Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Jani Master : జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ - మెగాస్టార్, బాలయ్య ఎంట్రీతో కాంట్రవర్సీకి చెక్

    19 hours ago

    Jani Master Reaction : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు భారీ ఊరట దక్కింది. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య చొరవతో డ్యాన్సర్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదానికి తెర పడింది.

    Film Federation Check To Dancers Association Controversy : మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య చొరవతో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆయనకు సహాయ నిరాకరణ చేయాలన్న నిర్ణయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ వెనక్కి తీసుకుంది. దీంతో డ్యాన్సర్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదానికి తెర పడింది. జానీ మాస్టర్ వివరణతో సంతృప్తి చెందినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ తెలిపాారు.

    సుమలత ఆధ్వర్యంలోనే...

    జానీ మాస్టర్ భార్య సుమలత ఆధ్వర్యంలోనే అసోసియేషన్ కంటిన్యూ అవుతుందని అనిల్ తెలిపారు. 'ప్రస్తుతం డ్యాన్సర్ అసోసియేషన్‌కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న జనరల్ సెక్రటరీపై చర్యలు ఉంటాయి. ఈ నెల 26న జనరల్ బాడీ మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయంలో నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించేందుకు తగిన ప్రయత్నాలు చేశారు. వారికి మా ఫెడరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.' అని చెప్పారు.

    'కాంట్రవర్సీకి చెక్'

    24 క్రాఫ్ట్స్‌కు ఫెడరేషన్ కావాలని... అది దృష్టిలో పెట్టుకునే తాను వివరణ ఇచ్చినట్లు చెప్పారు జానీ మాస్టర్. 'పెద్దలందరితో మాట్లాడి చర్చించాం. నా వివరణకు సంతృప్తి చెందడంతో ఈ సమస్య ఇక్కడితో ముగించిందని ఆశిస్తున్నాను. బాలకృష్ణ, చిరంజీవి ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్నా ముందుకు వస్తారు. అలాగే ఈ సమస్యను కూడా చొరవ తీసుకుని పరిష్కరించారు.' అని అన్నారు.

    గత కొన్ని రోజులుగా అనేక వివాదాలతో డ్యాన్సర్లు ఇబ్బందులు పడ్డారని... పెద్దలు వచ్చి ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేశారని సుమలత తెలిపారు. 'అందరూ బావుండాలని వారు ఈ సమస్యను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లడం మాకు చాలా సంతోషకరం. కార్మికుల కష్టం వృథా పోకూడదు, వారికి రావల్సినంత ఫలితం వారికి రావాలి. శ్రమ దోపిడి జరగకూడదు. ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.' అని తెలిపారు. 

    అసలేం జరిగిందంటే?

     

    డ్యాన్సర్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య రీసెంట్‌గా వివాదం రేగిన సంగతి తెలిసిందే. యూనియన్‌లో అవినీతి చేసే వారిపై చర్యలు తీసుకుంటే ఫెడరేషన్ అడ్డు పడుతోందని జానీ మాస్టర్ ఆరోపించారు. సస్పెండ్ అయిన సభ్యులను తిరిగి తీసుకోవాలని కూడా ఫెడరేషన్ ఒత్తిడి తెస్తుందని అన్నారు. దీనిపై నిర్మాతలకు కంప్లైంట్ చేశారు. జానీ మాస్టర్ భార్య, ప్రెసిడెంట్ సుమలత నిర్మాతలతో సమావేశమై... ఫెడరేషన్ జోక్యం లేకుండా చూడాలని కోరారు. దీంతో జానీ మాస్టర్‌పై బహిష్కరణ వరకూ వివాదం చేరగా... బాలయ్య, చిరు చొరవతో సమస్య పరిష్కారమై... కాంట్రవర్సీకి చెక్ పడింది.

    Click here to Read More
    Previous Article
    Spain FIFA World Cup Glory: స్పెయిన్ డ‌బుల్ ధ‌మాకా.. రెండోసారి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ గా నిలిచిన స్పానిష్ టీమ్.. ఈ కార‌ణాల‌తోనే ఫైన‌ల్లో అర్జెంటీనా ఓట‌మి..!
    Next Article
    Objection My Lord Series OTT : లాయర్‌గా శ్రీకాంత్... ఓటీటీలోకి కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment