Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?

    1 hour ago

    TVK Vijay Strategy: తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత విజయ్ సినిమా స్టైల్ ప్రచారం చేసుకుటున్నారు. దీంతో ఆయన ఇంకా సినిమా మూడ్ నుంచి బయటకు రాలేదని తమిళనాడులో విమర్శలు వస్తున్నాయి.

    Vijay Cinema Style Political Tour Reels: తమిళ రాజకీయ క్షేత్రంలో తమిళగ వెట్రి కళగం అధినేత, సినీ నటుడు విజయ్ ప్రవేశం సరికొత్త గ్లామర్ పొలిటికల్ అధ్యాయానికి తెరలేపింది. సినిమాలు వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారానని ప్రకటించినప్పటికీ, ఆయన ప్రజల్లోకి వస్తున్న తీరు, పర్యటనలలో ప్రదర్శిస్తున్న హడావుడి, సోషల్ మీడియా రీల్స్ ఇప్పటికీ పక్కా  సినిమా కమర్షియల్ ఎంట్రీ"ని గుర్తుచేస్తున్నాయి. జీన్స్-షర్ట్ డ్రెస్సింగ్ స్టైల్, కేడర్‌ను ఉద్దేశించి చేసే సిగ్నేచర్ మాస్ యాక్షన్లు, ఫ్యాన్స్ హడావుడితో కూడిన షార్ట్ వీడియోలను టివికె సోషల్ మీడియా టీమ్ విపరీతంగా ప్రచారం చేస్తోంది. అయితే, ఈ  ఫిల్మీ అప్పీల్  విజయ్ రాజకీయ ప్రయాణానికి మైలేజ్ ఇస్తుందా లేదా ప్రతికూలంగా మారుతుందా అనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. 

    పాలనలో రీల్స్ స్టైల్ 

    తమిళనాడు రాజకీయ చరిత్రను గమనిస్తే ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ వంటి అగ్ర నటులు తమ సినీ గ్లామర్‌ను విజయవంతంగా రాజకీయ అధికారంగా మలుచుకున్నారు. అదే బాటలో విజయ్ కూడా తనకున్న అపారమైన ఫ్యాన్ బేస్‌ను  రాజకీయ ఓటు బ్యాంక్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ద్రావిడ పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకేల సాంప్రదాయ రాజకీయ ప్రకటనలు ,  పొడిపొడి ప్రెస్ మీట్లకు భిన్నంగా.. విజయ్ తన పర్యటనలను ఒక సెలబ్రిటీ రోడ్‌షోలా డిజైన్ చేస్తున్నారు. ఈ సినిమాటిక్ ప్రెజెంటేషన్ ముఖ్యంగా "జెన్-జీ యువతను, మహిళా ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించే ఈ రీల్స్, విజయ్‌ను ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలబెట్టడంలో తోడ్పడుతున్నాయి.

    విపక్షాల నుంచి విమర్శలు

     ఈ హంగులు, ఆర్భాటాల వెనుక పాలనాపరమైన, విధానపరమైన స్పష్టత ఉందా అనే ప్రశ్నలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. కేవలం గ్లామరిజం, సోషల్ మీడియా హంగామాతో మాత్రమే ఎన్నికల రాజకీయాల్లో నిలబడటం సాధ్యం కాదని ప్రత్యర్థి పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సంక్షేమ పథకాలు, ద్రవ్యోల్బణం, రాష్ట్ర హక్కులు ,  ద్రావిడ సిద్ధాంతంపై విజయ్ స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఇవ్వకుండా, కేవలం  స్టార్ హోదా  ఆధారంగా రాజకీయాలు నడుపుతున్నారనే అభిప్రాయం  కూడా ఉంది. నిరంతరం రీల్స్, ఫ్యాన్ క్లబ్ మీటింగ్‌ల శైలిలో పర్యటనలు సాగితే, సీరియస్ పొలిటీషియన్‌గా ఆయన ముద్ర పడటం కష్టమవుతుందనే హెచ్చరికలు వస్తున్నాయి.

    జెన్ జీలో క్రేజ్ పెంచుకుంటున్న విజయ్ 

      విజయ్ రాకను ఎంజీఆర్ శకంతో పోలుస్తూ ఆయన మద్దతుదారులు వీడియోలు ట్రెండ్ చేస్తుండగా, ప్రత్యర్థులు మాత్రం ఆయనను రీల్ లీడర్  అని ట్రోల్ చేస్తున్నారు. పర్యటనల సమయంలో భద్రతా కారణాలు, అభిమానుల తోపులాటలు, విజువల్ హంగామా తప్ప ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో వినే ఓపిక కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్క్రీన్ పై ఎంత సీరియస్ మెసేజ్ ఇచ్చినా, నిజ జీవితంలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయకపోతే ఈ గ్లామర్ ఎక్కువ కాలం నిలబడదన్నఅంచనాలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా లాభనష్టాల అంచనా వేస్తే.. ఆరంభంలో మాస్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేయడానికి, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఈ సినిమా స్టైల్ ప్రచారం విజయ్‌కు అద్భుతంగా పనిచేసింది. కానీ, ఎన్నికల సమయానికి ఓటర్లు నాయకుడిలో  అభినయం కంటే  అనుభవం , విధానపరమైన స్పష్టత ను కోరుకుంటారు. విజయ్ తన సినీ గ్లామర్‌ను కేవలం ఒక సాధనంగా మాత్రమే వాడుకుని, సీరియస్ రాజకీయ అజెండాతో ప్రజల్లోకి వెళితేనే ఆయన సాధించిన పాపులారిటీ స్థిరమైన ఓట్లుగా మారుతుంది. లేకపోతే, ఈ సినిమాటిక్ ప్రచారం ఒక  రంగుల కలగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. 

     

     
    STORIES YO

    Click here to Read More
    Previous Article
    Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment