Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు

    18 hours ago

    Parliament Session | న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వర్షాకాలం, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. ఈ రెండూ చురుగ్గా సాగితే దేశ సంక్షేమానికి గొప్ప ఫలితాలు వస్తాయని ఆకాంక్షించారు. అందుకే ఈ రెండూ మెరుగ్గా ఉండాలని, అంతా సజావుగా సాగాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ సభల్లో ఎలాంటి గందరగోళ పరిస్థితులకు తావులేకుండా, ఉభయ సభలలోనూ అర్థవంతమైన చర్చలు జరగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

    మరోవైపు, అంతరిక్ష రంగ స్టార్టప్‌ 'స్కైరూట్' చేపట్టిన 'విక్రమ్‌-1' ప్రయోగం విజయవంతం అవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కేవలం 28 ఏళ్ల సగటు వయసున్న యువ ఆవిష్కర్తలే ఈ అద్భుత ఘనత సాధించారని ఆయన కొనియాడారు. ఇదే సమయంలో.. తాను ఇక్కడ 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదంటూ కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ పరోక్షంగా చమత్కరిస్తూ విమర్శలు గుప్పించారు.
    పేపర్ లీక్, అయోధ్య రామాలయం విరాళాలు కీలకాంశాలు.. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
     ఢిల్లీ:  నేడు పార్లమెంట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా  కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు చాలా ముఖ్యమైన అంశాలలో పేపర్ లీక్ ఒకటి. దీనిపై సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యువత అంతా డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్‌లో కూడా ఇదే మా అజెండా అని క్లారిటీగా చెబుతున్నాం. మరో ముఖ్యమైన అంశం అయోధ్య రామాలయం విరాళాలు, నిధులు మాయం. కానీ శ్రీరాముడి కానుకలను రామాలయాన్ని రక్షించాల్సిన వ్యక్తులే లూటీ చేశారు. బిజెపితో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నుండి వచ్చిన వ్యక్తులు అయి ఉండి ఇలాంటి పాపపు పనులు చేశారు. ఈ అంశాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు కోరుకుంటున్నాయని’ తెలిపారు.

    Click here to Read More
    Previous Article
    Parliament Monsoon Session 2026 Big Bills: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు - తెరవెనుక బిగ్ బిల్స్ వ్యూహం - దేశ రాజకీయాన్ని మార్చబోతున్న కీలక బిల్లులు!
    Next Article
    Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment