Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!

    2 hours ago

    Polavaram Right Canal Water Issue: పోలవరం కాల్వ నుంచి మోటార్ల ద్వారా నీళ్లు తోడుకునే అకాశం రైతులకు ఇవ్వాలని చంద్రబాబుకు వల్లభనేని వంశీలేఖ రాశారు. అనుమతులు లేకపోయినా వాడుకోనివ్వాలన్నారు.

    Pattiseema Water Gannavaram Metta Area: గన్నవరం నియోజకవర్గ పరిధిలోని డెల్టా ఆయకట్టుతో పాటు మెట్ట ప్రాంత రైతులకు పోలవరం కుడి కాల్వ ద్వారా పట్టిసీమ నీరందించి ఆదుకోవాలని మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించే క్రమంలో, కృష్ణా డెల్టాతో పాటు కాల్వ పరివాహక ప్రాంతాల్లోని మెట్ట గ్రామాలకు నీటిని వినియోగించుకునే అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత దుర్భిక్ష పరిస్థితుల్లో సత్వరమే స్పందించి నీటిపారుదల శాఖ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

    లేఖలోని వివరాల ప్రకారం.. గత 11 సంవత్సరాలుగా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లిస్తుండటం వల్ల కృష్ణా డెల్టా ఆయకట్టుకు కొండంత భరోసా లభించిందని వంశీ పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఈ జలాలు రైతులకు ఆపద్బాంధవిగా మారాయని గుర్తుచేశారు. 2015లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో, పోలవరం కుడి కాల్వ నిర్మాణానికి భూములిచ్చిన గన్నవరం మెట్ట ప్రాంత రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పట్టిసీమ నీటిని వాడుకునేందుకు సీఎం చంద్రబాబు మానవతా దృక్పథంతో అనుమతించారని లేఖలో గుర్తుచేశారు.                

    అప్పట్లో తన స్వంత ఖర్చులతో బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ రూరల్ మండలాల పరిధిలోని 36 కీలక ప్రాంతాల్లో దాదాపు 500కు పైగా విద్యుత్తు మోటార్లను ఏర్పాటు చేసినట్లు వంశీ వివరించారు. దీనిద్వారా సాగునీటితో పాటు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చెరువులను నింపడం జరిగిందన్నారు. తాను శాసనసభ్యుడిగా ఉన్న పదేళ్ల కాలంలో, అధికారుల నుంచి అభ్యంతరాలు వచ్చినా సీఎం చంద్రబాబు చొరవతో 9 సంవత్సరాల పాటు నిరాటంకంగా పట్టిసీమ నీటిని అందించగలిగానని, ఆ తర్వాత  వైసీపీ  ప్రభుత్వ హయాంలోనూ ఈ వ్యవస్థ కొనసాగిందని లేఖలో స్పష్టం చేశారు.                  

    అయితే, ఈ ఏడాది పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంతాలకు మళ్లించే అవకాశం లేకుండా నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసులు బందోబస్తుతో ఎక్కడికక్కడ విద్యుత్ మోటార్లను నిలిపివేయిస్తుండటం పట్ల వంశీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  ఎల్ నినో  ప్రభావంతో ఇప్పటికే తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్న మెట్ట ప్రాంత రైతులకు, ఇప్పుడు నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని, రైతాంగం తీవ్ర ఆందోళనలో కూరుకుపోయిందని లేఖలో పేర్కొన్నారు.

    క్షేత్రస్థాయిలోని తీవ్రమైన పరిస్థితులు, మెట్ట ప్రాంత రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించాలని వంశీ ఆర్థించారు. గతంలో మాదిరిగానే మానవతా దృక్పథంతో పట్టిసీమ జలాలను మెట్ట ప్రాంత రైతులు వాడుకునేలా అనుమతించాలని, అందుకు అనుగుణంగా మోటార్ల పునరుద్ధరణకు నీటిపారుదల, విద్యుత్ శాఖల అధికారులను ఆదేశించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.       

    Click here to Read More
    Previous Article
    AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు - 3,168 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - చేనేతలకు నేతన్న భరోసా !

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment