Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి

    19 hours ago

    Andhra Pradesh Zones | ఏపీని మొత్తం 6 జోన్లు, 2 మల్టీ జోన్లు విభజించడంతో పాటు అందుకు అనుగుణంగానే ఉద్యోగుల విభజన ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

    AP Local Cadre | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగాల క్యాడర్లను విభజించడంపై కసరత్తు పూర్తిచేసింది. ఉద్యోగాల స్థానిక క్యాడర్ల వ్యవస్థీకరణ, ప్రత్యక్ష నియామకాల నియంత్రణ కోసం ఉద్దేశించిన రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 1975 నాటి పాత ఉత్తర్వుల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనల ఆధారంగా పలు శాఖల్లోని పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ క్యాడర్లుగా వర్గీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (జులై 15న) ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం ఏపీలో మొత్తం 6 జోన్లు, 2 మల్టీ జోన్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ శాఖలు సమర్పించిన జాబితాల ఆధారంగా క్యాడర్ల వ్యవస్థీకరణ ప్రక్రియను చేపడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (AP CS) జి.సాయిప్రసాద్‌  ఉత్తర్వులు జారీ చేశారు.

    ఆగస్టు 5లోపు ఉద్యోగుల విభజన..
    ఈ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 5 లోపు కొత్త, పాత జిల్లాల మధ్య ఉద్యోగుల విభజనను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విభజన ముగిసిన అనంతరం స్పౌజ్ (భార్యాభర్తల) కేటగిరికి సంబంధించిన బదిలీల దరఖాస్తులను స్వీకరించనుంది. వాటిని ఆగస్టు 12 లోపు పరిష్కరించాలని భావిస్తోంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రత్యక్ష నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ లభిస్తుండగా, మిగిలిన 5 శాతం పోస్టులు స్థానికేతర కోటా కిందకు వస్తాయి. ఏపీ సచివాలయం, శాఖాధిపతుల (HOD) కార్యాలయాలు, రాష్ట్రస్థాయి సంస్థలు, రాజధాని ప్రాంత పరిధిలోని పోలీసు కమిషనరేట్ పోస్టులకు ఈ స్థానిక క్యాడర్ వర్తించదు. నియామకాలు, పదోన్నతులు, సీనియారిటీ, బదిలీల కొరకు జిల్లా, జోన్, మల్టీ జోన్లను ఇండిపెండెంట్ యూనిట్లుగా భావిస్తారు.

    కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా జరగనుంది. కొత్తగా ప్రకటించిన పోలవరం, మార్కాపురం  జిల్లాలు ప్రస్తుతానికి రాష్ట్రపతి ఉత్తర్వుల షెడ్యూల్‌లో లేనప్పటికీ, అధికారికంగా అందులో చేర్చేవరకు తాత్కాలికంగా పోస్టులను కేటాయిస్తారు. ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను రూపొందించి కొత్త జిల్లాలకు ఆప్షన్లు స్వీకరిస్తారు. ఈ కేటాయింపుల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు రాష్ట్రంలో కొత్త పోస్టులు ఇవ్వడం, ప్రమోషన్లు, బదిలీలు, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, డిప్యుటేషన్లపై ఏపీ ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. ఇదివరకే మంజూరైన మొత్తం పోస్టుల నుంచి ఖాళీలను మినహాయించి, డిప్యుటేషన్, సెలవు, శిక్షణ, సస్పెన్షన్‌లో ఉన్న వారిని కలుపుకున వర్కింగ్ క్యాడర్‌గానే గుర్తిస్తారు.

    ఉద్యోగుల కేటాయింపు కోసం ప్రత్యేక కమిటీలు
    ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయి కమిటీకి ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, కొత్త జిల్లా కలెక్టర్ కో-ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే, జోనల్ స్థాయి కమిటీకి సంబంధిత విభాగాధిపతులు ఛైర్మన్‌గా ఉంటూ, జోన్ పరిధిలోని జిల్లాస్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. విభాగాధిపతి నామినేట్‌ చేసిన జోనల్‌ హెడ్‌ గానీ, సంబంధిత విభాగం అధికారి గానీ సభ్య కన్వీనర్‌గా ఉంటారు.  ఇక రాష్ట్ర సచివాలయం పరిధిలో జరిగే విభజనకు సంబంధిత శాఖ సెక్రటరీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. సంబంధిత విభాగాధిపతి సభ్య కన్వీనర్‌గా, కార్యదర్శి నామినేట్‌ చేసిన అధికారి సభ్యులుగా ఉంటారు.

    Click here to Read More
    Previous Article
    IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
    Next Article
    India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment