Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!

    1 hour ago

    Mumbai Rains: మహారాష్ట్రను ముంచెత్తుతున్నాయి భారీ వర్షాలు. పుణె ఘాట్ రోడ్లలో 200 మిమీ, నగరంలో 100 మిమీ పైగా వర్షపాతం నమోదు అయింది. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే మూసివేశారు.

    IMD Mumbai Rainfall Waterlogging Toll:  మహారాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చాయి. గత 48 గంటలుగా కురుస్తున్న అసాధారణ భారీ వర్షాలకు ఆర్థిక రాజధాని ముంబైతో పాటు సాంస్కృతిక రాజధాని పుణె నగరం పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా పుణె జిల్లాలోని పశ్చిమ కనుమలు పరిధిలో మేఘమథనం జరుగుతోంది. ఘాట్ సెక్షన్లలోని పలు వాతావరణ కేంద్రాల్లో ఇప్పటికే 200 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, పుణె నగర పరిసర ప్రాంతాల్లో సగటున  100 మిమీ మార్కును  దాటేసింది. ఈ జలప్రళయం కారణంగా ఇటు పుణె, అటు ముంబై,  కొంకణ్ రీజియన్‌లలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. భారత వాతావరణ శాఖ  ముంబై, ఠాణే, పాల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన  రెడ్ అలర్ట్ జారీ చేసింది.     
    ఈ భారీ వర్షాల ధాటికి ముంబై-పుణె నగరాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. నిరంతరాయంగా కురుస్తున్న వానలకు ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే లోని ఖోపోలి-కుస్గావ్  మిస్సింగ్ లింక్ సొరంగం సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. టన్నుల కొద్దీ రాళ్లు, మట్టి రోడ్డుపైకి దూసుకురావడంతో ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు పాత ముంబై-పుణె హైవేపై కూడా రాత్రీపగలు ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు. ముంబై డివిజన్ పరిధిలోని థాకూర్వాడి - మంకీ హిల్ సెక్షన్ల మధ్య రైల్వే ట్రాక్‌లపై కూడా కొండరాళ్లు పడటంతో ముంబై-పుణె మధ్య నడిచే ఇంటర్‌సిటీ మరియు సుదూర ప్రాంతాల రైళ్లను  రైల్వే శాఖ రద్దు చేసింది లేదా దారిమళ్లించింది.  
    వర్షాల తీవ్రతను దృష్ట్యా ముంబై, పుణె, ఠాణే, నవీ ముంబై పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు విద్యాశాఖ తక్షణ సెలవు ప్రకటించింది. ప్రైవేట్ ఆఫీసుల ఉద్యోగులకు  వర్క్ ఫ్రమ్ హోమ్  ఇవ్వాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పుణె జిల్లాలోని మావల్ తహసీల్ పరిధిలో ఒక ఇల్లు కొండచరియల కింద నలిగిపోగా, ఇంద్రాయణి నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆలంది మున్సిపల్ కౌన్సిల్ నదిపై ఉన్న అన్ని వంతెనలను మూసివేసింది. పుణె-కోలాడ్ రోడ్డు ఒక విభాగంలో కుంగిపోవడంతో ఆ రూట్ క్లోజ్ అయింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన  సింహగడ్ కోట ను రెండు రోజుల పాటు పూర్తిగా బంద్ చేశారు. పుణె శివార్లలో వరదల్లో చిక్కుకుపోయిన ఒక ప్రైవేట్ బస్సులోని 37 మంది ప్రయాణికులను ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ప్రాణాలకు తెగించి సురక్షితంగా రక్షించాయి.  

    Click here to Read More
    Previous Article
    Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు

    Related వార్తలు Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment