Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Spirit: 'స్పిరిట్' షూటింగ్ అప్డేట్... ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో విన్నారా?

    2 hours ago

    Spirit Shooting Update: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా 'స్పిరిట్'. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో సినిమా అప్డేట్ ఇచ్చారు దర్శకుడు.

    Prabhas Sandeep Reddy Vanga's Spirit Shooting Update: రెబల్ స్టార్ ప్రభాస్‌కు 'ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్' అని ట్యాగ్ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. 'స్పిరిట్' సినిమా అనౌన్స్‌మెంట్ వాయిస్ టీజర్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీకి దడ పుట్టించారు. ఆ తర్వాత ఫస్ట్ లుక్ పోస్టర్, ఆయన ఇచ్చే అప్డేట్స్ అంతకు మించి అనేట్టు ఉన్నాయి. లేటెస్టుగా ఓ ఈవెంట్‌లో షూటింగ్ ఎంత పర్సెంటేజ్ అయ్యిందనేది చెప్పారు సందీప్ రెడ్డి వంగా.

    మీ అందరికీ నచ్చుతుంది...
    40 శాతం చిత్రీకరణ పూర్తి చేశాం!
    ''స్పిరిట్' సినిమా మీ అందరికీ (అభిమానులు, ప్రేక్షకులు) నచ్చుతుంది'' అని సందీప్ రెడ్డి వంగా చెప్పారు. అంతే కాదు... 40 శాతం చిత్రీకరణ పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు.
    అమెరికాలోని నార్త్ కరొలినా, చార్లెటీలో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association) నిర్వహించిన వేడుకల్లో సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామ్ గోపాల్ వర్మతో పాటు ఆయన స్టేజి షేర్ చేసుకున్నారు. అక్కడ 'స్పిరిట్' షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. అదీ సంగతి. 
    ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి కథానాయికగా నటిస్తున్న 'స్పిరిట్' సినిమాలో ప్రకాష్ రాజ్, కాంచన, వివేక్ ఒబెరాయ్ ఇతర కీలక తారాగణం. అకాడమీ టాపర్ అయిన ఓ ఐపీఎస్ అధికారి ప్రవర్తనపై ఓ సీనియర్ అధికారి ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? ఐపీఎస్ అధికారికి ఎందుకు రిమాండ్ విధించారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న చిత్రమిది.

    'యానిమల్' పాటకు ఆర్జీవీ డ్యాన్స్!
    రామ్ గోపాల్ వర్మపై తన అభిమానాన్ని సందీప్ రెడ్డి వంగా పలు సందర్భాల్లో చూపించారు. అయితే... ఈసారి సందీప్ రెడ్డి వంగా సినిమా 'యానిమల్' మీద తన అభిమానాన్ని చూపించారు రామ్ గోపాల్ వర్మ. 

    'యానిమల్' సినిమాలోని బాబీ డియోల్ సాంగ్ 'జమాల్ కుడు'కు స్టెప్స్ వేశారు ఆర్జీవీ. అది అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచింది.

    Click here to Read More
    Previous Article
    Nandamuri Deepika: ఎన్టీఆర్ వదిన రాజకీయాల్లోకి వస్తారా? సేవా కార్యక్రమాల్లో హరికృష్ణ పెద్ద కోడలు
    Next Article
    Manasaagadhe Song Lyrics: మనసాగదే సాంగ్ లిరిక్స్... తారా సుతారియాతో యశ్ రొమాంటిక్ మెలోడీ... ట్రెండింగ్‌లో 'టాక్సిక్' సెకండ్ సింగిల్

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment