Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Manasaagadhe Song Lyrics: మనసాగదే సాంగ్ లిరిక్స్... తారా సుతారియాతో యశ్ రొమాంటిక్ మెలోడీ... ట్రెండింగ్‌లో 'టాక్సిక్' సెకండ్ సింగిల్

    3 hours ago

    Toxic Second Song Lyrics: 'టాక్సిక్'లో రెండో పాట విడుదలైంది. మొదటి పాటలో కియారా అద్వానీ కనిపిస్తే... రెండో పాటలో తారా సుతారియాతో యశ్ రొమాన్స్ చేశారు. ఆ సాంగ్ లిరిక్స్ చూస్తే...

    Manasaagadhe Song Lyrics In Telugu: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. ఇందులో రెండో పాటను విడుదల చేశారు. ఫస్ట్ సాంగ్ 'తబాహీ'లో కియారా అద్వానీతో యశ్ రొమాన్స్ చేశారు. ఆ పాటకు రికార్డు బ్రేకింగ్ వ్యూస్, రెస్పాన్స్ వచ్చాయి. చార్ట్‌ బస్టర్‌ అయ్యింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ 'మనసాగదే' (తెలుగు వెర్షన్)ను విడుదల చేశారు. ఇందులో తారా సుతారియాతో యశ్ రొమాన్స్ చేశారు. ఇదీ ఛార్ట్ బస్టర్ నంబరే. 

    'మనసాగదే...' సాంగ్ లిరిక్స్ చూశారా?
    ప్రేమలో కొత్త కోణాన్ని పరిచయం చేసేలా 'మనసాగదే' పాట సాగిందని విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. బాధలో తారా సుతారియాకు చేరువైన యశ్... ఆమెకు ఓదార్పు ఇస్తారు. రాయా పాత్రలో యశ్, రెబెక్కా పాత్రలో తారా సుతారియా మధ్య గాఢమైన ప్రేమ - అనుబంధాన్ని పాటలో ఆవిష్కరించారు. పాట మధ్యలో కియారా అద్వానీ, నయనతార సైతం తళుక్కున మెరిశారు. 

    పల్లవి

    బలమైన మెరుపేదో
    నను తాకి కనుమరుగైందే
    బరువైన సుడిగాలిలో
    నా ఏకాంతమే నలుగుతున్నదే

    అంతులేని అలజడి ఏంటిలా
    బదులే లేని ప్రశ్నై మిగిలానే
    తీయని మంటలా నిన్నటి వెన్నెలా
    కదిలిపోతున్నా నా దారి వదలనన్నదే (2)

    మనసాగదే
    కొనసాగదే
    నను నన్నుగా
    నిలువనీయదే

    ఉసురాగదే
    ఉసురాడదే
    ప్రియ మధురమే
    మరణమైందే

    చరణం

    నా కలలో నేనున్నాక
    కలలే వెలుగన్నాక
    ఇటుగా రాకే  కిరణమా
    నా హృదయం కోరే ఉదయం
    నీలో లేదన్నాక
    తెలవారకే గగనమా (2)

    ఇదే చూపుని...
    మరో వైపుకి
    మాయేదో చేసి
    మరల్చేదెలా?

    ఏదో మార్పుని
    ఇదే తూర్పుని
    నన్నే నేను చెరిపేసి
    నవ్వెదెలా?

    మనసాగదే
    కొనసాగదే (2)
    మనసాగదే

    'మనసాగదే...' పాటకు తనిష్క్ బాగ్చి, అర్స్లాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా సంగీతం అందించారు. ముగ్గురు స్వరపరిచిన బాణీకి... తెలుగులో రామజోగయ్య శాస్త్రి  సాహిత్యాన్ని అందించారు. రొమాంటిక్ మెలోడీగా రూపొందిన పాటకు సిద్ధార్థ్ బస్రూర్ తన గాత్రంతో ప్రాణం పోశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా పాటను విడుదల చేశారు. ఇతర భాషల్లో వేర్వేరు లిరిసిస్టులు పాటను రాశారు.

    యష్, గీతూ మోహన్‌ దాస్ కలిసి కథ అందించిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గీతూ మోహన్‌ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ నిర్మాత. ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నారు. యశ్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్'లో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి - ఐదుగురు హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

    Click here to Read More
    Previous Article
    Spirit: 'స్పిరిట్' షూటింగ్ అప్డేట్... ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏం చెప్పారో విన్నారా?
    Next Article
    TDP YSRCP Political Row: అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!

    Related సినిమా Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment