Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!

    2 hours ago

    Andhra Pradesh RTGS: ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వాహన చోరుల‌ సింహస్వప్నంగా మారుతోంది. చోరీకి గురైన వాహ‌నాల ఆచూకిని ఇక్కడి ఏఐ ఆధారిత కెమెరాలు గంటల వ్యవధిలోనే పట్టేస్తున్నాయి.  

    Andhra Pradesh RTGS: విజ‌య‌వాడ టు టౌన్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో త‌న వాహ‌నం చోరీకి గురైంద‌ని ఓ మ‌హిళ ఫిర్యాదు చేసింది. ఆ వాహ‌న ఆచూకీ కోసం ఆర్టీజీఎస్ సీసీటీవీ360 స‌హ‌కారాన్ని పోలీసులు కోరారు. దీంతో సీసీకెమెరాల ద్వారా ఆ వాహ‌న క‌ద‌లిక‌ల‌పై పోలీసుల‌కు ఆర్టీజీఎస్ ఎప్ప‌టిక‌ప్పుడు అల‌ర్టులు పంపడంతో ఆ వాహ‌నాన్ని ప‌ట్టుకోగ‌లిగారు. చోరీ చేసింది ఆమె భర్త అని తెలిసి తెలిసి పోలీసులు, కుటుంబ సభ్యులే షాక్ తిన్నారు. కుటుంబ త‌గాదాల కార‌ణంగా వాహ‌నాన్ని అప‌హ‌రించిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. 

    ఈ నెల ఒక‌టో తేదీ.. బాప‌ట్ల జిల్లా చీరాల‌లో చిత్తు కాగితాలు ఏరుకుని జీవ‌నం సాగించే త‌ల్లి ఆరునెల‌ల చంటిబిడ్డ‌ను పక్కన పెట్టుకొని ఫుట్‌పాత్ నిద్రిస్తోంది. ఓ ఆగంతుకుడు ఆమె చంటిబిడ్డ‌ను ఎత్తుకెళ్లాడు. ఈ కేసును స‌వాల్‌గా తీసుకున్న బాప‌ట్ల పోలీసులు ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్య‌వ‌స్థ స‌హ‌కారం తీసుకున్నారు.  బిడ్డ‌ను ఎత్తుకెళ్లిన వ్య‌క్తి క‌ద‌లిక‌ల‌ను ఏఐ ఆధారిత కెమెరాల ద్వారా జ‌ల్లెడ‌ప‌ట్టి 24 గంట‌ల్లోపే నిందితుడ్ని ప‌ట్టుకున్నారు. పసివాడిని త‌ల్లి ఒడికి  చేర్చారు. 

    Click here to Read More
    Previous Article
    Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
    Next Article
    Best Roti For Health: మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment