అలా చేస్తే మరింత సంచలనం అవుతుందని అందుకే చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలకు ఓకే చెప్పలేక, కాదని అనలేక ఇలా మంత్రివర్గ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారని అంటున్నారు. 

    Click here to Read More
    Previous Article
    Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
    Next Article
    Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment