Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Rashmika : రష్మికకు తీవ్ర గాయం - ఆరు వారాలు షూటింగ్స్‌కు బ్రేక్... డాక్టర్స్ ఏం చెప్పారంటే?

    1 hour ago

    Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మికకు తీవ్ర గాయమైంది. ఆమెకు హిప్ ఏరియాలో గాయమైనట్లు వైద్యులు తెలిపారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

    Rashmika Mandanna Injuered In Shooting Health Update : టాలీవుడ్ స్టార్స్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. మొన్న రామ్ చరణ్, నిన్న ఎన్టీఆర్, బాలకృష్ణ, నేడు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. హై ఓల్టేజ్ డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ కోసం షూట్ చేస్తున్న టైంలో రష్మిక గాయపడినట్లు తెలుస్తోంది. రష్మికకు హిప్ (తుంటి భాగం) ఏరియాలో గాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నేషనల్ క్రష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రణబాలి, మైసా వంటి యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తున్నారు. 

    డాక్టర్స్ ఆశ్చర్యం

    రెండు చిత్రాల్లోనూ వరుసగా యాక్షన్ సీక్వెన్స్, డ్యాన్స్ సీక్వెన్స్ కోసం రెడీ అవుతున్నారు రష్మిక. ఈ టైంలో తీవ్ర గాయంతో ఆమెకు హిప్ ప్రాంతంలో టెండన్ పూర్తిగా డిటాచ్ అయినట్లు సమాచారం. గాయం తీవ్రత చూసి డాక్టర్స్ ఆశ్చర్యపోయినట్లు రష్మిక సన్నిహిత వర్గాలు తెలిపాయి. సాధారణంగా ప్రొఫెషనల్ అథ్లెట్స్, తీవ్రమైన శారీరక శిక్షణ పొందేవాళ్లు, స్పోర్ట్స్ పర్సన్స్‌లో ఇలాంటి గాయాలు కనిపిస్తుంటాయని డాక్టర్స్ చెప్పినట్లు వెల్లడించాయి. 

    6 వారాల విశ్రాంతి

    ప్రస్తుతం రష్మికకు ఆరు వారాల వాటు కంప్లీట్‌గా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. హిప్ ఏరియాలో టెండన్ తిరిగి బలపడేందుకు రీహాబిలిటేషన్ కూడా తప్పనిసరి అని చెప్పారట. దీంతో పలు మూవీస్ షూటింగ్స్‌కు బ్రేక్ పడనుంది. 6 వారాల పాటు రష్మిక షూటింగ్స్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

    ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా స్థాయిలో నాలుగు భారీ ప్రాజెక్టులతో పాటు పలు ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. రణబాలి, మైసా సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ మూవీస్ చేస్తున్నారు. దాదాపు 30 బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. గాయం కారణంగా షూటింగ్ షెడ్యూల్‌తో పాటు కమర్షియల్ షూటింగ్స్ కూడా వాయిదా పడనున్నాయి. పూర్తి విశ్రాంతి తీసుకుని, రీహాబిలిటేషన్ పూర్తి చేసుకున్న తర్వాతే ఆమె తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. 

    అభిమానుల ఆందోళన

     

    రష్మిక గాయం తగిలిందని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్స్‌లో ఉత్సాహంగా పాల్గొనాలని కోరుకుంటున్నారు. నేషనల్ క్రష్ త్వరగా కోలుకోవాలని పలువురు సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్‌కు ఏమైంది? అందరూ గాయాల పాలవుతున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

    Click here to Read More
    Previous Article
    India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
    Next Article
    Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment