Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Rohit Sharma Retirement: రోహిత్‌శర్మ రిటైర్మెంట్‌ న్యూస్! లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు వీడ్కోలు! వరల్డ్‌కప్ ప్లాన్స్‌లో లేడని తేల్చి చెప్పిన బీసీసీఐ!

    1 hour ago

    రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది వరల్డ్‌కప్ ప్రొబబుల్స్‌లో అతని పేరు లేదని చెప్పడంతో లార్డ్స్‌లో జరిగే వన్డే తర్వాత రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

    Rohit Sharma Retirement:ప్రస్తుతం ఇంగ్లండ్‌ సిరీస్‌లో ఆడుతున్న రోహిత్ శర్మ వన్డే నుంచి కూడా రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్టు‌ సమాచారం. ప్రస్తుతం రెండు వన్డేల్లో పరుగులు చేసే క్రమంలో రోహిత్ శర్మ ఇబ్బంది పడుతున్నాడు. అతను ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వచ్చే వరల్డ్‌కప్‌లో ఆడతాడని కూడా వారంతా భారీ అంచనాలతో ఉన్నారు. కానీ వారికి షాక్ ఇచ్చారు. వచ్చే వరల్డక్ ప్రాబబుల్స్ జాబితాలో తన పేరు లేదని బీసీసీఐ చెప్పడంతో ఇక టీంలో కొనసాగడం కష్టమనుకున్నాడు. అందుకే వీడ్కోలు చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి లార్డ్స్‌లో జరిగే వన్డే సరైందని భావించారు.  

    లార్డ్స్‌లో జరిగే వన్డే రోహిత్ శర్మ ఆఖరి వన్డే?

    జులై 19న ఇంగ్లండ్‌తో మూడో వన్డే లార్డ్స్‌లో జరగనుంది. ఈ వన్డే తర్వాత వన్డేలకు కూడా గుడ్‌బై చెబుతున్నట్టు రోహిత్‌ శర్మ బీసీసీఐ మేనేజ్మెంట్‌కు చెప్పేశారు. బీసీసీకి చెందిన సీనియర్ సభ్యుడు ఒకరు ఈ విషయాన్ని తెలిపినపినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ రిపోర్ట్ చేసింది. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత మూవ్‌ఆన్ కావాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నట్టు పేర్కొంది,. 

    రోహిత్ శర్మ అకస్మాత్తుగా ఎందుకు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నారు?

    వచ్చే వరల్డ్ కప్‌ జాబితాపై ఇప్పటికే రోహిత్‌ శర్మతో కోచ్ గౌతమ‌ గంభీర్‌తోపాటు ప్యానెల్ మాట్లాడినట్టు తెలుస్తోంది. టీమిండియాలో తమ సత్తా చాటుకునేందుకు యశస్వీ జైస్వాల్‌ లాంటి యువకులు సిద్ధంగా ఉన్నారని వారి ఆట కూడా ఈ మధ్య కాలంలో చాలా బాగుందని చెప్పారు. అందుకే వచ్చే 50 ఓవర్ల వరల్డ్ కప్‌లో యంగ్ స్టార్స్‌కు ఛాన్స్ ఇస్తామని పేర్కొన్నారు. రోహిత్ శర్మకు స్థానం ఉండదని క్లియర్‌గా చెప్పేశారు. 

    ఇకపై జరిగే వన్డేల్లో రోహిత్‌ను సెలెక్ట్ చేయబోమని బీసీసీఐ చెప్పేసిందా?

    ఇంగ్లండ్ సిరీస్ తర్వాత వారి ప్లాన్‌ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందనే విషయం గురించి రోహిత్ శర్మకు మేనేజ్‌మెంట్‌ వివరించింది. తదుపరి మ్యాచ్‌లలో రోహిత్ శర్మకు పెద్దగా ప్రాధాన్యత ఉండబోదని కూడా తేల్చేశారు. పక్కన పెడతామని చెప్పేశారు. రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సాధించిన తర్వాత మరికొన్ని రోజులు వన్డే మ్యాచ్‌లు భారత్ తరఫున ఆడాలని ఆశించాడు. కానీ టీమ్‌మేనేజ్మెంట్ మాత్రం తమకు వేరే ప్లాన్స్ ఉన్నట్టు చెప్పింది. దీంతో బాల్‌ను రోహిత్ శర్మ కోర్టులోనే వేసింది. 

    బీసీసీపై రోహిత్ శర్మ అసహనం  

    బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఫిట్‌నెస్ నిరూపించుకొని జట్టులోకి వచ్చిన తర్వాత ఇలా చెప్పడంపై అధికారులతో చర్చించారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. హిట్‌మ్యాన్ స్థానంలో శుభ్‌మన్‌గిల్‌కు పగ్గాలు అప్పగించింది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది. 

    టీ20, టెస్టులకు రోహిత్ శర్మ ఎప్పుడు గుడ్‌బై చెప్పాడు?

    ఇప్పటికే రోహిత్ శర్మ ఇప్పటికే టీ20, టెస్టుల నుంచి తప్పుకున్నాడు. 29 జూన్ 2024లో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల నుంచి రిటైర్ అయ్యాడు. భారత్‌కు ప్రపంచకప్‌ అందించిన తర్వాత వైదొలిగాడు. గతేడాది మే 7న టెస్టులకు గుడ్‌బై చెబుతున్నట్టు ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. అది కూడా ఇంగ్లండ్‌ టూర్‌కు ముందే ఈ నిర్ణయం తీసుకున్నాడు.

    గతంలో సిక్సర్స్‌తో అదరగొట్టి హిట్‌మ్యాన్‌గా పేరు పొందిన రోహిత్ శర్మ గత కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. పరుగులు చేయలేకపోతున్నాడు. ప్రస్తుతం అతని ఫామ్ చూసిన తర్వాత బీసీసీఐ మేనేజ్మెంట్‌  అతన్ని కంటిన్యూ చేయడంలో ప్రయోజనం లేదని భావిస్తోంది. అందుకే అతని విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యింది.

    Click here to Read More
    Previous Article
    US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
    Next Article
    Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

    Related స్పోర్ట్స్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment