Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !

    2 hours ago

    PM Modi on NEET Paper Leak | పేపర్ లీక్ కు వ్యతిరేకంగా బిల్లు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది.

    న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్‌లను అరికట్టేందుకు బిల్లు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న కాపీయింగ్ వ్యతిరేక చట్టాలను మరింత కఠినతరం చేయనున్నారు. భవిష్యత్తులో పేపర్ లీక్ చేయాలంటేనే భయపడిపోయేలా యాంటీ పేపర్ లీక్ చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, పేపర్ లీక్‌లపై ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన బిల్లులోనే సవరణలు చేసి నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. నీట్ పేపర్ లీక్‌లపై ఢిల్లీలో జరుగుతున్న నిరసనల తర్వాత 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) చట్టం, 2024'లో సవరణలు తీసుకురావాలని మోదీ సర్కార్ యోచిస్తోంది.

    గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, కోటి రూపాయల జరిమానా..
    పేపర్ లీక్‌లు అడ్డుకునే బిల్లులో ప్రతిపాదిత సవరణలకు శుక్రవారం (జూలై 24) జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఆమోదం లభించవచ్చు. కొత్త సవరణల తర్వాత, పేపర్ లీక్‌లో దోషులుగా తేలిన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. అయితే, దీనిపై కేబినెట్ భేటీ తరువాతే క్లారిటీ రానుంది. కాక్రోచ్ జనతా పార్టీ నేతలతో కేంద్ర మంత్రులు చర్చలు ప్రారంభించారు. ముఖ్యంగా సీజేపీ నేతలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా 3 డిమాండ్లను కేంద్రం ముందుంచారు.

    పేపర్ లీక్ బిల్లును ప్రస్తావించిన ప్రధాని మోదీ

    విద్యార్థుల నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి కీలక ప్రకటన చేశారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ, 'పేపర్ లీక్ ఘటన సాధారణ విషయం కాదు. గత రెండున్నర నెలలుగా దీనిపై చర్యలు తీసుకున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం ఆదేశాలు ఇచ్చాను. పలు శాఖలు నాకు అర్ధరాత్రి ఒక ప్రతిపాదనను అందించాయి. ఈ ప్రతిపాదనపై శుక్రవారం కేంద్ర క్యాబినెట్‌లో చర్చ జరుగుతుంది. క్యాబినెట్ సహచరుల సూచనల తర్వాత పేపర్ లీక్ బిల్లుపై తుది ప్రకటన చేస్తాం. ఆ బిల్లును వీలైనంత త్వరగా సభలో ఆమోదింపజేయడానికి ప్రయత్నిస్తాం' అని అన్నారు.

     

    పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నివారణ) చట్టం, 2024 ప్రకారం పేపర్ లీక్ కేసులలో 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల  వరకు జరిమానా విధించే రూల్ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని మరింత కఠినతరం చేయడానికి సిద్ధమవుతోంది. లేకపోతే కొత్త బిల్లు ప్రవేశపెట్టి కఠిన చర్యలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

    కొత్త సవరణలు ఏమేం ఉండవచ్చు?

    • కేసుల వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు ఎక్కువ అధికారాలు ఇవ్వనున్నారు.
    • గతంలో 3 నుండి 5 సంవత్సరాల జైలు శిక్ష.. కొత్త బిల్లు ద్వారా ఇప్పుడు 5 నుండి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. 
    • గతంలో విధించే జరిమానా మొత్తాన్ని 10 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు పెంచవచ్చు.

    Click here to Read More
    Previous Article
    Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment