Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

    19 hours ago

    Strategist Kapil Sahu: ప్రశాంత్ కిషోర్ లేని ఐ-ప్యాక్‌కు వైఎస్ జగన్ గుడ్ బై. తమిళనాడులో దళపతి విజయ్ పార్టీని గెలిపించిన వ్యూహకర్త కపిల్ సాహును రంగంలోకి దించుతోంది వైసీపీ.

    YS Jagan New Political Strategist:  రాజకీయాల్లో వ్యూహకర్తలకు గ్లామర్ పెంచిన ఘనత ప్రశాంత్ కిషోర్  దే అనడంలో సందేహం లేదు. నాడు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం పీఠంపై కూర్చోబెట్టడంలో పీకే టీం ఐ ప్యాక్ పోషించిన పాత్ర అసాధారణం. కానీ, ప్రశాంత్ కిషోర్ లేని ఐ-ప్యాక్ క్రమంగా తన పదును కోల్పోయింది. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, మొన్నటి బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడంలోనూ, ఏపీలో వైసీపీ 11 సీట్లకు పడిపోవడంలోనూ ఐ-ప్యాక్ చేతకానితనం, క్షేత్రస్థాయి వ్యూహాల లోపాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో జగన్ ఐ-ప్యాక్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి, పీకే రేంజ్ సక్సెస్ ఇవ్వగల కొత్త బ్రెయిన్ కోసం అన్వేషణ ముమ్మరం చేశారు.

    విజయ్‌కు పని చేసిన స్ట్రాటజిస్ట్‌తోచర్చలు

    గత కొద్ది నెలలుగా ఒకరిద్దరు వ్యూహకర్తలను వైసీపీ రంగంలోకి దించినప్పటికీ.. వారి  ఇన్పుట్స్  క్షేత్రస్థాయిలో ఏమాత్రం వర్కవుట్ కాలేదు.  సూపర్ స్టార్ దళపతి విజయ్ నేతృత్వంలోని  తమిళగ వెట్రి కజగం' పార్టీని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విజయతీరాలకు చేర్చిన రియల్ మాస్టర్‌మైండ్ కపిల్ సాహుపై వైసీపీ కన్నుపడింది. ఒకప్పుడు ఐ-ప్యాక్ నుంచే తన కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత ఢిల్లీలో ఆప్, సిక్కింలో ఎస్డీఎఫ్ వంటి పార్టీల వెనుక ఉండి చక్రం తిప్పిన కపిల్ సాహును తమ పార్టీ తరపున పని చేసేలా చేసేందుకు  వైసీపీ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

    జెన్ జీ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు

    తమిళనాడులో విజయ్ గ్రాండ్ సక్సెస్ సాధించడం వెనుక సాంప్రదాయ రాజకీయ వ్యూహాలు లేవు. అక్కడ పని చేసింది పూర్తి భిన్నమైన, ఆధునిక  జెన్ జీ మోడల్. కపిల్ సాహు నేతృత్వంలోని 12 మంది కోర్ టీమ్ సోషల్ మీడియా వేదికలను, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్,  డిజిటల్ నెరేటివ్ ఇంజనీరింగ్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లారు. విజయ్ ఇమేజ్‌ను ఒక సాదాసీదా వైట్ షర్ట్-ఖాకీ ప్యాంట్  మాస్ ఐడెంటిటీ గా మార్చి యువతలోకి చొచ్చుకెళ్లిన విధానమే టీవీకేను గెలిపించింది. ఇప్పుడు సరిగ్గా ఇదే తరహా సోషల్ మీడియా అటాకింగ్ స్ట్రాటజీ జగన్ మేకోవర్ కోసం అవసరమని వైసీపీ గట్టిగా నమ్ముతోంది.

    జగన్ పొలిటికల్ ఇమేజ్‌కు ఇటీవలి కాలంలో సమస్యలు

    ప్రస్తుత తరుణంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ ఇమేజ్ తీవ్రమైన సంక్షోభంలో పడిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇటీవల కాలంలో జగన్ ప్రెస్ మీట్లు, ప్రకటనలు  డిజిటల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ఆయన ఇచ్చే కొన్ని విచిత్రమైన స్టేట్‌మెంట్లు, బాడీ లాంగ్వేజ్ ప్రత్యర్థులకు మీమ్ మెటీరియల్‌గా మారుతున్నాయి. గతంలో ఉన్న స్ట్రాంగ్ అండ్ క్రెడిబుల్ లీడర్  ఇమేజ్ స్థానంలో ఒకవిధమైన గందరగోళం కనిపిస్తోంది. ఈ నెగెటివ్ ఇంప్రెషన్‌ను ప్రజల మైండ్స్ నుండి పూర్తిగా చెరిపేసి, సరికొత్త పొలిటికల్ మేకోవర్‌తో జగన్‌ను ప్రజల ముందుకు తీసుకురావడమే కపిల్ సాహుకు అప్పగించబోయే ప్రధాన టాస్క్.

    డిజిటల్ పైనే దృష్టి పెట్టనున్న వైసీపీ 

    రాబోయే రోజుల్లో సాంప్రదాయ పద్ధతుల్లో మీటింగులు పెట్టడం కంటే.. డిజిటల్ అల్గారిథమ్స్, షార్ట్ వీడియో కంటెంట్ ద్వారానే ఓటర్ల సైకాలజీని మార్చవచ్చని కపిల్ సాహు గతంలో నిరూపించారు. వైసీపీకి క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన క్యాడర్, సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను ఈ సరికొత్త టెక్నాలజీతో అనుసంధానిస్తే పాత వైభవాన్ని తిరిగి తేవచ్చని భావిస్తున్నారు. జగన్ ఉన్నపళంగా తన డైలాగ్ డెలివరీ, ప్రజల్లోకి వెళ్లే విధానాన్ని మార్చుకుని, తమిళనాడు విజయ్ తరహాలో ఒక ఫ్రెష్ పొలిటికల్ వేవ్‌ను సృష్టించగలిగితేనే కూటమి స్పీడ్‌కు బ్రేకులు వేయడం సాధ్యమవుతుంది.   పాత ఐ-ప్యాక్ గుర్తులను తుడిచేసి, ప్రశాంత్ కిషోర్ మార్కు పొలిటికల్ మైండ్ గేమ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చేందుకు జగన్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. మరి విజయ్‌ను సింహాసనంపై కూర్చోబెట్టిన కపిల్ సాహు.. తీవ్ర ఒడిదొడుకుల్లో ఉన్న వైసీపీ పడవను తీరం దాటించగలరా? జగన్ కొత్త మేకోవర్ ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందనేది రానున్న రోజుల్లో తేలనుంది.

    Click here to Read More
    Previous Article
    KTR GHMC Elections Strategy: గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
    Next Article
    IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment