Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

    1 hour ago

    Allagadda : ఆళ్లగడ్డలో పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. చికెన్ దుకాణాల వద్ద కమిషన్ల నుంచి అహోబిలం తలనీలాల అవినీతి ఆరోపణలపై గంగుల నానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మధ్య సవాళ్లు నడుస్తున్నాయి.

    Bhuma Legacy vs Gangula Dominance AP:   నంద్యాల జిల్లా రాజకీయాల్లో  ఆళ్లగడ్ ' నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ భూమా ,  గంగుల కుటుంబాల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు ఏపీ రాజకీయాల్లోనే అత్యంత ఉద్రిక్తమైనదిగా పేరుగాంచింది. ఒక ఎన్నికల్లో భూమా కుటుంబం గెలిస్తే, మరో ఎన్నికల్లో గంగుల కుటుంబం జయకేతనం ఎగురవేయడం ఇక్కడి ఓటర్ల ట్రెండ్.  గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రాజకీయ వారసురాలిగా బరిలోకి దిగిన భూమా అఖిలప్రియ విజయం సాధించి, తమ లెగసీని విజయవంతంగా కంటిన్యూ చేస్తున్నారు. అయినప్పటికీ, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి వర్గం మాత్రం అఖిలప్రియకు క్షేత్రస్థాయిలో ప్రతీ అడుగులోనూ సవాల్ విసురుతోంది.
    రోజూ ఉద్రిక్తంగానే ఆళ్లగడ్డ రాజకీయాలు 

    ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని ఏ ఇతర నియోజకవర్గాల్లో లేని విధంగా ఆళ్లగడ్డలో రాజకీయ పోరు వ్యక్తిగత దూషణలు, అవినీతి ఆరోపణల స్థాయికి చేరింది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలపై దాడులు చేయడం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. వైఎస్సార్‌సీపీ అధికారం కోల్పోయినప్పటికీ, గంగుల నాని వర్గం మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే అఖిలప్రియపై అత్యంత ఘాటైన అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతోంది. స్థానిక చికెన్ షాపుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే చౌకబారు ఆరోపణల దగ్గరి నుండి, ఏకంగా ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ తలనీలాల కాంట్రాక్ట్ వ్యవహారం వరకు అఖిలప్రియపై గంగుల కుటుంబం సంచలన ఆరోపణలు గుప్పించింది.

    అవినీతి ఆరోపణలపై అఖిలప్రియ సవాల్ 

    ఈ వరుస ఆరోపణలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, గంగుల నాని చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే దేవుని సాక్షిగా అహోబిలం క్షేత్రానికి వచ్చి నిరూపించాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఒకవేళ తలనీలాల వ్యవహారంలో తన అవినీతిని రుజువు చేస్తే.. నిమిషాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటానని భీష్మించుకూర్చున్నారు. ఈ మేరకు ఆమె నేరుగా వాహన శ్రేణితో అహోబిలానికి చేరుకోగా, గంగుల నాని అక్కడకు రాకపోవడంతో.. నువ్వు రాకపోతే నేనే నీ ఇంటికి వచ్చి నిలదీస్తా  అంటూ ఆళ్లగడ్డలోని గంగుల నివాసానికి బయలుదేరడం తీవ్ర హైటెన్షన్‌కు దారితీసింది.

    కొన్ని చోట్ల ఇప్పటికీ గంగుల కుటుంబ పెత్తనమే 

     ఈ వివాదం వెనుక అసలు కథ ఆదాయ వనరులు ,  క్షేత్రస్థాయి పెత్తనమే అని తెలుస్తోంది.  ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో అహోబిలం దేవస్థానం పరిసరాల్లోని వ్యాపారాలు, కాంట్రాక్టులు ,  స్థానిక మార్కెట్ యార్డులపై గంగుల కుటుంబం పూర్తి పట్టు సాధించి భారీగా ఆదాయం సంపాదించుకుందనే ప్రచారం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ.. గంగుల వర్గం ఇంకా పాత పద్ధతిలోనే అక్రమ ఆదాయ వనరులను, తమ పెత్తనాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోందని  అఖిలప్రియ వర్గం బావిస్తోంది. స్థానికంగా సాగుతున్న ఈ అక్రమ వసూళ్లకు, గంగుల కుటుంబ పెత్తనానికి బ్రేకులు వేయాలని అఖిలప్రియ గట్టిగా ప్రయత్నిస్తుండటంతోనే.. వారు తట్టుకోలేక ఈ స్థాయి బ్లేమ్ గేమ్‌కు తెరతీశారని టీడీపీ శ్రేణులు వాదిస్తున్నాయి.

    రాజకీయం ఫ్యాక్షన్ గా మారకపోతే చాలని ప్రజల భావన 

     

    పరిస్థితి చేయిదాటిపోకుండా  పాత కక్షలు మళ్లీ రాజుకోకుండా నంద్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం ఆళ్లగడ్డలో భారీగా బలగాలను మోహరించింది. అఖిలప్రియ గంగుల నాని నివాస ముట్టడికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని, ఇరువర్గాల ముఖ్య నేతలను గృహనిర్బంధం చేశారు. అయితే, అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష నేత వేసే రాజకీయ ఎత్తుగడలను దీటుగా ఎదుర్కోవడంలో అఖిలప్రియ చూపిస్తున్న దూకుడు ఆళ్లగడ్డ పాలిటిక్స్‌ను మరింత వేడెక్కిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ 'తలనీలాల' మరియు 'వసూళ్ల' వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో, గంగుల మార్క్ పెత్తనానికి భూమా వారసురాలు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.

     
    Click here to Read More
    Previous Article
    Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!
    Next Article
    AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment