Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ

    2 hours ago

    జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన చేస్తున్నారనే వార్తల్లో నిజం లేదని ఫాన్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. 'మా ఊరు వాడ' కేవలం స్వచ్ఛంద సేవా కార్యక్రమమేనని, రాజకీయాలతో సంబంధం లేదని తేల్చిచెప్పింది.

    Jr NTR Maa Ooru Wada | అమరావతి: తమిళనాడులో సినీ నటుడు విజయ్ తన సొంత పార్టీని స్థాపించి, ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసి విజయం సాధించడంతో.. ఏపీలో కూడా నెక్ట్స్ జూనియర్ ఎన్టీఆర్ అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. కొత్త పార్టీ ప్రకటించడం, లేక పొలిటికల్ ఎంట్రీ దిశగా అడుగులు వేయడం ఫిక్స్ అని చర్చ నడుస్తోంది. జూలై 18న తారక్ తన అభిమాన సంఘాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చి, సేవా కార్యక్రమాల పేరుతో రాజకీయ పార్టీ ప్రకటన లేదా పొలిటికల్ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారంటూ సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఎన్టీఆర్ పిఆర్ టీమ్, ఫాన్స్ అసోసియేషన్ స్పష్టం చేశాయి. అప్పట్లో పెద్ద ఎన్టీఆర్, ఇప్పుడు ఎన్టీఆర్ సైతం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి చక్రం తిప్పుతారంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

    'మా ఊరు వాడ' ఉద్దేశ్యం.. 
    జూలై 18న ప్రారంభం కానున్న 'మా ఊరు వాడ' కార్యక్రమం కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమం మాత్రమేనని ఎన్టీఆర్ అభిమాన సంఘాలు తెలిపాయి. గతంలో 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ (TDP) తరఫున ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాలంలో ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే ఫోకస్ చేశారు. ఆ మధ్య కేంద్ర మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీ, అలాగే సోదరి నందమూరి సుహాసిని వంటి కుటుంబ సభ్యులు గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల అభిమానులు CM NTR అంటూ బ్యానర్లు కట్టడం, ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించడం సహజంగానే పుకార్లకు బలం చేకూర్చింది. ప్రతి ఏడాది దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన జయంతి, వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించేందుకు తారక్ వెళ్లే సమయంలోనూ సీఎం, సీఎం అంటూ నినాదాలు చేయడం చూస్తూనే ఉన్నాం.

    సినిమాలే నా ప్రాధాన్యత అన్న తారక్  !
    గతంలో పలు ఇంటర్వ్యూలు, సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సందర్భాల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ ప్రవేశంపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ‘నాకు ఎలాంటి ఓట్లు వద్దు, ప్రేక్షకులు నా సినిమా టికెట్లు కొని థియేటర్లలో ఆదరిస్తే చాలు, నటుడిగా చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవని’ ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం డ్రాగన్, సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న తారక్, తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారని.. కాబట్టి రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలను, వెబ్‌సైట్ ప్రచారాలను నమ్మవద్దని అధికారిక ఫ్యాన్స్ అసోసియేషన్ వెబ్‌సైట్ WWW.RAWNTR.ORG ద్వారా గట్టిగా విజ్ఞప్తి చేశారు.

     

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం రాజకీయాల్లోకి రాబోతున్నారని, త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగడం తెలిసిందే. గత ఎన్నికల్లో బన్నీ తన స్నేహితుడైన వైసిపి అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ఇవ్వడం వల్ల మెగా ఫ్యాన్స్‌తో వివాదంగా మారింది.  పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా మరో కొత్త పార్టీ పెట్టాలని అల్లు అర్జున్ నిర్ణయం తీసుకుంటారా అన్నది సందేహమే.

    Click here to Read More
    Previous Article
    Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
    Next Article
    Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment